
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై పడిన రూ. 3 లక్షల కోట్ల అప్పుల భారంలో అధిక సొమ్ము మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జేబులోకి వెళ్లిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇదిలా ఉండగా, పుల్వామా ఉగ్రదాడి ఘటనలో సైనికుల బలిదానాన్ని భారత్ ఎప్పటికీ మరచిపోదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల త్యాగాలకు గుర్తుగా జమ్ముకశ్మీర్‌లోని లెత్‌పొరా శిబిరంలో స్మారకస్తూపాన్ని ఆవిష్కరించారు. మరోవైపు టెలికాం కంపెనీలకు సర్వోన్నత న్యాయస్ధానం నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సర్దుబాటు చేసిన స్ధూల రాబడి (ఏజీఆర్)పై బకాయిల చెల్లింపుల కోసం నూతన షెడ్యూల్‌ను ప్రకటించాలని కోరుతూ టెలికాం కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.