గిరిజనులతో రాహుల్ డ్యాన్సులు.. వీడియో వైరల్.. | Rahul Gandhi Dances With Toda Tribal Community In Tamil Nadu | Sakshi
Sakshi News home page

గిరిజనులతో రాహుల్ డ్యాన్సులు.. చేయి చేయి పట్టుకుని.. వీడియో వైరల్..

Aug 13 2023 7:27 AM | Updated on Aug 13 2023 7:31 AM

Rahul Gandhi Dances With Toda Tribal Community In Tamil Nadu - Sakshi

చెన్నై: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్భంగా ముత్తునాడు గ్రామంలో గిరిజన తెగలతో కలిసి జనాపద నృత్యంలో చిందులేశారు. ఎంపీ పదవి పునరుద్ధరణ జరిగిన తర్వాత రాహుల్ గాంధీ మొదటిసారి కేరళ, తమిళనాడులో పర్యటించారు. తన సొంత నియోజకవర్గం అయిన వయనాడ్‌లో కూడా పర్యటించారు. 

తమిళనాడులో తోడాలు అనే గిరిజన తెగలు ప్రసిద్ధిగాంచారు. పర్యటనలో భాగంగా వారితో కలిసి రాహుల్ గాంధీ ఆడిపాడారు. చేయిచేయి కలిపి జానపద నృత్యంలో చిందులేశారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ పంచుకుంది. ఇది కాస్త వైరల్‌గా మారింది.

పర్యటనలో భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటి సమావేశాల్లో కూడా రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పర్యటనకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీటి సిద్ధిక్ ఈ మేరకు తెలిపారు. 

ఇదీ చదవండి: మోదీ దేశానికి రాజు కావాలనుకుంటున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement