టుడే న్యూస్ అప్‌డేట్స్ | today newsupdates | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ అప్‌డేట్స్

Published Wed, Apr 20 2016 7:26 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

today newsupdates

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఈపీఎఫ్ తో పాటు పలు కీలక అంశాలపై చర్చిస్తారు.

ఆంధ్రప్రదేశ్: నేడు వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి కల్యాణోత్సవం జరుగును. రాత్రి 8గంటలకు జరిగే స్వామి వారి కల్యాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.
ఆంధ్రప్రదేశ్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. కడపలో నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించడంతో  పాటు రామ ఎత్తిపోతల పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు. బుధవారం చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఏపీలో మూడు కొత్త పథకాలను ప్రారంభించనున్నారు. చందన్న సంచార చికిత్స వాహనాలు, ప్రభుత్వాస్పత్రుల్లో సిటీ స్కాన్, రోటా వైరస్ వ్యాక్సిన్‌లను ఆయన ప్రారంభిస్తారు.
ఆంధ్రప్రదేశ్: గుంటూరులో బుధవారం కాంగ్రెస్ బహిరంగసభ జరగనుంది. ఈ సభలో పార్టీ భవిష్యత్ కార్యాచరణను పీసీసీ ప్రకటిస్తుంది.   

హైదరాబాద్: ఏఎస్‌ఐ మోహన్‌ రెడ్డి బాధితులు రిలే దీక్షలకు దిగనున్నారు. ఇందిరా పార్క్ వద్ద నేటి నుంచి మూడు రోజుల పాటు రిలే దీక్షలు నిర్వహిస్తారు.

స్పోర్ట్స్: ఐపీఎల్‌-9లో భాగంగా ముంబై ఇండియన్స్, బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరుగును.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement