చెన్ననై: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు, ఎంపీ కార్తీ చిదంబరానికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మద్దతుగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ క్రమశిక్షణా కమిటీ తరపున మాజీ ఎమ్మెల్యే కేఆర్ రామసామి ఈ నోటీసులు జారీ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు.
కాగా ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న కార్తీ.. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి ప్రస్తావించారు. రాహుల్ కంటే ప్రధాని మోదీకి ఎక్కువ పాపులారిటీ ఉందని వ్యాఖ్యానించారు. మోదీతో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సరిపోతారా అనే ప్రశ్నకు చిదంబరం స్పందిస్తూ.. బీజేపీ ప్రచార యంత్రాంగానికి ఎవరూ సరిపోరని అన్నారు. ప్రధాని మోదీకి ప్రజాదరణ అధికంగా ఉందని.. ఆయన్ను మరొకరితో పోల్చమని అడిగితే.. తాను వెంటనే ఎవరి పేరు చెప్పలేనని అన్నారు
అదే విధంగా కాంగ్రెస్ వ్యతిరేకివస్తున్న ఈవీఎంల మిషన్ల వాడకం గురించి కార్తీ మద్దతుగా మాట్లాడారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ఇటీవల ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఈవీఎమ్‌లపై విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై పార్టీ నేతలు మండిపడుతున్నారు.
అయితే పార్లమెంటరీ సభ్యుడికి నోటీసులు జారీ చేసే అధికారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి మాత్రమే ఉందని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. తమిళనాడులో ఆయనను ముఖ్యనేతగా ఎదగనివ్వకుండా చేసేందుకే జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే షోకాజ్ నోటీసులు జారీ చేశారని ఆరోపించాయి.
చదవండి: జనవరి 22న ఉత్తర ప్రదేశ్‌లో విద్యాసంస్థలకు సెలవు
Comments
Please login to add a commentAdd a comment