పశ్చిమబెంగాల్: నేడు పశ్చిమబెంగాల్ ఐదో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.
తెలంగాణ: తెలంగాణ అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సమావేశం శనివారం జరగనుంది. పలు కీలక బిల్లులపై సమావేశంలో చర్చిస్తారు.
తెలంగాణ: మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు రెండో రోజు పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శనివారం విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్: ఏపీ లా సెట్-2016 దరఖాస్తుల గడువు శనివారంతో ముగిస్తుంది. అపరాధ రుసుం లేకుండా నేటితో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంగా శనివారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ వేదికగా ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. రాత్రి 8 గంటలకు హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగును.
స్పోర్ట్స్: ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ సెమీ ఫైనల్ శనివారం జరుగనుంది. చైనా క్రీడాకారిణి యిహాన్ వాంగ్‌తో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తలపడనుంది.
టుడే న్యూస్ అప్‌డేట్స్
Published Sat, Apr 30 2016 7:28 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
Advertisement
Advertisement