పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇకపోతే దేశంలో ఉన్న పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలే అని.. దేశవ్యాప్తంగా ఉనికి, యంత్రాంగం ఉన్న జాతీయ పార్టీలంటూ ఏవి లేవని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఇదిలాఉండగా, రాజకీయ పార్టీలు తమ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే నేరచరిత్ర కలిగిన అభ్యర్ధుల గురించి పూర్తిసమాచారాన్ని పార్టీ వెబ్‌సైట్‌లు, ప్రింట్ మీడియా ద్వారా బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు అన్ని రాజకీయ పార్టీలను ఆదేశించింది. మరోవైపు, చైనాలో కొవిడ్-19 వైరస్ బుధవారం భారీగా విజృంభించింది. హుబెయ్ ప్రావిన్సులో నిన్న ఒక్కరోజే 242 మందిని కబలించింది.