
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం ల్యాండ్ కేసులో మాజీ ఆర్డీవోకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం(నవంబర్ 5) నోటీసులు జారీ చేసింది. ల్యాండ్ స్కామ్‌లో శుక్రవారం తమ ముందు విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో కోరింది.
ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అమోయ్‌కుమార్,ఎమ్మార్వో జ్యోతిలను ఈడీ విచారించింది. ఈ విచారణ ఆధారంగా మాజీ ఆర్డీఓ వెంకటాచారికి ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది.
మహేశ్వరం నాగారంలోని సర్వేనెంబర్ 181లోని 42 ఎకరాల భూ కేటాయింపులపై ఈడీ ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ కేసులో కలెక్టర్ అమోయ్ కుమార్,ఎమ్మార్వో జ్యోతి స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డు చేసింది.

ఇదీ చదవండి: 12 నుంచి ఐఏఎస్‌ల విచారణ
Comments
Please login to add a commentAdd a comment