కరోనావైరస్ (కోవిడ్-19)నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. చైనాలో పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కరీంనగర్‌ను వణికిస్తోంది. ఇటీవల ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన పది మంది బృందంలో కరోనా లక్షణాలున్నట్లు గుర్తించి, వైద్యపరీక్షల కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కరోనాను నివారించే చర్యల్లో భాగంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ శ్రీవాస్తవ గురువారం కీలక ఆదేశాలను జారీ చేశారు. ఢిల్లీలో ఐదుగురు కంటే ఎక్కువ మంది గూమికూడవద్దని, ఉల్లంఘిస్తే చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు.