tribal community
-
గిరిజనులతో రాహుల్ డ్యాన్సులు.. వీడియో వైరల్..
చెన్నై: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్భంగా ముత్తునాడు గ్రామంలో గిరిజన తెగలతో కలిసి జనాపద నృత్యంలో చిందులేశారు. ఎంపీ పదవి పునరుద్ధరణ జరిగిన తర్వాత రాహుల్ గాంధీ మొదటిసారి కేరళ, తమిళనాడులో పర్యటించారు. తన సొంత నియోజకవర్గం అయిన వయనాడ్‌లో కూడా పర్యటించారు. తమిళనాడులో తోడాలు అనే గిరిజన తెగలు ప్రసిద్ధిగాంచారు. పర్యటనలో భాగంగా వారితో కలిసి రాహుల్ గాంధీ ఆడిపాడారు. చేయిచేయి కలిపి జానపద నృత్యంలో చిందులేశారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ పంచుకుంది. ఇది కాస్త వైరల్‌గా మారింది. #WATCH | Congress MP Rahul Gandhi with members of the Toda tribal community in Muthunadu village near Ooty in Tamil Nadu pic.twitter.com/g7iBVcKhTJ — ANI (@ANI) August 12, 2023 పర్యటనలో భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటి సమావేశాల్లో కూడా రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పర్యటనకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీటి సిద్ధిక్ ఈ మేరకు తెలిపారు. ఇదీ చదవండి: మోదీ దేశానికి రాజు కావాలనుకుంటున్నారు -
వద్దన్నా నాతో బలవంతంగా డ్యాన్స్ చేయించారు
భువనేశ్వర్: ఒడిషాకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత కమలా పుజారి తీవ్ర అనారోగ్యంతో ఈ మధ్య ఆస్పత్రి పాలయ్యారు. ఆమె పరిస్థితి విషమించిందని, కోలుకోవడం కష్టమని వైద్యులు సైతం చేతులేత్తేశారు. అయితే 71 ఏళ్ల ఆ పెద్దావిడ అనూహ్యంగా కోలుకుని.. ఇంటికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇదిలా ఉంటే.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే ముందు.. ఐసీయూలో ఆమె డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో సదరు వీడియోపై ఆమెకు ప్రశ్నలు ఎదురుకాగా.. ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యం బాగోలేకున్నా తనతో బలవంతంగా డ్యాన్స్ చేయించారంటూ ఆమె సోషల్ వర్కర్ మమతా బెహెరాపై ఆరోపణలు గుప్పించారు. ‘డ్యాన్స్ చేయాలనే ఉద్దేశం నాకు ఎంత మాత్రం లేదు. వద్దని నేను ఆమెతో(మమతను ఉద్దేశించి) చెప్తూనే ఉన్నా. కానీ, ఆమె వినలేదు. అప్పటికే నేను అనారోగ్యంతో కుంగిపోయి ఉన్నా. ఒపిక లేదు. అయినా బలవంతంగా నాతో ఆమె డ్యాన్స్ చేయించింది’ అని కోరాపుట్‌లో తన ఆరోగ్యంపై పరామర్శించేందుకు వచ్చిన మీడియాతో కమల పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఒడిషా పజారా గిరిజన తెకు చెందిన కమలా పుజారికి వ్యవసాయ రంగంలో అందించిన సేవలకు గానూ భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీని 2019లో అందుకున్నారు. సేంద్రీయ వ్యవసాయం, 100 రకాల పాతతరం విత్తనాల నిల్వకుగానూ ఆమె ఈ గౌరవం దక్కింది. అయితే.. కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో ఆమె పరిస్థితి విషమించగా.. ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటున్నారు. ఇక బలవంతంగా ఆమెతో డ్యాన్స్ చేయించిన ఘటనకుగానూ.. మమతపై ఒడిషా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పజారా తెగ సంఘం నేత హరీష్ ముదులీ డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే.. ఆందోళన చేపడతాని హెచ్చరించారు. మరోవైపు ఆమె చికిత్స అందుకున్న కటక్ ఎస్సీబీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఈ వ్యవహారంపై స్సందించింది. పుజారా ఐసీయూలో అడ్మిట్ కాలేదని, ఆమెకంటూ ప్రత్యేకమైన క్యాబిన్ ఒకటి కేటాయించామని, ఆ క్యాబిన్‌లోనే సదరు డ్యాన్స్ వీడియో వైరల్ అయ్యిందని ఒక ప్రకటనలో తెలిపింది. ఇక పుజారితో పాటు ఆస్పత్రిలో వెంట ఉన్న రాజీబ్ హిలాల్.. మమతా బెహెరా ఎవరో తనకు తెలియదని, అభిమానంటూ సెల్ఫీలు తీసుకోవడానికి వచ్చి ఇదంతా చేసిందని తెలిపారు. మమతా బెహెరా మాత్రం ఆమెలో బద్ధకాన్ని పొగొట్టి.. హుషారు నింపేందుకు అలా చేయించానని చెప్తున్నారు. Video Source: OTV ఇదీ చదవండి: బస్సు ఫుట్‌బోర్డు ప్రయాణం.. చావు తప్పి.. -
భూమి, ఆర్థిక సాయం అందించాలి: గుస్సాడీ రాజు
సాక్షి, కొమురం భీమ్(ఆసిఫాబాద్): గుస్సాడీ కళలో పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని కుమురంభీం జిల్లా మర్లవాయి గ్రామానికి చెందిన 60 ఏళ్ల కనక రాజు ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన పద్మ పురస్కారాల జాబితాలో రాష్ట్రం నుంచి ఒక్కరికే పద్మశ్రీ వరించింది. ఆదివాసీల సంప్రదాయ గుస్సాడీ నృత్యంలో ప్రావీణ్యం పొందిన రాజును వరించడం విశేషం. ఆయన్ని స్థానికులు గుస్సాడీ రాజుగా పిలుస్తారు. చదవండి: మన గుస్సాడీ రాజుకు పద్మశ్రీ పద్మశ్రీ అవార్డు వరించిన కనక రాజు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..‘ పద్మశ్రీ అవార్డు లభించడం సంతోషంగా ఉంది. గుస్సాడీ కళలో తనకు పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. ఈ అవార్డు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ఇది అదివాసీలకు లభించిన గౌరవంగా భావిస్తున్నా. గుస్సాడీ కళను వందల మందికి నేర్పించాను. ప్రముఖులు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం ముందు ఢిల్లీలో ప్రదర్శనలు ఇచ్చాను. పేద కళాకారున్ని సర్కార్ అదుకోవాలి. సర్కార్ భూమి, అర్థిక సహాయం అందించాలని కోరుతున్నాను’ అని ఆయన తెలిపారు. గత 40 ఏళ్లుగా గుస్సాడీ నృత్య ప్రదర్శనలు ఇస్తున్న రాజు.. ఎంతోమంది యువతకు ఇప్పటికీ ఆ నృత్యాన్ని నేర్పిస్తున్న సంగతి తెలిసిందే. -
మన గుస్సాడీ రాజుకు పద్మశ్రీ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన పద్మ పురస్కారాల జాబితాలో రాష్ట్రం నుంచి ఒక్కరికే పద్మశ్రీ వరించింది. కుమురంభీం జిల్లా మర్లవాయి గ్రామానికి చెందిన 60 ఏళ్ల కనక రాజుకు ఈ ఘనత దక్కింది. ఆదివాసీల సంప్రదాయ గుస్సాడీ నృత్యంలో ప్రావీణ్యం పొందిన రాజును గుస్సాడీ రాజుగా పిలుస్తారు. 1981లో అప్పటి ప్రధాని ఇందిర ముందు, అనంతరం దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమక్షంలోనూ, ఢిల్లీ ఎర్రకోటలో గణతంత్ర వేడుకల్లో రాజు గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శించారు. గత 40 ఏళ్లుగా గుస్సాడీ నృత్య ప్రదర్శనలు ఇస్తున్న రాజు.. ఎంతోమంది యువతకు ఇప్పటికీ ఆ నృత్యాన్ని నేర్పిస్తున్నారు. అవార్డు రావడం సంతోషంగా ఉంది నాకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల ఆనందంగా ఉంది. ఇందిరాగాంధీ ముందు ప్రదర్శన ఇచ్చాను. బహుమతిగా గుస్సాడీ టోపీ కూడా ఇచ్చాను. హన్ను మాస్టారు స్పూర్తితో ముందుకు సాగుతున్నా. – కనక రాజు, పద్మశ్రీ అవార్డు గ్రహీత. -
ఆశతీరక ఆగ్రహం
వేతన బకాయిల కోసం కదం తొక్కిన ఆశ కార్యకర్తలు ఐటీడీఏ ముట్టడి ఉద్రిక్తం ఏపీఓ హామీతో తాత్కాలికంగా ఆందోళన విరమణ పాడేరు : అసలే చాలీచాలని వేతనం. రూ.400 గౌరవ వేతనాలతో వెట్టి చాకిరీ చేస్తున్నా...అదీ సకాలంలో అందని దుస్థితి. బకాయిలు అడిగితే ఇదిగో అదిగో అంటూ తిప్పలు పెట్టే ఐడీడీఏ...దీంతో కడుపు మండిన ఆశ కార్యకర్తలు ఐటీడీఏను చుట్టుముట్టారు. 14 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలోని ఆశ కార్యకర్తలంతా ఈ ఆందోళనలో కదం కలిపారు. సీఐటీయు, గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఏజెన్సీలోని 36 ఆరోగ్య కేంద్రాల పరిధిలో పనిచేస్తున్న సుమారు 1500 మంది ఆశ కార్యకర్తలు సోమవారం ఉదయాన్నే పాడేరుకు చేరుకొని ఐటీడీఏ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. బకాయి వేతనాలు, టీఏ, డీఏలు వెంటనే చెల్లించాలని నెలకు రూ.3 వేలు చొప్పున వేతనాలు పెంచాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆశల నినాదాలతో ఐటీడీఏ ప్రాంతం దద్దరిల్లింది. ఓవైపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పాడేరు