వరద ప్రభావిత ప్రాంతాలకు వైఎస్ జగన్: ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో నేడు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో బాధితులను ఆయన పరామర్శిస్తారు.
కేంద్ర మంత్రి పర్యటన: కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు నేడు సొంత జిల్లా విజయనగరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
సత్యసాయి జయంతి: భగవాన్ సత్యసాయి 90వ జయంతి నేడు. ఈ సందర్భంగా పుట్టపర్తిలోని సత్యసాయి ఆశ్రమంలోని హిల్ వ్యూ స్టేడియంలో వేడుకలు ఘనంగా నిర్వహించేంకు ట్రస్ట్ సభ్యులు ఏర్పాట్లుచేశారు. ఈ వేడుకలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
తిరుమల: నేడు త్రైసిక ద్వాదశి ద్వాదశి సందర్భంగా మాడావీధుల్లో శ్రీవారు.. ఉగ్రశ్నీనివాసుడిగా ఊరేగనున్నారు.
న్యూస్ డైరీ
Published Mon, Nov 23 2015 6:50 AM | Last Updated on Wed, Oct 17 2018 4:53 PM
Advertisement
Advertisement