గెలుపు ఎవరిది: వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక ఫలితం నేడు వెలువడనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం కల్లా విజేత ఎవరో తేలనుంది. గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నెల్లూరు జిల్లాలో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. నేటి నుంచి మూడురోజులపాటు ఆయన పర్యటన కొనసాగనుంది.
టీటీడీపీ సమావేశం: విజయవాడలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో నేడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలువురు టీటీడీపీ సీనియర్లు పాల్గొంటారు.
న్యూస్ అప్ డేట్స్
Published Tue, Nov 24 2015 6:27 AM | Last Updated on Sun, Sep 3 2017 12:57 PM
Advertisement
Advertisement