నూతన ఐటీ పాలసీ: తెలంగాణ నేడు నూతన ఐటీ పాలసీని ఆవిష్కరించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు హెచ్ఐసీసీలో సీఎం కేసీఆర్ కొత్త ఐటీ విధానాన్ని ప్రకటిస్తారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నర్సింహన్, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి హాజరుకానున్నారు. పాలసీలో ఐటీ అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు ప్రకటించనుంది తెలంగాణ ప్రభుత్వం.
నేడు తొలిదశ పోలింగ్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు పశ్చిమ బెంగాల్, అసోంలలో తొలిదశ పోలింగ్ జరగనుంది. బెంగాల్ లోని 18 నియోజకవర్గాలు, అసోంలోని 65 స్థానాల్లో ఓటర్లు తమ తీర్పును వెలువరించనున్నారు.
దేశంలో తొలి ముస్లిం మహిళా సీఎం: జమ్ముకశ్మీర్ 13వ ముఖ్యమంత్రిగా మొహబూబా ముఫ్తీ సయీద్ నేడు ప్రమాణస్వీకారం చేస్తారు. దేశంలో మొట్టమొదటి ముస్లిం మహిళా సీఎంగా ఆమె రికార్డు నెలకొల్పారు.
డీఎంకే- కాంగ్రెస్ పొత్తు కుదిరేనా: సీట్ల సర్దుబాటు విషయమై డీఎంకేతో కాంగ్రెస్ పార్టీ చర్చలు జరగనున్నాయి. డీఎంకే అధినేత కరుణానిధిని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ నేడు కలవనున్నారు.
టీపీసీసీ భేటీ: గాంధీ భవన్ లో ఉదయం 11 గంటలకు టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంజరగనుంది. జగ్జీవన్ రామ్, అంబేద్కర్ జయంతి వేడుకలు, తాజా రాయకీయ పరిణామాలపై చర్చ
నేడు తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం
పీజీ కళాశాల విద్యార్థులపై దాడిని నిరసిస్తూ నేడు పాలమూరు వర్సిటీ బంద్ కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు
వాటర్ వీక్: నేటి నుంచి ఢిల్లీలో ఇండియన్ వాటార్ వీక్ కార్యక్రమం ప్రారంభం. హాజరుకానున్న 20 దేశాల ప్రతినిధులు. మిషన్ కాకతీయ పై ప్రత్యేక ప్రెజెంటేషన్ ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం
టుడే న్యూస్ డైరీ
Published Mon, Apr 4 2016 7:06 AM | Last Updated on Wed, Oct 17 2018 4:53 PM
Advertisement
Advertisement