ఈ రోజు వార్తావిశేషాలు | today news updates | Sakshi
Sakshi News home page

ఈ రోజు వార్తావిశేషాలు

Published Wed, Sep 9 2015 8:08 AM | Last Updated on Sun, Sep 3 2017 9:04 AM

today news updates

కేంద్ర క్యాబినెట్ భేటీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం మరోసారి స్వల్పకాలిక పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై చర్చించే అవకాశం.

హిందీ మహాసభలు: భోపాల్ నగరంలో బుధవారం నుంచి మూడు రోజులపాటు జరిగే 10 వ హిందీ మహాసభలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రులతోపాటు పలువురు హిందీ భాషా కోవిదులు ఈ సభలకు హాజరవుతారు.

కేసీఆర్ కీలక ప్రసంగం: చైనా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు.. నేడు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుల్లో కీలక ప్రసంగం చేయనున్నారు. 10 రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 7న కేసీఆర్ బృందం చైనా వెళ్లడం తెలిసిందే.

రైతు కోసం చంద్రన్న: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 'రైతు కోసం చంద్రన్న' పేరుతో సరికొత్త యాత్రకు శ్రీకారం చుట్టారు. నేడు శ్రీకాకుళం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 29న అనంతపురంలో ముగియనుంది.

పురస్కారం ప్రదానం: భారత అంతరీక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు మహాత్మాగాంధీ జాతీయ శాంతి పురస్కారాన్ని ప్రకటించిన దరిమిలా.. బుధవారం ఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. ఇస్రో ప్రతినిధులకు అవార్డును ప్రదానం చేయనున్నారు.

విద్యుత్ ఉద్యోగుల ఆందోళన: ఏపీ స్థానికత కారణంగా తెలంగాణ ప్రభుత్వ విధుల నుంచి బహిష్కరణకు గురైన 1200 మంది విద్యుత్ ఉద్యోగులు నేటి నుంచి ఆందోళనలు నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement