TA
-
‘రాహుల్ కంటే మోదీ పాపులర్’ వ్యాఖ్యలు.. చిక్కుల్లో కార్తీ చిదంబరం
చెన్ననై: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు, ఎంపీ కార్తీ చిదంబరానికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మద్దతుగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ క్రమశిక్షణా కమిటీ తరపున మాజీ ఎమ్మెల్యే కేఆర్ రామసామి ఈ నోటీసులు జారీ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. కాగా ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న కార్తీ.. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి ప్రస్తావించారు. రాహుల్ కంటే ప్రధాని మోదీకి ఎక్కువ పాపులారిటీ ఉందని వ్యాఖ్యానించారు. మోదీతో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సరిపోతారా అనే ప్రశ్నకు చిదంబరం స్పందిస్తూ.. బీజేపీ ప్రచార యంత్రాంగానికి ఎవరూ సరిపోరని అన్నారు. ప్రధాని మోదీకి ప్రజాదరణ అధికంగా ఉందని.. ఆయన్ను మరొకరితో పోల్చమని అడిగితే.. తాను వెంటనే ఎవరి పేరు చెప్పలేనని అన్నారు అదే విధంగా కాంగ్రెస్ వ్యతిరేకివస్తున్న ఈవీఎంల మిషన్ల వాడకం గురించి కార్తీ మద్దతుగా మాట్లాడారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ఇటీవల ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఈవీఎమ్‌లపై విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై పార్టీ నేతలు మండిపడుతున్నారు. అయితే పార్లమెంటరీ సభ్యుడికి నోటీసులు జారీ చేసే అధికారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి మాత్రమే ఉందని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. తమిళనాడులో ఆయనను ముఖ్యనేతగా ఎదగనివ్వకుండా చేసేందుకే జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే షోకాజ్ నోటీసులు జారీ చేశారని ఆరోపించాయి. చదవండి: జనవరి 22న ఉత్తర ప్రదేశ్‌లో విద్యాసంస్థలకు సెలవు -
హీరోయిన్ సునయన కామెంట్స్.. నచ్చిందే చేస్తానని!
దక్షిణాదిలో 18 ఏళ్లుగా హీరోయిన్ గా రాణిస్తున్న భామ సునయన. తెలుగు సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. మహారాష్ట్రకు చెందిన ఈ బ్యూటీ.. తమిళం, మలయాళం, కన్నడం భాషల్లోనూ నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె ప్రధాన పాత్రలో నటించిన రెజీనా చిత్రం పాన్ ఇండియా స్థాయిలో శుక్రవారం తెరపైకి రానుంది. తాజాగా ప్రమోషన్స్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నా కుటుంబం, తమిళ ప్రేక్షకుల నుంచి ప్రేమ, ఆదరణ చాలానే లభించాయి. అందుకు వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. రెజీనా చిత్రం నా కెరీర్లో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే 2018లో నేన ఏం చేయాలన్న దాని గురించి చాలామంది చాలా విషయాలు చెప్పారు. అప్పుడు ఏం అనిపిస్తే అదే చేయాలని ఫిక్సయ్యాను. ఆ తర్వాత మంచి ఆలోచనాత్మక సినిమాలని ఎంపిక చేసుకోవడం ప్రారంభించను.' 'ఈ క్రమంలోనే అలా ఎలా నటించడానికి అంగీకరించావని అన్నారు. ఆ సమయంలో చాలా మందికి వెబ్ సీరీస్ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి. అందుకే చాలా మంది అటువైపు దృష్టి సారించలేదని, అయితే వెబ్ సీరీస్‌లో నటించడం నాకు నచ్చింది. అందుకే నచ్చింది చేయాలని అనుకున్నాను. ఆ తర్వాత తమిళంలో సిల్లుక్కరు పట్టి, తెలుగులో రాజరాజ చోళ లాంటి డిఫరెంట్ మూవీస్ చేశాను. ఈ 'రెజీనా' చిత్రం కూడా అలాంటిదే' అని సునయన చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!) -
తమిళనాట ట్విస్టులు.. పళనిస్వామి, పన్నీరు సెల్వానికి షాకిచ్చిన మోదీ!
సాక్షి, చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పలికే వారి జాబితాలో మాత్రమే అన్నాడీఎంకే నేతలు పన్నీరు, పళని స్వామికి అనుమతి దక్కింది. కానీ, రాజ్‌భవన్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు అపాయింట్మెంట్ లభించలేదని సమాచారం. కాగా, అన్నాడీఎంకే అంతర్గత పోరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై పర్యటన సందర్భంగా వీరి మధ్య విబేధాలకు శుభం కార్డు పడే అవకాశం ఉంది.. అనే చర్చ ఇన్నాళ్లూ సాగుతూ వచ్చింది. ఈ ఇద్దరు నేతలు వేర్వేరుగా మోదీని కలిసేందుకు అపాయిమెంట్ కోరినట్లు కూడా తెలిసింది. అయితే, ఈ ఇద్దరికీ మోదీతో ప్రత్యేక భేటీకి అనుమతి దక్కలేదు. చెన్నై విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పలికే కార్యక్రమానికి మాత్రం ఈ ఇద్దరికి అధికారులు అనుమతిచ్చారు. ఢిల్లీ వెళ్లినా ప్రధానితో భేటీ కాలేకపోయిన నేపథ్యంలో చెన్నైలోనైనా అవకాశం వస్తుందని ఎదురు చూసిన పళని స్వామికి ఇది పెద్ద షాకే అని భావిస్తున్నారు. అదే సమయంలో మోదీ ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నించిన పన్నీరుకూ ఇది భంగపాటే. ఒకరిపై ఒకరు.. అన్నాడీఎంకే కార్యాలయం ధ్వంసం విషయంపై పన్నీరు సెల్వంను ఇరకాటంలో పెట్టేందుకు పళని స్వామి శిబిరం దూకుడు పెంచింది. ఈ కార్యాలయంలో రికార్డులు, కీలక వస్తువులు మాయమైనట్లు ఇప్పటికే ఆ శిబిరం వర్గాలు ఆరోపించాయి. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ పళని మద్దతు ఎంపీ సీవీ షణ్ముగం డీజీపీ శైలేంద్ర బాబును కలవడం గమనార్హం. అదే సమయంలో వీరి ఎత్తులకు పైఎత్తు వేయడానికి పన్నీరు సిద్ధమయ్యారు. తన కుమారుడు రవీంద్రనాథ్ను అన్నాడీఎంకే ఎంపీగా పరిగణించకూడదని పళనిస్వామి శిబిరం పార్లమెంట్ స్పీకర్‌కు లేఖ రాయడాన్ని పన్నీరు పరిగణనలోకి తీసుకున్నారు. అదే సమయంలో పళని స్వామి వెంట ఉన్న 63 మంది ఎమ్మెల్యేలను అన్నాడీఎంకే సభ్యులుగా పరిగణించకూడదని పేర్కొంటూ, వారిపై వేటుకు పన్నీరు సెల్వం వ్యూహ రచన చేస్తున్నారు. ఈమేరకు అసెంబ్లీ స్పీకర్ అప్పావును కలిసి ఇందుకు లేఖ సమరి్పంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇక, అన్నాడీఎంకే కార్యాలయం తలుపులను కాలితో తన్ని పగలకొట్టిన వారి తొక్కి నలిపేద్దామని మద్దతు దారుల కు బుధవారం తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళని స్వామి పిలుపు నివ్వడంతో ఇద్దరు నేతల మధ్య వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: శివసేన నుంచి మరో సీఎం వస్తారు.. బీజేపీ మాట తప్పడం వల్లే ఎంవీఏ పుట్టింది -
లైంగిక వేధింపులు.. ఆన్లైన్ క్లాస్‌లో టవల్‌తో టీచర్
చెన్నై: మన సమాజంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుకే ఉంది. ఉపాధ్యాయుడు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి.. జీవితంలో వారు ఉన్నత స్థానానికి చేరడానికి దోహదపడతాడు. అయితే నేటి తరం గురువుల్లో కొందరు గురవింద గింజలుంటున్నారు. పాఠాలు చెప్పే వంకతో విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. కీచకులుగా మారుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. ఓ టీచర్ ఆన్లైన్ క్లాస్‌ల పేరుతో విద్యార్థినిలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. బాధితులు సదరు టీచర్ అరాచకాల గురించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వివాదం పెను దుమారం రేపుతోంది. ఆ వివరాలు.. తమిళనాడు రాజధాని చెన్నైలోని పద్మ శేషాద్రి బాలభవన్(పీఎస్‌బీబీ) స్కూల్లో చోటుచేసుకుంది. వివరాలు.. పద్మ శేషాద్రి బాలభవన్ స్కూల్ కేకే నగర్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న రాజగోపాలన్ అనే ఉపాధ్యాయుడు.. అకౌంటన్సీ అండ్ బిజినెస్ స్టడీస్ సబ్జెక్ట్స్ బోధిస్తుంటాడు. పాఠాలు చెప్పే సమయంలో చేసే రాజగోపాలన్ తమను తప్పుడు దృష్టితో చూస్తున్నాడని ఆ స్కూల్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు రాజేంద్రన్ అకృత్యాల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పీఎస్‌బీబీ స్కూల్ పూర్వ విద్యార్థులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. రాజగోపాలన్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డీన్‌కు లేఖ రాశారు. అంతేకాకుండా ఈ విషయంపై విచారణ జరపాలని కోరారు. స్కూల్లో క్లాసులు జరిగే సమయంలో.. రాజగోపాలన్ అమ్మాయిలతో అనుచితంగా ప్రవర్తించేవాడని పూర్వవిద్యార్థులు వారి లేఖలో పేర్కొన్నారు. అమ్మాయిలను అనుచితంగా తాకడంతో పాటు.. లైంగిక పరమైన ప్రశ్నలు అడిగి ఇబ్బందులకు గురిచేసేవాడని ఆరోపించారు. అలాగే క్లాస్‌లో అందరి ముందు విద్యార్థినిలపై లైంగికపరమైన కామెంట్స్ చేసేవాడని తెలిపారు. శరీరాకృతి గురించి మాట్లాడేవాడని చెప్పారు. స్లీవ్ లెస్ దస్తులు ధరించిన విద్యార్థినులను పొగిడేవాడని లేఖలో వెల్లడించారు. లాక్డౌన్ కాలంలో జరిగిన ఆన్లైన్ క్లాసులకు రాజగోపాలన్ ఒక టవల్ మాత్రమే ధరించి హాజరైనట్టు పూర్వ విద్యార్థులు ఆరోపించారు. అలాగే విద్యార్థినిలకు మెసేజ్‌లు చేయడంతోపాటు.. వారి వాట్సప్ ప్రొఫైల్ ఫొటోలపై కామెంట్స్ చేసేవాడని అన్నారు. కొందరికి ఫొటోలు అందంగా ఉన్నాయంటూ.. పిచ్చి పిచ్చి కామెంట్స్ పంపాడని చెప్పారు. ఓ విద్యార్థినిని తనతో పాటు సినిమాకు రావాల్సిందిగా కోరాడని తెలిపారు. ఇక, రాజగోపాలన్ గురించి మేనేజ్మెంట్కు పలుసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని పలువురు విద్యార్థులు ఆరోపించారు. మరోవైపు ఈ అంశంపై డీఎంకే ఎంపీ కనిమొళి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘చెన్నైలోని పీఎస్‌బీబీ స్కూల్లో ఓ టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు రావడం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై విచారణ జరపాలని, ఇందులో ప్రమేయం ఉన్న పాఠశాల అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళతానని నేను హామీ ఇస్తున్నాను’అని కనిమొళి తెలిపారు. The sexual harassment allegations against a commerce teacher in PSBB School,Chennai has been shocking. Inquiry should be conducted and action must be taken against those who are involved including school authorities who failed to act against the complaints from students. (1/3) — Kanimozhi (கனிமொழி) (@KanimozhiDMK) May 24, 2021 చదవండి: కీచక టీచర్, విద్యార్థులకు అశ్లీల దృశ్యాలు.. -
ఓ విషయంలో మోసపోయా: రజనీకాంత్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ఒక విషయంలో మోసపోయా’నని అన్నారు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్. చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణమండపంలో గురువారం ఉదయం రజనీ మక్కల్ మన్రం జిల్లా కార్యదర్శులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఓ విషయంలో తాను మోసపోయానని అనడం చర్చనీయాంశమైంది. పార్టీ ఏర్పాటుపై రాని స్పష్టత రాజకీయ అరంగేట్రం చేసి క్రియాశీలక పాత్ర పోషిస్తానని 2017 డిసెంబర్లో అభిమానుల నడుమ రజనీకాంత్ బహిరంగంగా ప్రకటించారు. అయితే రెండేళ్లుగా పార్టీని స్థాపించకున్నా రాజకీయ విమర్శలు చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. తూత్తుకూడి కాల్పులు, పౌరహక్కుల చట్టం సవరణపై అభిప్రాయాన్ని వెలిబుచ్చి వివాదాల్లో చిక్కుకున్నారు. రజనీ విమర్శలు బీజేపీకి అనుకూలంగా మారాయి. అదే సమయంలో తనపై కాషాయం రంగు పులిమే ప్రయత్నాలు సాగుతున్నాయి, అది ఎంతమాత్రం కుదరదని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రజనీ ఇలా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల సమయానికి రజనీకాంత్ సొంతపార్టీని స్థాపించి ఒంటరిపోరుకు దిగుతారా, కమల్‌తో కలిసిపోతారా? అనేది వెయ్యిడాలర్ల ప్రశ్నగా మారింది. చదవండి: కమల్ థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం గెలుపోటములపై చర్చ.. అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగితే పార్టీ హిట్టా..ఫట్టా..అధికారంలోకి వస్తామా? తదితర వివరాలతో నివేదిక ఇవ్వాల్సిందిగా మన్రం నిర్వాహకులను సమావేశంలో రజనీ కోరినట్లు సమాచారం. నియోజకవర్గంలో ఇతర పార్టీల బలాలు? గెలిచే అభ్యర్థులు? కమల్ పార్టీతో జత కడితే లాభమా, నష్టమా? ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయా?..