ఈరోజు వార్తావిశేషాలు | today news updates | Sakshi
Sakshi News home page

ఈరోజు వార్తావిశేషాలు

Published Mon, Aug 31 2015 7:00 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 AM

ఈరోజు వార్తావిశేషాలు

ఈరోజు వార్తావిశేషాలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు: సోమవారం ఉదయం 9:30 గంటల నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసన సభ సహా శాసన మండలి కొలువుదీరనున్న నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. సభ ప్రారంభానికి ముందే.. అంటే 8:30 గంటలకు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరగనుంది. సభ ఏవిధంగా సాగలనే విషయాలను ఈ కమిటీ చర్చిస్తుంది.

 

పోరుబాటలో ప్రతిపక్షం: ఏపీకి ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. పలు అంశాల్లో ప్రభుత్వ తీరును ఎండగట్టాలని భావిస్తున్నది. కేవలం ఐదు రోజులు మాత్రమే సభను జరపాలనన్న బాబు సర్కార్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, కనీసం 15 రోఉల పాటైనా సమావేశాలు నిర్వహించాలని కోరుతున్నది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఈ ఉదయం గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా వెళ్లనున్నారు.

డిగ్గీరాజా పర్యటన: కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. మద్యాహ్నం హైదరాబాద్ లో జరగనున్న ఓ సమావేశంలో రంగారెడ్డి జిల్లా బీజేపీ నేత తూర్పు జయప్రకాశ్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇతర జిల్లాల్లోనూ దిగ్విజయ్ పర్యటించే అవకాశాలున్నాయి.

భూ ఆర్డినెన్స్: కేంద్ర ప్రభుత్వం సిఫారసుతో రాష్ట్రపతి ఆమోదించిన భూసేకరణ చట్టం సవరణల బిల్లు ఆర్డినెన్స్ గడువు నేటితో ముగియనుంది. భూ సేకరణపై ఆయా రాష్ట్రాలే నిర్ణయం తీసుకునే విధంగా చట్టంలో నిబంధనలు చేర్చాలనుకున్న దరిమిలా మరోసారి ఆర్డినెన్స్ జారీ చేయబోమని కేంద్రప్రభుత్వం ఆదివారం స్పష్టం చేసింది.

 

గ్రూప్స్ సిలబస్:  గ్రూప్-1, గ్రూప్-2  పోస్టుల భర్తీకి తెలంగాన పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీపీపీఎస్సీ) నిర్వహించనున్న పరీక్షలకు సంబంధించిన సిలబస్ నేడు వెల్లడికానుంది. సెప్టెంబర్ లో పరీక్షల ఈ నెలలో పరీక్షల తేదిని ప్రకటించి, డిసెంబర్ లో పరీక్షలు నిర్వహించనున్నట్లు టీపీపీఎస్సీ అధ్యక్షుడు ఘంటా చక్రపాణి ఇదివరకే ప్రకటించిన నేపథ్యంలో సిలబర్ ప్రకటన కోసం అభ్యర్థులు ఆత్రుతగా ఎదురుచేస్తున్న సంగతి తెలిసిందే.

 

బీజేపీ ధర్నా: మహబూబ్ నగర్ జిల్లాలో సాగు, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో తలెత్తిన ఆలస్యాన్ని నిరసిస్తూ, ఆయా ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయాలనే డిమాండ్ తో భారతీయ జనాపార్టీ ఈరోజు ధర్నా నిర్వహించనున్నది. ధర్నాలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సహా పలువురు కీలక నేతలూ పాల్గొననున్నారు.

పవర్ ప్రొడక్షన్ బంద్: నేటి నుంచి శ్రీశైలం జలాశయం వద్ద విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోనుంది. వర్షాభావ పరిస్థితులతో జలాశయంలోకి నీరు చేరకపోవడంతో ఇప్పటికే నీటి నిలువలు అడుగంటాయి. దీంతో సోమవారం నుండి శ్రీశైలం డ్యామ్ ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

టీచర్ల బదిలీలు: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పనిచేస్తోన్న ప్రభుత్వ టీచర్ల బదిలీ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. మెరిట్ ఆధారంగా బదిలీలు చేపడతామని సంబంధిత అధికారులు ప్రకటించారు.

కొలంబో టెస్టు: సింహాళీ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో ఆతిథ్య శ్రీలంక, భారత జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్ లో 111 పరుగుల ఆధిక్యాన్ని సాధించిన భారత్.. రెండో ఇన్నింగ్స్ లో 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలో సోమవారం నాటి ఆట కీలకం కానుంది. వరుణుడు అడ్డుపడకుంటే ఫలితం తప్పక వచ్చే అవకాశాలున్నాయి.

యూఎస్ ఓపెన్ టెన్నిస్: నేటి నుంచి యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ ప్రారంభం కానుంది. రాత్రి 8:30 గంటలకు మొదటి మ్యాచ్ జరుగుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement