
సాక్షి, విజయవాడ: అంతర్వేది రథం దగ్దమైన ఘటనలో పోలీసు శాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. క్లూస్ టీమ్ ద్వారా సంఘటన స్థలాన్ని ఏలూరు రేంజి డీఐజీ కేవీ మోహన్ ఆదివారం పరిశీలించారు. అయితే రథం ఉంచిన ప్రాంతంలో పై భాగాన తేనె తుట్టె ఉన్నట్లు గుర్తించారు. రథానికి రక్షణగా తాటాకులు, సర్వే కర్రలు ఉంచగా, రాత్రి వేళ కొందరు వ్యక్తులు తేనె తుట్టెను తొలగించే ప్రయత్నం చేశారు. అయితే తేనె తుట్టెకు నిప్పుపెట్టడంతో తాటాకులకు అంటుకుని ప్రమాదం జరిగింది. దీంతో రథం దగ్దమైనట్లు పోలీసులు ప్రాధమికంగా అంచనాకు వచ్చారు. ఇంకా ఈ సంఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment