ఆదివారం కూడా కొనసాగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. నేడు టెట్ నోటిఫికేషన్..
తెలంగాణ అసెంబ్లీ: శని, ఆదివారాలు కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వాహిస్తూ కొత్త సంప్రదాయానికి తెరలేపింది తెలంగాణ సర్కార్. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా శనివారం ఉద్యోగ నియామకాలపై రగడ చెలరేగిన సంగతి తెలిసిందే. నేడు శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగనున్నాయి.
టీ కేబినెట్ భేటీ: ఆదివారం సాయంత్రం తెలంగాణ మంత్రివర్గం సమావేశంకానుంది. ఈ నెల 14న సమర్పించనున్న బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
టెట్ నోటిఫికేషన్: నేడు తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలకానుంది.
ఆదిలాబాద్ జిల్లాలో నిర్మించిన విద్యుత్ ప్రాజెక్టు మొదటి యూనిట్ సింక్రనైనేషన్ కు నేడు శ్రీకారం
అలహాబాద్ హైకోర్టుకు 150 ఏళ్లు: ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో హైకోర్టు ఏర్పాటుచేసి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆదివారం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్నారు.
టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్: నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఐర్లాండ్ తో నెదర్లాండ్స్ ఢీ, రాత్రి 7 గంటలకు బంగ్లాదేశ్ తో తలపడున్న ఒమన్ జట్టు.