
టీ.నగర్: నటి నగ్మా పుదుచ్చేరిలో జరిగిన కాంగ్రెస్ సభలో పాట పాడి అక్కడి మహిళలను అలరించారు. పుదుచ్చేరి మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో తిరుక్కనూర్ కోరపట్టిలో ఆదివారం మహిళల చైతన్య శిబిరం, సంక్షేమ సహాయకాల పంపిణీ నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నగ్మా పేద మహిళలకు సంక్షేమ సహాయకాలు అందజేసి ప్రసంగించారు. ఆ సమయంలో మహిళలను ఉత్సాహపరిచేందుకు పాట పాడాలని నిర్వాహకులను కోరగా పాట పాడారు. తర్వాత నగ్మాను పాడాల్సిందిగా నిర్వాహకులు అడిగారు. అంగీకరించిన నగ్మా మైక్ అందుకుని ‘నీ నడందాల్ నడై అళగు’ (నువ్వు నడిస్తే నడక అందం), స్టైల్ స్టైలు దాన్.. తంగమగన్.. అనే పాటలు పాడారు. అక్కడున్న మహిళలు కేకలు వేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ పాటలో తాను అందం అంటూ పేర్కొన్నది రాహుల్‌గాంధీనని, రజనీకాంత్ గురించి కాదన్నారు. రాహుల్ గాంధీ తమ బాషా.. ఆయనే ప్రధానిగా రావాలంటూ వివరణ ఇచ్చారు.