ఏపీలోని రాయసీమ, కోస్తాంధ్ర ప్రాంతానికి మళ్లీ వర్షం ముప్పు పొంచిఉంది. మంత్రులు, శాఖల హెచ్ వోడీలతో నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సమావేశం..
వర్ష సూచన: ఏపీలోని రాయసీమ, కోస్తాంధ్ర ప్రాంతానికి మళ్లీ వర్షం ముప్పు పొంచిఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం స్థిరంగా కొనసాగుతుండటం, దానికి తోడు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఏపీలోని ఐదు జిల్లాల్లో భారీ ఎత్తున పంటలు నీటమునిగిన సంగతి తెలిసిందే.
మంత్రులు, అధికారులతో సీఎం భేటీ: స్థూల ఆర్థిక వృద్ధి రేటు పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. మంత్రులు, శాఖల హెచ్ వోడీలతో సచివాలయంలో సమావేశం నిర్వహించనున్నారు.
సాక్షి ప్రాపర్టీ షో: నేటి ఉదయం 10 గంటలకు తాజ్ బంజారా హోటల్ వేదికగా సాక్షి ప్రాపర్టీ షో ప్రారంభంకానుంది. ఈ షోలో 50కి పైగా స్టాళ్లు ఏర్పాటుచేయనున్నారు.