land scam case
-
భూదాన్ భూముల కుంభకోణంలో కీలక పరిణామం
-
అమోయ్‌కుమార్ ల్యాండ్ కేసు: ఆర్డీవోకు ‘ఈడీ’ పిలుపు
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం ల్యాండ్ కేసులో మాజీ ఆర్డీవోకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం(నవంబర్ 5) నోటీసులు జారీ చేసింది. ల్యాండ్ స్కామ్‌లో శుక్రవారం తమ ముందు విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో కోరింది.ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అమోయ్‌కుమార్,ఎమ్మార్వో జ్యోతిలను ఈడీ విచారించింది. ఈ విచారణ ఆధారంగా మాజీ ఆర్డీఓ వెంకటాచారికి ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది.మహేశ్వరం నాగారంలోని సర్వేనెంబర్ 181లోని 42 ఎకరాల భూ కేటాయింపులపై ఈడీ ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ కేసులో కలెక్టర్ అమోయ్ కుమార్,ఎమ్మార్వో జ్యోతి స్టేట్మెంట్ను ఈడీ రికార్డు చేసింది. ఇదీ చదవండి: 12 నుంచి ఐఏఎస్‌ల విచారణ -
సీఎం సిద్దరామయ్యపై కేసు.. ముడా కార్యాలయంలో ఈడీ సోదాలు.
బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మనీలాండరింగ్ కేసుకు సంబంధించి మైసూర్‌లోని ముడా కార్యాలయంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు చేపట్టారు. 12 మంది అధికారుల బృందం శుక్రవారం ఉదయం ముడా కార్యాలయంలో సోదాలు చేసింది. దీంతోపాటు మైసూరులోని ఇతర ప్రాంతాల్లోనూ కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. ముడా చీఫ్‌గా కే మరి గౌడ రాజీనామా చేసిన నేపథ్యంలో ఈడీ దాడులు చేపట్టింది. అయితే ఈ కుంభకోణంలో ప్రమేయమున్న అధికారులందరినీ ఏజెన్సీ విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.ముడా కమిషనర్ ఏఎన్ రఘునందన్ సహా సీనియర్ అధికారులు, ప్రత్యేక భూసేకరణ కార్యాలయానికి చెందిన సిబ్బందితో ఈడీ అధికారులు సమావేశం అయ్యారు. భూ కేటాయింపు కేసులో ముడా అధికారుల ప్రమేయాన్ని నిర్ధారించేందుకు దర్యాప్తు సంస్థ అధికారులు వారిని ప్రశ్నిస్తున్నారు. అనంతరం కేసుకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.కాగా సీఎం భార్య బీఎం పార్వతికి విజయనగర్‌లోని అప్‌మార్కెట్ మైసూరు ఏరియాలో ఉన్న 14 ప్లాట్ల భూమిని అక్రమంగా కేటాయించిందన్న ఆరోపణలపై సిద్ధరామయ్య విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి ఈడీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో సీఎం సిద్దరామయ్యసతీమణి పార్వతి తమ భూములను తిరిగి ముడా సంస్థకు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ స్థలాలను వెనక్కి తీసుకునేందుకు ముడా అధికారులు కూడా అంగీకరించారు. -
100 కోట్ల భూమి స్వాహా.. అడ్డంగా దొరికిపోయిన టీడీపీ నేత
-
తిరుపతిలో కూటమి నేత అరాచకం 22 రోజులుగా రోడ్డుపై కుటుంబం ధర్నా
-
సోరెన్ కోసం ఈడీ వెదుకులాట
