మోదీ కశ్మీర్ పర్యటన: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు జమ్ముకశ్మీర్ లో పర్యటించనున్నారు. శ్రీనగర్ లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తారు.
మన్యం బంద్: విశాఖజిల్లా మన్యం ప్రాంతంలో నిర్వాసితుల గోడు పెడచెవిన పెడుతూ కొసాగుతున్న బాక్సైట్ తవ్వకాలను నిరసిస్తూ అఖిలక్షం నేడు మన్యం బంద్ కు పిలుపిచ్చింది.
చెన్నైకి చంద్రబాబు: ఎస్ఆర్ఎం వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేడు చెన్నై వెళ్లనున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలు: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డుల సంఖ్య పెంపుపై దాఖలపై పిటిషన్ ను నేడు హైకోర్టు విచారించనుంది.
ఏపీ ఉద్యోగులు: జూన్ 2 కల్లా నూతన రాజధాని అమరావతికి రావాలని ఉత్తర్వులు జారీ అయిన నేపథ్యంలో నేడు ఏపీ సచివాలయ ఉద్యోగులు సమావేశమై చర్చించనున్నారు.
టీటీడీపీ: వరంగల్ ఉప ఎన్నిక, తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం తదితర అంశాలపై చర్చించేందుకు నేడు టీటీడీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు.
మొహాలీ టెస్ట్: ఫ్రీడం సిరీస్ లో భాగంగా భారత్- సౌతాఫ్రికాల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మూడో రోజు ఆట నేడు కొనసాగనుంది. ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 142 పరుగుల ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.
టుడే న్యూస్ అప్డేట్స్
Published Sat, Nov 7 2015 6:51 AM | Last Updated on Sun, Sep 3 2017 12:11 PM
Advertisement
Advertisement