ఢిల్లీ: కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాడి నేటికి రెండేళ్లు పూర్తయ్యింది. దీనిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్ బహిరంగ సభలో పాల్గొంటారు.
ఢిల్లీ: చైనా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో భేటీ అవుతారు. ఇరు దేశాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చిస్తారు.
హైదరాబాద్: నేటి నుంచి రెండు రోజులపాటు కేంద్ర నీరాంచల్ పథకంపై వర్క్ షాప్ జరగనుంది. ఈ వర్క్ షాప్కు ఐదు రాష్ట్రాల ప్రతినిధులు హాజరవుతారు.
తెలంగాణ: తెలంగాణ ఎంసెట్-2016 ప్రవేశ పరీక్ష ఫలితాలు గురువారం ఉదయం 11 గంటలకు విడుదలకానున్నాయి.
ఆంధ్రప్రదేశ్: కేంద్రప్రభుత్వ విజయాలపై నేటి నుంచి ఏపీ బీజేపీ నేతలు వినూత్న ప్రచారానికి చేపట్టనున్నారు. వికాస్ పర్వ్ పేరుతో వచ్చే నెల 15 వరకు ఈ ప్రచారం కొనసాగిస్తారు.
ఆంధ్రప్రదేశ్: ప్రధాని మోదీ ఎన్నికల హామీల వైఫల్యాలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయనుంది.
ఆంధ్రప్రదేశ్: విజయవాడలో ఏపీ కలెక్టర్ల రెండో రోజు సదస్సు జరగనుంది. రాష్ట్రాభివృద్ధికి తీసుకోవాల్సిన నిర్ణయాలపై సీఎం చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు.
టుడే న్యూస్ అప్‌డేట్స్
Published Thu, May 26 2016 8:05 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
Advertisement
Advertisement