టుడే న్యూస్ డైరీ | today news daity | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ డైరీ

Published Tue, Apr 5 2016 7:09 AM | Last Updated on Wed, Oct 17 2018 4:53 PM

today news daity

మండే ఎండలు: నేటి నుంచి ఉత్తర తెలంగాణ, రాయలసీమల్లో పెరగనున్న ఎండతీవ్రత. వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించిన వాతావరణ శాఖ. ప్రజలు ఎండలో తిరగొద్దని సూచన

పులివెందులకు వైఎస్ జగన్: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి నుంచి తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు.  మంగళ, బుధవారాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది.

కృష్ణాపై కీలక భేటీ: కృష్ణా జలాల వినియోగం, ఫిర్యాదులు, అభ్యంతరాల పరిష్కారం కోసం ఏర్పాటయిన కృష్ణ్యా ట్రిబ్యూనల్ నేటి నుంచి వరుసగా మూడురోజులపాటు సమావేశం కానుంది. ఈ సమావేశానికి కృష్ణా పరివాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు చెందిన ఉన్నతాధికారులు హాజరవుతారు.

ఆర్ బీఐ పాలసీ ప్రకటన: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేడు పాలసీని సమీక్షించుకోనుంది. రెపో, రివర్స్ రెపో రేట్లపై పావు నుంచి అరశాతం కోతపడే అవకాశం ఉంటుందని అంచనా.

ఢిల్లీ: రెండోరోజు కొనసాగనున్న జల వారోత్సవాలు

గాటిమన్: దేశంలోనే వేగంగా నడిచే రైలుగా రికార్డులకెక్కనున్న గాటిమన్ రైలు సర్వీసు నేటి నుంచి ప్రారంభంకానుంది.

రీ డిజైనింగ్ కమిటీ భేటీ: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్ పై ఏర్పాటయిన కేబినెట్ సబ్ కమిటీ నేడు సమావేశంకానుంది.

ఉగాది వేడుకలు: నేటినుంచి శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు ప్రారంభం, ఇప్పటికే లక్షలాదిగా తరలివచ్చిన కర్ణాటక భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement