
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హౌజింగ్ అధికారులతో క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమావేశమయ్యారు. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ అధికారులు పదోన్నతి పొందగా మరి కొందరు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల అయింది. ఇదిలా ఉండగా, యస్ బ్యాంక్ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీ సర్కార్ భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. మరిన్ని వార్తల కోసం కింది వీడియోని క్లిక్ చేయండి.