తదితర వివరాలతో నివేదిక సమర్పించాలని రజనీకాంత్ ఆదేశించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నిలకు సమాయత్తంకండి, ఎన్నికలు ఎçప్పుడు వచ్చినా ఢీకొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చినట్లు సమాచారం. ఇతర పార్టీలతో కూటమి జోలికి పోకుండా ఒంటరిపోరే మంచిదని కార్యదర్శులు రజనీకి సూచించినట్లు సమాచారం. సమావేశం అనంతరం రజనీ మీడియాతో మాట్లాడారు. ఏడాది తరువాత రజనీ మక్కల్ మన్రం జిల్లా కార్యదర్శులతో సమావేశమై అనేక విషయాలపై చర్చించానని అన్నారు. ఈ సమావేశం తనకు, కార్యదర్శులకు సంతృప్తినిచ్చిందని అన్నారు. ముస్లిం పెద్దలతో తాను ఇటీవల భేటీ అయ్యానని అన్నారు. సీఏఏ, ఎన్పీఆర్ గురించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నానని.. ప్రధాని మోదీ, కేంద్రహోం మంత్రి అమిత్‌షాలను కలుసుకుని చట్టంలో మార్పుల గురించి వారికి వివరించాలని సూచించాని తెలిపారు. మోదీ, అమిత్‌షాలను కలుసుకునేందుకు సహాయం చేస్తానని వారికి చెప్పానన్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ శూన్యత తన వల్ల తొలగిపోతుందా? కమల్‌తో కూటమి ఉంటుందా అనే ప్రశ్నలకు కాలమే బదులు చెబుతుందని చెప్పారు. చదవండి: శభాష్ మిత్రమా రజనీకాంత్: కమల్‌హాసన్ ఒక విషయంలో మోసపోయాను సమావేశానికి సంబంధించి ఒక విషయంలో తాను మోసపోయానని ఈ సందర్భంగా రజనీకాంత్ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అదేమిటో తర్వాత చెబుతానని అన్నారు. రజనీ మక్కల్ మన్రం కార్యకలాపాలు బయటకు పొక్కడమే రజనీ అసంతృప్తికి కారణమని సమాచారం. ఈనెల 5న కార్యదర్శులతో జరిపే సమావేశానికి హాజరుకావాల్సిందిగా రజనీకాంత్ స్వయంగా వారందరికీ ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే రెండు రోజుల క్రితమే రజనీ సమావేశంపై మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో రజనీ ఇల్లు, కల్యాణమండపం వద్ద పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు వచ్చేశారు. “మీకు వ్యక్తిగతంగా ఫోన్లో ఇచ్చిన సమాచారం మీడియా దృష్టికి ఎలా వెళ్లింది, అంతమాత్రం గోప్యం పాటించకపోతే ఎలా’ అంటూ కార్యదర్శుల ముందు రజనీ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో ముఠాతగాదాలు, వర్గపోరాటాలను ఎంతమాత్రం సహించను, అలాంటి వారు ఎవరైనా ఉంటే వైదొలగిపోండని ఒక సమావేశంలో రజనీ హెచ్చరించారు. అయితే గురువారం నాటి సమావేశానికి హాజరయ్యే సందర్భంలోనూ కొందరు వర్గపోరును కొనసాగించడం రజనీదృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. మన్రం నిర్వాహకుల్లోని విబేధాలు పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తాయని రజనీ ఆందోళన చెందడం వల్లనే “మోసపోయాను’ అని చెప్పినట్లు ఊహిస్తున్నారు. పార్టీ ఏర్పాట్లకు సంబంధించి అంతర్గత విషయాలు, రాజకీయ ప్రవేశం ప్రకటించగానే సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, బూత్ కమిటీలను ఏర్పాటు చేయాల్సిందిగా రజనీ ఆదేశించారు. సుమారు 66 వేల బూత్ కమిటీలు, ఒక కోటికిపైగా సభ్యత్వం పూర్తయినట్లు సమాచారం బయటకు వచ్చింది. ఒక సందర్భంలో రజనీ సైతం ఈ విషయాన్ని నిర్ధారించారు. అయితే ఆ తరువాత సభ్యులు, బూత్ కమిటీల జాబితాను పరిశీలించగా నకిలీ సభ్యుల వ్యహారం బయటపడింది. పార్టీలో పదవుల కోసం కొందరు ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడినట్లు రజనీకాంత్ తెలుసుకున్నారు. ఈ నకిలీ సభ్యుల చేరిక పనులను మనసులో పెట్టుకునే “మోసపోయాను’ అని వ్యాఖ్యానించినట్లు భావిస్తున్నారు. నిరాశపడిన అభిమానులు రజనీ మక్కల్ మన్రం జిల్లా కార్యదర్శుల సమావేశంలో పాల్గొనేందుకు చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణమండపానికి ఉదయం 10.25 గంటలకు రజనీ చేరుకోగా పెద్ద సంఖ్యలో గుమికూడి ఉన్న అభిమానులు “తలైవా తలైవా’ అంటూ నినాదాలు చేశారు. కారులో నుంచే వారికి అభివాదం చేస్తూ లోనికి వెళ్లిపోయారు. రాష్ట్రం నలుమూలల నుంచి 37 మంది కార్యదర్శులు హాజరుకాగా వారి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్న తరువాతనే సమావేశం హాలులోకి పంపారు. కల్యాణమండపం వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి మీడియాను సైతం లోనికి అనుమతించలేదు. సుమారు గంటన్నరపాటు రజనీ సమావేశమయ్యారు. -
ఒక్క సీటూ రాలేదు.. ఉన్న ఓట్లూ దక్కలేదు!
సాక్షి, హైదరాబాద్ : తాజా అసెంబ్లీ ఎన్నికలు సీపీఎంను అంతర్మథనంలోకి నెట్టేసింది. తమ పార్టీకి సంప్రదాయకంగా పడే ఓట్లూ రాకపోగా, ఉన్న కాస్త ఓట్లు కూడా చెదిరిపోవడంతో ఇప్పుడా పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీగా గత ఎన్నికల్లో ఓటర్లు వ్యతిరేకించినప్పటి స్థితి కంటే ఈ ఎన్నికల్లో తాము దిగజారిపోవడంతో ఆ పార్టీ నేతలు కలవర పడుతున్నారు. రాష్ట్ర రాజకీయ వాతావరణంలో వచ్చిన మార్పు,చేర్పుల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందా ? లేక కిందిస్థాయిలో సంస్థాగతంగా పార్టీ బలహీనపడిందా అన్న సందేహాలు వారిలో వ్యక్తమవున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గాల్లోనూ ఓటింగ్ చెదిరిపోవడం, ఆశించిన మేర సీట్లు రాకపోయినా ఓటింగ్ పెంచుకుంటామన్న అంచనా కుదేలవ్వడంతో పార్టీ నాయకుల్లో నిరాశా, నిస్పృహలు అలుముకున్నాయి. ఒక్క సీటయినా గెలవకపోగా, అధికశాతం నియోజకవర్గాల్లో సీపీఎం–బీఎల్ఎఫ్ అభ్యర్థులకు నామమాత్రం ఓట్లు పోలు కావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. కిందివాళ్లు రాలేదు..పై వాళ్లు దూరమయ్యారు...! రాష్ట్రంలో 90 శాతానికి పైగా ఉన్న బహుజనులకు (ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీలు, మహిళలు) ప్రాధాన్యం పెంచేందుకు, సామాజిక న్యాయం చేకూర్చేందుకు ఎజెండాను ముందుకు తీసుకెళ్లినా ఈ వర్గాల నుంచే తగిన సహకారం అందలేదని సీపీఎం– బీఎల్ఎఫ్ నేతలు వాపోతున్నారు. రాష్ట్రంలో తాము చేసిన కొత్త ప్రయోగానికి కిందిస్థాయిలోని ఆయా వర్గాలు కలిసి రాకపోగా, ఈ ఎజెండా కారణంగా ఇప్పటివరకు మద్దతుగా ఉన్న పై కులాలు, వర్గాలు కూడా పార్టీకి దూరమయ్యాయని అంచనా వేస్తున్నారు. అధికార టీఆర్ఎస్– విపక్ష కాంగ్రెస్ కూటమి మధ్యలోనే ప్రధాన పోటీ ఉండడంతో ఓటర్లు తమను పట్టించుకోలేదని సీపీఎం నాయకులు విశ్లేషిస్తున్నారు. అసలు ఈ ఎజెండాను ఎవరి కోసం చేపట్టామో దానిని కిందిస్థాయి వరకు తీసుకెళ్లి ప్రజలకు బలంగా వివరించడంలో తమ వైఫల్యం ఉందని వారు అంగీకరిస్తున్నారు. కలసి రాని తమ్మినేని పాదయాత్ర వాస్తవానికి 2019 ఎన్నికలపై ఎలాంటి ముందస్తు అంచనాలు లేకుండా 2016–2017 మధ్యలో దాదాపు ఆరునెలల పాటు పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రవ్యాప్త పాదయాత్ర కూడా ఇప్పుడు సీపీఎంకు ఆశించిన ఫలితాలు చేకూర్చక పోవడం వారిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ పాదయాత్ర అనంతరం ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు–సామాజికన్యాయం సాధనకు ‘లాల్–నీల్’ (కమ్యూనిస్టులు, బహుజనులు) పేరిట చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలివ్వడంతో ఎన్నికలకు ముందు ‘ సీపీఎం– బహుజన లెఫ్ట్ ఫ్రంట్’ (బీఎల్ఎఫ్) ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా వివిధ వామపక్షాలు, కుల, సామాజిక సంఘాలు, సంస్థలను బీఎల్‌ఎఫ్‌లోకి తెచ్చే ప్రయత్నాలు విఫలమయ్యాయి.దీంతో పార్టీ లక్ష్యాలకు అనుగుణంగా విస్తృత వేదిక ఏర్పాటు సాధ్యం కాలేదు. మరో వైపు బీఎల్‌ఎఫ్‌పై సీపీఎం ముద్ర బలంగా ఉన్న కారణంగానే సీపీఐ, ఇతర కమ్యూనిస్టుపార్టీలు, సామాజికసంస్థలు కలసి రాలేదనే అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తంచేస్తున్నారు.ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 26 సీట్లలో పోటీచేసిన సీపీఎంకు మొత్తం 88,733 ఓట్లు (0.4 శాతం), 81 స్థానాల్లో బరిలో నిలచిన బీఎల్‌ఎఫ్‌కు 1,41,119 ఓట్లు (0.7శాతం) మాత్రమే వచ్చాయి. -
సభలో పాటపాడి అలరించిన నగ్మా
టీ.నగర్: నటి నగ్మా పుదుచ్చేరిలో జరిగిన కాంగ్రెస్ సభలో పాట పాడి అక్కడి మహిళలను అలరించారు. పుదుచ్చేరి మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తిరుక్కనూర్ కోరపట్టిలో ఆదివారం మహిళల చైతన్య శిబిరం, సంక్షేమ సహాయకాల పంపిణీ నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నగ్మా పేద మహిళలకు సంక్షేమ సహాయకాలు అందజేసి ప్రసంగించారు. ఆ సమయంలో మహిళలను ఉత్సాహపరిచేందుకు పాట పాడాలని నిర్వాహకులను కోరగా పాట పాడారు. తర్వాత నగ్మాను పాడాల్సిందిగా నిర్వాహకులు అడిగారు. అంగీకరించిన నగ్మా మైక్ అందుకుని ‘నీ నడందాల్ నడై అళగు’ (నువ్వు నడిస్తే నడక అందం), స్టైల్ స్టైలు దాన్.. తంగమగన్.. అనే పాటలు పాడారు. అక్కడున్న మహిళలు కేకలు వేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ పాటలో తాను అందం అంటూ పేర్కొన్నది రాహుల్గాంధీనని, రజనీకాంత్ గురించి కాదన్నారు. రాహుల్ గాంధీ తమ బాషా.. ఆయనే ప్రధానిగా రావాలంటూ వివరణ ఇచ్చారు. -
లంచం అడుగుతున్నారు
టీఏపై ఎంపీడీఓకు ఫిర్యాదు చేసిన లకిమేర గ్రామస్తులు నరసన్నపేట : ‘మేం నిరుపేద కూలీలం. ఉపాధి పనులకు వెళ్తూ జీవనోపాధి పొందుతున్నాం. ఉపాధి అధికారుల సూచన మేరకు గ్రామంలో ఫారంఫాండ్ తవ్వాం. దీనికి రోజుకు రూ.35 మాత్రమే వేతనం పడింది. ఇదేమని టెక్నికల్ అసిస్టెంట్ త్రినాథరావును ప్రశ్నించగా ఒక్కో పాండ్‌కు రోజుకు రూ.190 వేతనం వచ్చేలా చేస్తాను.. అందుకు రూ. 3 వేలు నాకు లంచం ఇస్తారా అని అడిగారు’ అంటూ లకిమేర గ్రామానికి చెందినపలువురు ఉపాధి వేతనదారులు శుక్రవారం నరసన్నపేట ఎంపీడీఓ విద్యాసాగర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వేతనదారులు వంజరాపు అప్పలరామయ్య, ఎల్. లక్ష్మి, ఆర్.లక్ష్మి, ఎ.కాళీప్రసాద్ తదితరులు విలేకరులతో మాట్లాడుతూ రెండు వారాలకు చెందిన సొమ్ము రావాల్సి ఉందని చెప్పారు. వారానికి రూ. 200 చొప్పున మాత్రమే వేతనం వస్తోందని వాపోయారు. ఈ విషయమై సమగ్ర దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాలని వారు కోరారు. -
8 కి .మీ. దాటితే టీఏ,డీఏ ఇవ్వాల్సిందే
యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాక్షి, రంగారెడ్డి జిల్లా : పదో తరగతి స్పాట్‌కు ఎనిమిది కిలోమీటర్లకు పైబడి హాజరయ్యే ఉపాధ్యాయులందరికీ టీఏ, డీఏ ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆంజనేయు లు, గాలయ్య సోమవారం డిమాండ్ చేశారు. వాల్యూయేషన్‌కు వచ్చే వారికి కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. గత ఐదేళ్లుగా హయత్‌నగ ర్ వర్డ్ అండ్ డీడ్ పాఠశాలలో స్పాట్ వాల్యూయేషన్ జరుగుతుందని, 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నుంచి టీచర్లు వచ్చి ప్రక్రియలో పాల్గొంటున్నారని తెలిపారు. కానీ వారికి తగిన భత్యం ఇవ్వకుండా విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఇప్పటి నుంచి అయినా.. ఎనిమిది కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నుంచి వచ్చే ప్రతి ఉపాధ్యాయుడికి దినసరి భత్యం సంతృప్తికరంగా ఇవ్వాలని వారు ఈ మేరకు డిమాండ్ చేశారు. -
తుపాను విధుల్లోని అధికారులకు అదనంగా 50% డీఏ
* సీఎం చంద్రబాబు ఆదేశాలు * అధికారుల టీఏ, డీఏలకే రూ.50 కోట్లు * హైదరాబాద్‌లోని అధికారుల భోజనాలు, టిఫిన్లకు రూ.25 లక్షలు * పోలీసులకోసం అదనంగా రూ.2 కోట్లు సాక్షి, హైదరాబాద్: ఒకవైపు తుపాను తాకిడికి ఉత్తరాంధ్ర ప్రజానీకం విలవిల్లాడుతుంటే మరోవైపు సహాయక చర్యల పర్యవేక్షణకు వెళ్లిన ఐఏఎస్ అధికారులతోపాటు తుపాను విధుల్లో పాల్గొంటున్న అధికారులందరికీ అదనంగా 50 శాతం డీఏ ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు. తుపాను కారణంగా సర్వస్వం కోల్పోయిన బాధితులకు ఇంతవరకు అరకొరగా కూడా ప్రభుత్వం సాయం అందకపోయినప్పటికీ.. సహాయక చర్యలను పర్వవేక్షిస్తున్న అధికారులకు మాత్రం ఎలాంటి లోటు రాకుండా ప్రభుత్వం చూస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తుపాను సహాయక చర్యలకోసం రాష్ట్రప్రభుత్వం ఏకంగా 40 మంది ఐఏఎస్‌లను ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు పంపింది. అదే సమయంలో హైదరాబాద్‌లోనే ఉండి సహాయక చర్యలను మరో 25 మంది అధికారులు పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్‌లోని అధికారులకు ఉదయం, సాయంత్రం టిఫిన్లతోపాటు మధ్యాహ్నం, సాయంత్రం భోజనాలకోసం అడ్వాన్స్‌గా రూ.పాతిక లక్షలు విడుదల చేశారు. ఐఏఎస్‌లుగానీ, ఇతర అధికారులుగానీ వేరే జిల్లాలకు వెళితే సాధారణంగా వారికి డీఏ మంజూరు చేస్తారు. ఇప్పుడు సాధారణంగా ఇచ్చే డీఏకు అదనంగా మరో 50 శాతం ఇవ్వాలంటూ సీఎం ఆదేశాలిచ్చారు. తుపాను బాధితులకు ఆర్థికసాయం అందించడం మాట ఎలాగున్నా ఇప్పుడు అధికారుల టీఏ, డీఏలకే రూ.50 కోట్ల మేరకు వ్యయమవుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ నుంచి వెళ్లిన అధికారులకు వసతి, భోజన సదుపాయం, ఇతర సౌకర్యాలు కల్పించే అదనపు బాధ్యతలు స్థానిక అధికారులపై పడుతున్నాయని, సహాయక చర్యల అమలుపైకన్నా ఎక్కువ దృష్టి వీరికి సౌకర్యాలు కల్పించడంపైనే ఉంటోందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. కాగా తుపాను ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు అదనంగా రూ.2 కోట్లు విడుదల చేయాల్సిందిగా డీజీపీ కార్యాలయం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. -
భత్యాల్ని మెక్కేశారా!
సాక్షి, కాకినాడ : పంచాయతీ ఎన్నికలు జరిగి ఏడాదైనా ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులకు, సిబ్బందికి రావాల్సిన టీఏ, డీఏలు (ప్రయాణ, దినభత్యాలు) నేటికీ రాలేదు. జిల్లాలో ఇందుకు సంబంధించి సుమారు రూ.2 కోట్లు పక్కదారి పట్టాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది జూలైలో మూడు విడతల్లో జిల్లాలోని 962 పంచాయతీల సర్పంచ్‌లకు, 10,742 వార్డు సభ్యులకు ఎన్నికలు జరిగాయి. తొలివిడతలో 23న రాజమండ్రి, రంపచోడవరం డివిజన్లలోని 324 పంచాయతీలకు, రెండో విడతలో 27న కాకినాడ, పెద్దాపురం డివిజన్లలోని 369 పంచాయతీలకు, మూడో విడతలో 31న అమలాపురం డివిజన్లోని 272 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందుకోసం 10,803 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం 346 మంది స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారులు, 962 మంది స్టేజ్ టూ రిటర్నింగ్ అధికారులతో పాటు ప్రతి స్టేషన్‌కూ ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఓ సహాయకుని చొప్పున సుమారు 35 వేల మంది సిబ్బందిని వినియోగించారు. మండలానికో రకంగా కేటాయింపు.. పొరుగు జిల్లాల్లో ఎన్నికల నిర్వహణకు మంజూరైన నిధులను పంచాయతీల సంఖ్య ను బట్టి మండలాలకు కేటాయించారు. కానీ జిల్లాలో అలా కాక మండలానికో రీతిలో కేటాయింపులు జరిపారనే ఆరోపణలు వచ్చాయి. తొలి విడతలో జరిగిన మండలాల పరిధిలోని పంచాయతీల ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న సిబ్బందికి భత్యాల చెల్లింపు పూర్తిగా జరిగినా.. తర్వాత రెండు విడతల్లో పాల్గొన్న సిబ్బందికి కనీసం 30 శాతం చెల్లించలేదు. మండలానికి రూ.7.50 లక్షల నుంచి రూ.9 లక్షల మేర మొదటి విడత ఎన్నికలు జరిగిన మండలాలకు కేటాయించగా, తర్వాత రెండు విడతల్లో జరిగిన మండలాలకు కేవలం రూ.4.50 లక్షల లోపే కేటాయించారు. ఈ ఏడాది జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు ఒక్కో మండలానికీ ఏకంగా రూ.12 లక్షల చొప్పున మంజూరు చేశారు. కేవలం 57 జెడ్పీటీసీలతో పాటు 1063 ఎంపీటీసీ సభ్యుల ఎన్నికల నిర్వహణకు రూ.7 కోట్లకు వరకు చెల్లించారు. 962 సర్పంచ్‌లతో పాటు 10,742 వార్డు సభ్యులకు జరిగే పంచాయతీ ఎన్నికలకు మాత్రం అరకొర కేటాయింపులు జరపడం గమనార్హం. పోనీ ఆ కొద్ది పాటి నిధులైనా పూర్తి స్థాయిలో కేటాయించారా అంటే అదీ లేదు. చివరి రెండు విడతల్లో ఎన్నికలు జరిగిన కాకినాడ (9 మండలాలు), పెద్దాపురం (12 మండలాలు), అమలాపురం(16 మండలాలు) డివిజన్లలో ఒక్కో మండలానికీ ఇంకా రూ.5 లక్షల నుంచి రూ.ఏడులక్షల వరకు చెల్లిం చాల్సి ఉంది. అంటే 37 మండలాలకు రూ.5 లక్షల చొప్పున వేసుకున్నా సుమారు భత్యాలుగా చెల్లించాల్సింది రూ.1.85 కోట్ల వరకు ఉంటుందన్నమాట. వాస్తవానికి ఈ మొత్తం రూ.2.50 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. తప్పుడు బిల్లులతో దారి తప్పిన సొమ్ము..! ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిధులన్నీ ఎన్నికల సమయంలోనే ప్రభుత్వం విడుదల చేసింది. మంజూరైన నిధులను జిల్లాస్థాయి అధికారులు ఇతర అవసరాలకు పక్కదారి పట్టించడం వలనే ఈ పరిస్థితి ఏర్పడిందని కొందరంటున్నారు. అయితే కారణం అది కాదని, ఎన్నికల నిర్వహణ నిధులను లెక్కాపత్రం లేకుండా ఇష్ట మొచ్చినట్టు తప్పుడు బిల్లులతో డ్రా చేసి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎన్నికలను పర్యవేక్షించిన అధికారి జిల్లా ఉన్నతాధికారి వత్తాసుతోనే ఈ నిధులను దారి తప్పించారంటున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకున్న ఉద్యోగులకు ఇంతవరకూ భత్యాలు చెల్లించని విషయమై జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌రెడ్డిని వివరణ కోరగా సకాలంలో బిల్లులు సమర్పించకపోవడం వలన రూ.60 లక్షలు వెనక్కి మళ్లిపోయాయన్నారు. అందువలనే భత్యాల చెల్లింపులో జాప్యం జరిగిందని చెప్పుకొచ్చారు. కాగా.. భత్యాలుగా ఇవ్వాల్సింది కోటి వరకు ఉంటుందని, కొన్ని మండలాలకు రూ.7 లక్షల వరకు ఇవ్వాలని అంగీకరించిన డీపీఓ మొత్తం నిధుల కోసం ఇప్పటికే కలెక్టర్ ప్రభుత్వానికి రాశారని, రాగానే పంపిణీ చేస్తామని చెప్పారు. డీపీఓ చెప్పినట్టు రూ.60 లక్షలు వెనక్కి వెళ్లినా మిగిలిన దాదాపు రూ.2 కోట్ల మొత్తం ఏమైందన్న ప్రశ్న మిగిలిపోతోంది. -
యూడీసీని నిలదీసిన అంగన్వాడీ కార్యకర్తలు
ముథోల్, న్యూస్‌లైన్ : స్థానిక ఐసీడీఎస్ కార్యాలయ ఆవరణలో యూడీసీ మహేశ్‌ను అంగన్వాడీ కార్యకర్తలు మంగళవారం నిలదీశారు. ప్రాజెక్టు పరిధిలోని కుభీర్, భైంసా, లోకేశ్వరం, తానూర్, ముథోల్ మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు టీఏ, డీఏ బిల్లుల విషయమై ప్రశ్నించారు. ఏడాదిగా బిల్లులు రావడం లేదని, అంగన్వాడీ కేంద్రాల అద్దె చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. టీడీఏ, డీఏ, కట్టెల బిల్లులు ఇవ్వాలని కోరితే పర్సంటేజీ అడుగుతున్నాడని ఆరోపించారు. ఐసీడీఎస్ పరిధిలోని 300 మంది అంగన్వాడీ కార్యకర్తలు రూ.6వేల చొప్పున చెల్లిస్తే బిల్లులు చేస్తానని అంటున్నాడని పేర్కొన్నారు. నెలనెల కోడిగుడ్లు ఇవ్వడం లేదని తెలిపారు.