పీఎం ఉత్తరాది పర్యటన: ప్రధాని నరేంద్ర మోదీ నేడు మూడు ఉత్తరారి రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛండీగఢ్ లలో ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
వంశధార ట్రిబ్యూనల్ పర్యటన: నేడు ప్రకాశం బ్యారేజీని సందర్శించనున్న వంశధార ట్రిబ్యూనల్. ముగ్గురు సీనియర్ జడ్జిలు సహా 17 మంది న్యాయవాదులు బ్యారేజీని పరిశీలిస్తారు.
చైనాలో కేసీఆర్: పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన ధేయంగా కొనసాగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చైనా పర్యటన ఐదో రోజుకు చేరుకుంది.
షర్మిల పరామర్శయాత్ర: వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శయాత్ర ఐదో రోజుకు చేరుకుంది. కామారెడ్డిపల్లె, మల్లక్కపేట, నాగారం, లక్ష్మీపురం, ఇసిపేట, జంగేడు గ్రామాల్లో వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక తనువుచాలించినవారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు.
కేశవరెడ్డి కేసు: విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అక్రమంగా డిపాజిట్లు సేకరించిన కేసులో కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డి అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన సమీక్షకోసం ఏపీ డీజీపీ జేవీ రాముడు, సీఐడీ చీఫ్ లు నేడు కర్నూలు వెళ్లనున్నారు.
వానలే వానలు: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నది. రేపటి నుంచి మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
యూఎస్ ఓపెన్: న్యూయార్క్ వేదికగా జరుగుతున్న యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో శుక్రవారం ఉదయం(భారత కాలమానం ప్రకారం) జరగాల్సిన మహిళల సింగిల్స్ సెమీస్ మ్యాచ్ లు వర్షం కారణంగా వాయిదా పడ్డాయి. సాయంత్రానికి మ్యాచ్ లు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ కూడా ఈరోజే జరగనుంది.
టుడే న్యూస్ అప్డేట్స్
Published Fri, Sep 11 2015 6:25 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 AM
Advertisement
Advertisement