టీ అసెంబ్లీ సమరం: బుధవారం ఉదయం 10 గంటల నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభ, శాసనమండలి కొలువుదీరనున్నాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, దివంగత ఎమ్మెల్యే కృష్ణారెడ్డిలకు సంతాపం ప్రకటించనున్న ఉభయ సభలు. అనంతరం ఐదు రోజుల సెలవు ప్రకటన. 29 నుంచి సమావేశాలు తిరిగి ప్రారంభం
కీలక పర్యటన: ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం ఆరు గంటలకు ఐర్లాండ్ బయలుదేరి వెళ్లారు. 60 ఏళ్ల తర్వాత ఆ దేశంలో పర్యటిస్తున్న మొదటి భారత ప్రధాని ఆయనే కావటం విశేషం. ఐర్లాండ్ నుంచే అమెరికాకు చేరుకోనున్న మోదీ.. ఐక్యరాజ్యసమితి 70వ వార్శిక సమావేశంలో పాల్గొంటారు.
ఢిల్లీలో బాబు: సింగపూర్ పర్యటన ముగించుకుని మంగళవారం రాత్రే ఢిల్లీకి చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఉదయం 11 గంటలకు నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొంటారు.
పరామర్శయాత్ర: నేడు కరీంనగర్ జిల్లాలో రెండోరోజూ వైఎస్ షర్మిల పరామర్శయాత్ర. మంథని, పెద్దపల్లి, చొప్పదండి, ధర్మపురి నియోజకవర్గాల్లోని ఆరు కుటుంబాలను పరామర్శించనున్న షర్మిల
తిరుమల: బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు తిరుమలలో శ్రీవారి రథోత్సవం కార్యక్రమం జరగనుంది. ఉదయం ఏడు గంటల నుంచి వేడుక ప్రారంభం కానుంది.
సెట్ స్లైడింగ్: సీట్ల కేటాయింపు పూర్తయినట్లు ఎస్ఎమ్ఎస్ వచ్చిన విద్యార్థులకు బుధ, గురువారాల్లో సెట్ స్లైడింగ్ నిర్వహించనున్నట్లు ఓయూ అధికారులు తెలిపారు.