యూపీ: నేటి నుంచి అలహాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరుకానున్నారు.
ఢిల్లీ: నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాలు విడుదలవుతాయి.
హైదరాబాద్: నేడు టీ పీసీసీ కార్యవర్గ సమావేశం జరుగును. పార్టీ పరిస్థితులు, నేతల వలసలపై ప్రధానంగా చర్చిస్తారు.
రాజమండ్రి: కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభం రాజమండ్రి ఆస్పత్రిలో నిరవధిక దీక్ష కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లు ప్రభుత్వం పరిష్కారించేంత వరకు దీక్ష విరమించేది లేదంటూ వైద్యానికి కూడా ఆయన నిరాకరిస్తున్నారు. ఆస్పత్రిలో ముద్రగడ, ఆయన భార్య, కోడలు దీక్ష కొనసాగిస్తున్నారు.
స్పోర్ట్స్: నేడు ఆస్ట్రేలియన్ బ్యాడ్మింటన్ ఫైనల్ మ్యాచ్ జరుగును. ఈ మ్యాచ్‌లో సున్ యూ, సైనా నెహ్వాల్ తలపడతారు.
నేటి యూరో ఫుట్‌బాల్ టోర్నీ మ్యాచ్‌లు
సాయంత్రం 6.30 : టర్కీ vs క్రొయేషియా
రాత్రి 9.30 : పోలాండ్ vs నార్తర్నర్ ఐర్లాండ్
రాత్రి 12.30 : జర్మనీ vs ఉక్రెయిన్.