ఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మహా సంగ్రామం చివరి అంకానికి చేరుకుంది. నేడు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగును. ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి.
ఆంధ్రపద్రేశ్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నుంచి మూడు రోజుల పాటు కర్నూలులో జలదీక్ష చేయనున్నారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులను ప్రతిఘటిస్తూ, ఏపీ సీఎం చంద్రబాబు నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్ జగన్ ఈ నిరాహారదీక్ష తలపెట్టారు.
ఆంధ్రప్రదేశ్: ఏపీ ఐసెట్-2016 పరీక్ష సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరుగును. ఈ పరీక్షకు సెట్ కోడ్ విటీఎస్‌టీ ప్రశ్నాపత్రాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ఎంపిక చేశారు.
తెలంగాణ: నేడు ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. 243 పోలింగ్ కేంద్రాల్లో 1,90,351 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
తెలంగాణ: కరీంనగర్ కలెక్టరేట్ వద్ద సోమవారం బీజేపీ ధర్నాకు దిగనుంది. ఈ ధర్నాకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ హాజరవుతారు.
స్పోర్ట్స్: ఐపీఎల్-9 భాగంగా సోమవారం రాత్రి 8 గంటలకు కోల్‌కతా వేదికగా కోల్‌కతా, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగును.
టుడే న్యూస్ అప్‌డేట్స్
Published Mon, May 16 2016 6:50 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
Advertisement
Advertisement