తెలుగు రాష్ట్రాల్లో బ్యాంక్ సేవలు: గురునానక్ జయంతి సందర్భంగా నేడు బ్యాంకు లకు సెలవు. కానీ తెలుగు రాష్ట్రాల్లోమాత్రం పరిమిత సేవలు కొనసాగుతాయని ఆయా శాఖలు ప్రకటించాయి. ఏపీలో అన్ని బ్యాంకులు, ట్రెరజరీల సేవలు సోమవారం కూడా కొనసాగుతాయని, పాతనోట్లతో పన్నులు చెల్లించేందుకు నేడు ఆఖరి గడువని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇటు తెలంగాణలో 113 ఎస్ బీహెచ్ శాఖలు పనిచేయనున్నాయి. కానీ నోట్ల చెల్లింపులు ఉండవని బ్యాంక్ వర్గాలు తెలిపాయి. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల్లో నేడు కూడా పాత నోట్లతో పన్నులు చెల్లింపులు స్వీకరిస్తారు.
నోట్ల రద్దుపై ఏంచేద్దాం?: రూ.500. రూ.1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దుచేయడంతో దేశంలో నెలకొన్న పరిస్థితులు, సామాన్యుడి కష్టాలపై చర్చించి జాతీయస్థాయిలో ఉద్యమం ప్రారంభించాలా, వద్దా అనే అంశాలపై చర్చించేందుకు నేడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, సీపీఎంలు కీలక సమావేశాన్ని నిర్వహించనున్నాయి.
నోట్ల రద్దుపై కాంగ్రెస్ నిరసన: పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టనున్నారు.
ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్: నేటి నుంచి ఢిల్లీలో అంతర్జాతీయ వాణిజ్య మేళా ప్రారంభం కానుంది.
కార్తీక శోభ: కార్తీక సోమవారం సందర్భంగా తెలుగురాష్ట్రాల్లోని శైవ క్షేత్రాల్లో నేడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. శ్రీశైలంలో నేటిసాయంత్రం జ్వాలా తోరణ దర్శనం, పుణ్య నదీ హారతి కార్యక్రమాలు ఉంటాయి.
చెవిరెడ్డి ధర్నా: చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేడు ధర్నా చేయనున్నారు.
టుడే న్యూస్ డైరీ
Published Mon, Nov 14 2016 7:16 AM | Last Updated on Wed, Oct 17 2018 4:53 PM
Advertisement
Advertisement