ఎస్ఐ ధనుంజయ్ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు ఐటీడీఏ చుట్టూ భద్రతా చర్యలు చేపట్టాయి. మధ్యాహ్నం వరకు ధర్నా కార్యక్రమంతో తమ సమస్యలపై నినాదాలు చేస్తున్నా ఐటీడీఏ అధికారుల్లో కదలిక లేకపోవడంతో వారిలో ఆగ్రహం పెల్లుబికింది. వీరంతా ఒక్క ఉదుటున ఐటీడీఏ కార్యాలయం లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే రెండు గేట్లను మూసివేయడంతో బయట నుంచే ఆశ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. తమకు బకాయి వేతనాలు పూర్తిగా చెల్లించే వరకు విధుల్లో చేరేది లేదని ఇక్కడే మకాం ఉంటామంటూ మహిళలు గర్జించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సమావేశం నిమిత్తం విశాఖపట్నం వెళ్లిపోవడంతో ఇక్కడ ఐటీడీఏ ఏపీఓ పీవీఎస్ నాయుడు ఫోన్ ద్వారా ఆయనకు ఆశ కార్యకర్తల ఆందోళన విషయాన్ని తెలియపరిచారు. ఐటీడీఏ పీఓకూడా ఈ సమస్యను జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆందోళన కారులతో చర్చలు జరపాలని ఐటీడీఏ పీఓను ఆదేశించారు. దీంతో ఏపీఓ పీవీఎస్ నాయుడు సీఐటీయు, గిరిజన సంఘం, ఆశ కార్యకర్తల సంఘం నాయకులను చర్చలకు ఆహ్వానించారు. ఇప్పటికే 4 నెలల గౌరవ వేతనాలు ఆశ కార్యకర్తల బ్యాంకు అకౌంట్లలో జమచేశామని, మిగిలిన 9 నెలల వేతనాలను కూడా ప్రభుత్వం వెంటనే మంజూరు చేసేలా జిల్లా కలెక్టరు చర్యలు తీసుకుంటారని ఏపీఓ హామీ ఇచ్చారు. అనంతరం ఆశ కార్యకర్తల ధర్నా కార్యక్రమానికి కూడా ఏపీఓ చేరుకొని బకాయి వేతనాల చెల్లింపులకు ఐటీడీఏ చేపట్టే అత్యవసర చర్యలను వివరించారు. అయినప్పటికి కొంత మంది ఆశ కార్యకర్తలు సంతృప్తి చెందలేదు. వేతనాల చెల్లింపులను పక్కనపెట్టి రాత్రి పగలు తేడా లేకుండా సాటి గిరిజనుల వైద్యానికి శ్రమిస్తున్నామని, శ్రమకు తగ్గ వేతనాలు రూ.3 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశ కార్యకర్తలకు వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఏపీఓ తెలపడంతో ఆశ కార్యకర్తలంతా ఈ ఆందోళన కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరమించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా అధ్యక్షులు ఎం.సూర్యనారాయణ, డివిజన్ కార్యదర్శి ఆర్.శంకరరావు, జిల్లా నాయకులు ఎంఎం శ్రీను, పాలికి లక్కు, సుందరరావు, ఆశ కార్యకర్తలసంఘం జిల్లా అధ్యక్షురాలు బి.రామలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు ఇ.ప్రభ, పాడేరు డివిజన్ అధ్యక్షురాలు వై.మంగమ్మ, అన్ని మండలాలనాయకులు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
పోలవరంపై పోరాటం
తెలంగాణ గిరిజన సంఘం హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని, ఇందుకోసం అన్ని సంఘాలతో కలిసి బలమైన ఉద్యమాన్ని నిర్మించాలని వక్తలు పిలుపునిచ్చారు. పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారమిక్కడ పోలవరం ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ సదస్సు జరిగింది. తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ డాక్టర్ కె. నాగేశ్వర్, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రొఫెసర్ హరగోపాల్, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు. సదస్సులో కోదండరాం మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ వల్ల కాంట్రాక్టర్లకు మాత్రమే ప్రయోజనం కలుగుతుందన్నారు. గతంలో ఈ గ్రామాలో ఆంధ్రప్రాంతంలో ఉండేవని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అంటున్నారని, అయితే సరిహద్దులు ప్రజల అవసరాల కోసం జరుగుతాయా? పాలకుల అవసరాల కోసం జరుగుతాయా? అని ప్రశ్నించారు. సమావేశంలో గిరిజన సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ధర్మానాయక్, శ్రీరాములు నాయక్,ప్రొఫెసర్ బంగ్యా భూక్యా, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు కె.గోవర్ధన్, సూర్యం తదితరులు పాల్గొన్నారు.