Rahul Gandhi: సీఎం స్టాలిన్‌ను సర్‌ప్రైజ్‌ చేసిన రాహుల్‌ | Rahul Gandhi Buys Mysore Pak For Tamil Nadu CM MK Stalin In Coimbatore Poll Rally, See Details - Sakshi
Sakshi News home page

‘డియర్‌ బ్రదర్‌ గిఫ్ట్‌ ఫర్‌ యూ’.. సీఎం స్టాలిన్‌ను సర్‌ప్రైజ్‌ చేసిన రాహుల్‌

Published Sat, Apr 13 2024 9:25 AM | Last Updated on Sat, Apr 13 2024 10:08 AM

Rahul Gandhi Buy Mysore Pak For Tamil Nadu CM MK Stalin - Sakshi

చెన్నై: దేశంలో ఎన్నికల సీజన్‌ నడుస్తోంది. ఎక్కడ చూసినా ఎన్నికల ప్రచారమే కనిపిస్తోంది. దీంతో, నేతలు బిజీ అయిపోయారు. ఈ క్రమంలో తమిళనాడు సీఎం స్టాలిన్‌ కోసం కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన పని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఇండియా కూటమి ప్రచారంలో భాగంగా రాహుల్‌ గాంధీ తమిళనాడుకు వచ్చారు. ఈ సందర్భంగా కోయంబత్తూరులో కూటమి మీటింగ్‌కు వెళ్లాల్సి ఉండగా.. రాహుల్‌ ఆశ్చర్యకంగా సింగనల్లూరులోని ఒక స్వీట్‌ షాప్‌లోకి వెళ్లి వారిని సర్‌ప్రైజ్‌ చేశారు. రాహుల్‌ ఆ షాప్‌లోకి వెళ్లడంతో అక్కడున్న వారంతా ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం.. అక్కడే స్వీట్స్‌ తిన్న రాహుల్‌ దుకాణదారుడు, అక్కడ పనిచేసే వారితో మాట్లాడి ఫొటోలు దిగారు. ఈ క్రమంలో రాహుల్‌ ఒక కిలో మైసూర్‌పాక్‌ కొనుగోలు చేశారు.  


అయితే, తాను కొనుగోలు చేసిన స్వీట్స్‌ ప్యాకెట్‌ ఎవరి కోసమా అని కాంగ్రెస్‌ నేతలు ఆలోచన పడ్డారు. అనంతరం, కూటమి తలపెట్టిన సభ వద్దకు వెళ్లిన రాహుల్‌.. ఆ మైసూర్‌పాక్‌ స్వీట్‌ ‍ప్యాకెట్‌ను తమిళనాడు సీ​ఎం స్టాలిన్‌కు అందించారు. ఈ సందర్బంగా తన కోసం స్వీట్స్‌ తేవడంతో స్టాలిన్‌ ఒకింత ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement