న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ మంగళవారం పర్యటిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కరవుపై ఆయన చర్చించనున్నారు.
న్యూఢిల్లీ: నేడు జమ్మూకశ్మీర్ లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఆయన పర్యటనలో భాగంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభిస్తారు.
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీ జిల్లా అధ్యక్షులు, పరిశీలకుల సమావేశం కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరుగనుంది. ఈ సమావేశంలో కరవు పరిస్థితులపై ప్రభుత్వ నిర్లక్ష్యం, సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని సర్కార్ ఆదుకోకపోవడం వంటి కీలక అంశాలపై చర్చిస్తారు.
తెలంగాణ: నేటి నుంచి తెలంగాణలో టీడీపీ బృందం కరవు పరిశీలన చేయనుంది. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులను కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ దృష్టికి తీసుకువెళ్లతారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫలితాలు మంగళవారం ఉదయం10 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేస్తారు. తొలిసారిగా ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు.
విజయవాడ: నేడు విజయవాడలో గిరిజన మహిళా సర్పంచుల జాతీయ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో మహిళా సర్పంచులు హాజరవుతారు.
తిరుమల: నేటి నుంచి మూడు రోజులపాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి. దీంతో ఆలయాధికారులు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
స్పోర్ట్స్: ఐపీఎల్-9లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.