
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పన, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను, పెండింగ్ బిల్లులు, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టులకు తగిన కేటాయింపులు జరపని విషయాన్ని ప్రధానితో చర్చించారు. ఇదిలాఉండగా, ప్రజలు ఓడించి మూలనపడేసినా చంద్రబాబు బస్సు యాత్ర చేపట్టడం హాస్యాస్పదమని ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటికీ గుర్తుపెట్టుకునేలా భారత్‌లో సాదర స్వాగతం పలుకుతామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.