న్యూఢిల్లీ/రాంచీ: భూ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ప్రశ్నించేందుకు సోమవారం ఉదయం ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఇంట్లో లేరని, ఎక్కడున్నారో జాడ తెలియడం లేదని, సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయిందని అధికారులు చెప్పారు. జనవరి 27 రాత్రి రాంచీ నుంచి ఢిల్లీ బయల్దేరిన సోరెన్ ఎక్కడున్నారో తెలియడం లేదన్నారు. జనవరి 31 మధ్యాహ్నం రాంచీలోని నివాసంలో అందుబాటులో ఉంటానని ఆయన నుంచి మెయిల్ అందినట్లు తెలిపారు. ఈడీ అధికారులు రాత్రి దాకా ఢిల్లీ నివాసంలోనే పడిగాపులు కాశారు. సోరెన్ ఆచూకీ దొరికే దాకా అక్కడే ఉంటామని స్పష్టం చేశారు. ఆయన గురించి ఢిల్లీ విమానాశ్రయాన్ని కూడా అప్రమత్తం చేసినట్టు తెలిపారు. తనకందిన తాజా సమన్లను కక్షసాధింపు చర్యగా మెయిల్లో సోరెన్ అభివర్ణించారు. -
సోరెన్‌పై ఈడీ ప్రశ్నల వర్షం
రాంచీ: జార్ఖండ్‌లో భూకుంభకోణం, సంబంధిత మనీ లాండరింగ్ కేసులో ఆఫీసుకొచ్చి విచారణకు హాజరుకావాలని ఏడు సార్లు సమన్లు ఇచ్చినా బేఖాతరు చేసిన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చివరకు ఆయన ఇంటికే వచ్చి విచారించారు. ఈడీ అధికారులు వస్తున్నారన్న వార్తతో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) కార్యకర్తలు రావడంతో ఈడీ అధికారుల రక్షణ కోసం భద్రతాబలగాలు భారీ ఎత్తున మొహరించారు. దీంతో ఇంటి పరిసరాలు ఖాకీవనాన్ని తలపించాయి. శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు రాంచీలోని ఆయన నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు సోరెన్‌పై సుదీర్ఘంగా ఏడు గంటలకుపైగా ప్రశ్నలు సంధించారు. కేసుపై పలు వివరాలు అడిగారు. ఈ సందర్భంలో రాష్ట్ర మంత్రి జోబా మాంఝీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్, రాజ్యసభ ఎంపీ మహువా మాజీ, కొందరు పార్టీ ఎమ్మెల్యేలు ఇంట్లోనే ఉన్నారు. రాష్ట్ర డీజీపీ అజయ్‌సింగ్ సైతం అక్కడే ఉన్నారు. జేఎంఎం గిరిజన కార్యకర్తలు కొందరు విల్లు, బాణాలతో సోరెన్ ఇంటిపరిసరాల్లో గుమిగూడి ఈడీ వ్యతిరేక నినాదాలిచ్చారు. ఈడీ వ్యతిరేక ర్యాలీలు జరక్కుండా రాంచీ సబ్ డివిజనల్ మేజి్రస్టేట్ ఉత్కర్‡్ష ఇంటి పరిసరాల్లో కర్ఫ్యూ విధించారు. ఈడీ చర్యపై జేఎంఎం కార్యకర్తలు, గిరిజన సంఘాల నేతలు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాకు దిగారు. ఇప్పటికే 14 అరెస్ట్‌లు భూ హక్కులను మాఫియా అక్రమంగా చేతులు మార్చి కోట్లు కొల్లగొట్టారని ఈడీ గతంలో ఆరోపించింది. ఇప్పటికే ఈ కేసులో 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఛావీ రంజన్ సహా 14 మందిని ఈడీ అరెస్ట్‌చేసింది. ఈ కేసులో బాధితుడిగా నాటకం ఆడుతూ సీఎం రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేయిస్తున్నాడని బీజేపీ ఆరోపిస్తోంది. సీఎంను కేసులోకి లాగి ప్రభుత్వాన్ని కూలదోయాలని మోదీ సర్కార్ కుట్ర పన్నిందని జేఎంఎం ఆరోపిస్తోంది. నా పై కుట్ర: సోరెన్ ఏడు గంటలపాటు ఈడీ విచారణ ముగిశాక ఇంటిబయట కార్యకర్తలనుద్దేశించి సోరెన్ మాట్లాడారు. ‘‘ నా పై కుట్ర పన్నారు. కుట్రను త్వరలోనే బయటపెడతా. మనం ఎవరికీ భయపడేది లేదు. మీ విశ్వాసాన్ని సమున్నతంగా నిలిపేందుకు బుల్లెట్లనైనా ఎదుర్కొంటా. నాకు మద్దతుగా ఇక్కడికొచి్చన మీకందరికీ ధన్యవాదాలు’’ అని సోరెన్ ప్రసంగించారు. -
తెలీదు.. గుర్తు లేదు: సీఐడీ విచారణలో ఇదే ‘నారాయణ’ మంత్రం
సాక్షి, అమరావతి/హైదరాబాద్: టీడీపీ హయాంలో అమరావతిలో భూ కుంభకోణాల కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత పి.నారాయణను సీఐడీ అధికారులు హైదరాబాద్‌లో శుక్రవారం విచారించారు. అమరావతిలో ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారులో టీడీపీ ప్రభుత్వ పెద్దలు భారీ కుంభకోణానికి పాల్పడ్డారని సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణలతో పాటు మొత్తం 14 మందిపై కొన్ని నెలల క్రితం సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో నారాయణను ఆయన నివాసంలో విచారించేలా న్యాయస్థానం ఇటీవల అనుమతిచ్చింది. దాంతో సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలోని ఆయన నివాసంలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించింది. కాగా, సీఐడీ విచారణకు నారాయణ ఏమాత్రం సహకరించలేదని సమాచారం. సీఐడీ అధికారులు ఏం అడిగినా ‘తెలియదు.. గుర్తు లేదు’ అంటూ సమాధానం దాటవేసేందుకు యత్నించారని తెలిసింది. ఈ కేసులో నారాయణను మరికొన్నిసార్లు విచారించాలని సీఐడీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో నారాయణకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని సీఐడీ అధికారులు దాఖలు చేసిన పిటీషన్ న్యాయస్థానంలో విచారణలో ఉంది. ఇటూ అటూ బాబు బినామీలే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో టీడీపీ పెద్దలు యథేచ్ఛగా సాగించిన భూ దోపిడీలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కూడా ప్రధానమైంది. అప్పటి సీఎం చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ.. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ డిజైన్ల ముసుగులో భారీగా భూ దోపిడీకి పాల్పడ్డారన్నది సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్‌ను ముందుగానే మాస్టర్ ప్లాన్‌లో చేర్చిన విషయాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం గోప్యంగా ఉంచింది. ఆ రోడ్డు అలైన్‌మెంట్‌ను డిజైన్ చేసేందుకు ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించినట్టు కథ నడిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలా నిర్మించనున్నారో ముందుగానే తెలిసిన చంద్రబాబు, నారాయణలు తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేష్ సంస్థల పేరిట భారీగా భూములు కొన్నారు. ముందుగానే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్డు డ్రాఫ్ట్ ప్లాన్‌ను చంద్రబాబు నేతృత్వంలో నిర్వహించిన సమీక్షలో ఆమోదించారు. ప్రభుత్వ రహస్యాలను కాపాడుతామని చేసిన పదవీ స్వీకార ప్రమాణానికి విరుద్ధంగా వ్యవహరించి, వారి బినామీలకు అక్రమంగా భారీ ప్రయోజనం కలిగించారు. దాంతో సామాన్యులు తీవ్రంగా నష్టపోయారు. సీఐడీ అధికారులు మంగళగిరి, పెదకాకాని, తాడికొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లను పరిశీలించగా ఈ విషయం స్పష్టమైంది. సీఆర్డీఏ ఫైళ్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ల వివరాలు, ఇతర ఆధారాలను సీఐడీ విభాగం సేకరించి కేసు నమోదు చేసింది. ఇదీ చదవండి: Jagananna Gorumudda: ‘గోరుముద్ద’లో కొత్త రుచులు -
భూ కుంభకోణం కేసులో మరొకరి అరెస్ట్
చిల్లకూరు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం భూ కుంభకోణం కేసులో మరో నిందితుడిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. చిల్లకూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ్మినపట్నం సమీపంలో ఉన్న పోర్టు భూములను వెబ్‌ల్యాండ్‌లో మార్పులుచేసి ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్ చేశారని చెప్పారు. దీనిపై గూడూరు ఆర్డీవో మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి ఇప్పటికే నలుగురిని రిమాండ్‌కు తరలించామన్నారు. ఈ కేసులో పొదలకూరు రెవెన్యూ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్ సాసం నరసయ్యను మంగళవారం చిల్లకూరు బైపాస్ వద్ద సీఐ శ్రీనివాసులరెడ్డి అరెస్ట్ చేశారని తెలిపారు. రాపూరు మండలం సైదాసుపల్లి గ్రామానికి చెందిన సాసం నరసయ్య నెల్లూరులో ఉంటున్నారని, ఆయనే చిల్లకూరు రెవెన్యూ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ నవీన్‌ను నిందితులకు పరిచయం చేశాడని చెప్పారు. వీరంతా ముఠాగా ఏర్పడి సర్వే నంబర్ 94–3లో ఉన్న 271.80 ఎకరాల్లో 209 ఎకరాలను 327 సర్వే నంబర్‌కు మార్చి 327–3ఏ2–హెచ్1–హెచ్11 సబ్ డివిజన్ చేసి ఆన్లైన్లో 11 మంది పేర్లతో నమోదు చేశారని వివరించారు. ఈ కేసులో తహసీల్దార్ గీతావాణి, నరసయ్య, శేఖరరెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ పరారీలో ఉన్నారని చెప్పారు. వారిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డీఎస్పీ వెంట గూడూరు రూరల్ సీఐ శ్రీనివాసులరెడ్డి, చిల్లకూరు ఎస్ఐ అజయ్‌కుమార్ ఉన్నారు. -
ఫిర్యాదులు; రాష్ట్రవ్యాప్తంగా ఈటల ఆస్తులపై ఆరా!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ విషయంలో పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలో దాదాపు 66 ఎకరాల భూమిని మంత్రి తమ నుంచి లాక్కున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేయడం, ఆ వెంటనే సీఎం ఆదేశాలతో అధికారులు ఆగమేఘాల మీద స్పందించిన విషయం తెలిసిందే. రంగంలోకి దిగిన మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ భూ ఆక్రమణలు నిజమేనని తేల్చారు. ఈ మేరకు నివేదిక కూడా ఇచ్చారు. విజిలెన్స్ విచారణ సోమవారం పూర్తి కానుంది. విజిలెన్స్ విచారణ అనంతరం రాజేందర్ విషయంలో మరిన్ని పరిణామాలు చోటుచేసుకోనున్నట్లు సమాచారం. మెదక్ జిల్లా కలెక్టర్ ఇప్పటికే భూ కబ్జాను నిర్ధారించడంతో ఆయనపై రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కబ్జాతోపాటు బెదిరింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలపై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని సమాచారం. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మాజీ మంత్రిపై కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కబ్జా భూముల్లో ఉన్న చెట్లు నరికినందున ఫారెస్టు కన్జర్వేషన్ యాక్ట్, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడం, అందులో నిర్మాణాలు, రోడ్డు నిర్మాణాలు చేపట్టడంపై కూడా రాజేందర్‌పై కేసులు నమోదవుతాయని సమాచారం. కేవలం మాసాయిపేట మండలమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రాజేందర్ ఆస్తులపై ప్రభుత్వం ఆరా తీస్తోందని తెలిసింది. చదవండి: ‘ఈటల కబ్జా భూములను స్వాధీనం చేసుకుంటాం’ -
అమరావతి భూముల కుంభకోణం కేసులో సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు
-
దర్యాప్తునకు ముందే స్టే ఎలా ఇస్తారు..?
సాక్షి, న్యూఢిల్లీ: ‘గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మేం ఆమోదించం. అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప దర్యాప్తుపై స్టే ఇవ్వరాదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటిస్తూ వచ్చినందునే ఇప్పుడు మేం హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకుంటున్నాం. సంబంధిత పిటిషన్‌ను హైకోర్టు త్వరితగతిన విచారించాల్సిన అవసరం ఉంది. వచ్చే వారమే ఈ పిటిషన్‌ను విని, పరిష్కరించాలని హైకోర్టుకు సూచిస్తున్నాం’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. గత ప్రభుత్వ హయాంలో అమరావతి ప్రాంతమైన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో ఎస్సీ, బీసీలకు చెందిన అసైన్డ్ భూములను ఏపీ ప్రభుత్వం రాజధాని కోసం తీసుకుంటే పరిహారం రాదని నమ్మించి.. రాజకీయ నాయకులు, అధికారులు కలిసి భూములు బదలాయించిన వ్యవహారంపై దర్యాప్తు జరుపుతుండగా ఏపీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. ప్రభుత్వం తరుఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, పి.ఎస్.నరసింహా, మెహఫూజ్ నజ్కీ వాదనలు వినిపించారు. పరిష్కరించకపోతే మళ్లీ మీ వద్దకు.. తొలుత ముకుల్‌రోహత్గీ వాదనలు వినిపిస్తూ ‘ఒక వారం రోజుల్లోనే తుది విచారణ చేపట్టి ఉత్తర్వులు ఇస్తామని సెప్టెంబర్ 11 నాటి విచారణ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది’ అంటూ ప్రస్తావించారు. ఈ సందర్భంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు స్పందిస్తూ ‘హైకోర్టులో విచారణ ఎప్పుడు ఉంది?’ అని ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సమాధానం ఇస్తూ ‘హైకోర్టు విచారణ తేదీ ఇవ్వలేదు..’ అని నివేదించారు. ఈ నేపథ్యంలో ‘హైకోర్టు వచ్చే వారం సంబంధిత పిటిషన్‌ను పరిష్కరించాలని అడుగుతాం’ అని ధర్మాసనం పేర్కొంది. ఈ దశలో ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ ‘అందుకు సమ్మతమే.. ఈ పిటిషన్‌ను ఇక్కడ పెండింగ్‌లో ఉంచండి..’ అని కోరగా.. ధర్మాసనం ఎందుకని ప్రశ్నించింది. ‘ఎందుకంటే అక్కడ పరిష్కరించకపోతే మళ్లీ మీ వద్దకు రావాలి. హైకోర్టు ఉత్తర్వులు పూర్తిగా చట్టవిరుద్ధం..’ అని రోహత్గీ నివేదించారు. దర్యాప్తు ముందే స్టే ఇస్తారా? ప్రతివాది తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించేందుకు ప్రయత్నించగా జస్టిస్ లావు నాగేశ్వరరావు జోక్యం చేసుకుంటూ ‘అది మధ్యంతర ఉత్తర్వు మాత్రమే కాబట్టి వచ్చే వారం పరిష్కరించాలని మేం హైకోర్టుకు సూచిస్తున్నాం.. కేసును పరిష్కరించనివ్వండి’ అని ఉత్తర్వు వెలువరించి ముగించబోయారు. ప్రతివాది తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా మాట్లాడుతూ ‘హైకోర్టు దర్యాప్తుపై స్టే ఇచ్చి ఉండాల్సింది కాదన్న మీ అబ్జర్వేషన్‌ను ఉత్తర్వుల్లో నమోదు చేస్తే దాని ప్రభావం హైకోర్టు విచారణపై పడుతుంది’ అని నివేదించారు. అయితే దానిని ఉత్తర్వుల నుంచి తొలగిస్తామని, ఈ పిటిషన్‌ను ఇక్కడ పెండింగ్‌లో ఉంచుతున్నామని కోర్టు పేర్కొంది. ఇలాంటి ఉత్తర్వులు నిలబడటం కష్టం ప్రతివాది తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా మరో నివేదనను ధర్మాసనం ముందుం చారు. ‘వారం సమయం మాత్రమే ఇవ్వడం వల్ల ఇబ్బంది ఉంటుంది. రెండు వారాలు గడువు ఇవ్వండి..’ అని కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ‘ముందుగా ఉత్తర్వులు రానివ్వండి.. వచ్చాక ఇక్కడ మూడు వారాలు ఆగి విచారణ జరుపుదాం.. తొందర ఏం లేదు.. దానిలో ఆందోళన అక్కర్లేదు..’ అని పేర్కొంది. ఈ సమయంలో సిద్ధార్థ లూత్రా తిరిగి వాదనలు వినిపిస్తూ దర్యాప్తు అంశాన్ని ప్రస్తావించారు. వాంగ్మూలాలు నమోదు చేస్తోందని నివేదించారు. ఈ సందర్భంలో జస్టిస్ లావు నాగేశ్వరరావు జోక్యం చేసుకుంటూ ‘అదేమైనా కావొచ్చు. కానీ ఇలాంటి (దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇవ్వడం) ఉత్తర్వులు నిలబడడం చాలా కష్టం. అది మీకు తెలుసు. మీరు నిపుణులు కూడా. ఒకసారి ఫిర్యాదు నమోదైన తర్వాత దర్యాప్తు ప్రారంభం కాకుండానే ఇందులో కేసు ఏముంది? అంటూ హైకోర్టు స్టే ఇవ్వడం ఏంటి?’ అని ప్రశ్నించారు. ‘2014కు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తోంది..’ అని లూత్రా నివేదించగా, ‘మేం ఏం సహాయం చేయలేం. యంత్రాంగం ముందుకు నడవాల్సి ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకుపోవాల్సి ఉంటుంది..’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ‘మేం పదే పదే చెబుతున్నాం. సాధారణ పరిస్థితుల్లో స్టే ఇవ్వకూడదు..’ అని పేర్కొన్నారు. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేశారు. -
‘కేసును సీబీఐ విచారణకు అప్పజెప్పాలి’
సాక్షి, న్యూఢిల్లీ: అవినీతి నిరోధక చట్టం ప్రకారం సెక్షన్ 19(3) ప్రకారం హైకోర్టుకు స్టే ఇచ్చే అధికారం లేదని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్ర పోలీసులపై కోర్టుకు నమ్మకం లేకపోతే సీబీఐకి అప్పగించవచ్చని సూచించారు. అమరావతి భూ కుంభకోణం విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే చేయవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, చంద్రబాబు చేసిన అవినీతి పై దర్యాప్తు చేసి ఆ నిధిని ప్రభుత్వ ఖజానాకు జమ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలు కాపాడట కోసం తమ ప్రభుత్వం ఇలా చేస్తుందన్నారు. (ప్రగల్భాలు పలికి ‘స్టే’ తెచ్చుకుంటారా?) చదవండి: హైకోర్టు ఉత్తర్వులు: కేంద్రం జోక్యం చేసుకోవాలి రాజధాని భూముల స్కాంపై కోర్టు స్టే ఇవ్వడం దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. కేసును సీబీఐ విచారణకు ఇవ్వాలని కోరారు. సైబర్ నెట్ స్కాంపై సీబీఐ విచారణ జరపాలన్నారు. అదే విధంగా చిన్న చిన్న కేసులను సీబీఐ విచారణకు ఇస్తున్నారని, మంత్రివర్గ ఉపసంఘం విచారించి సిట్‌ను ఏర్పాటు చేస్తే దానిపై స్టే ఇచ్చారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అన్నారు. మీడియాపై ఆంక్షలు విధిస్తూ ఆర్డర్ ఇచ్చారని, అమరావతి భూముల స్కాంను సీబీఐ విచారణకు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. (కోర్టులు ఎవరి ప్రయోజనాల కోసం?) -
భూ కుంభకోణం కేసులో టీడీపీ నేత అరెస్ట్
తుళ్లూరు (గుంటూరు జిల్లా): అమరావతి పరిధిలోని నెక్కళ్లు గ్రామంలో వెలుగు చూసిన భూ కుంభకోణం కేసులో టీడీపీ నేతను సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాలోని రాజధాని గ్రామాల్లో కొందరు టీడీపీ నేతలు దొంగపత్రాలు సృష్టించి.. లేని భూమిని ఉన్నట్టు చూపి ప్లాట్లు పొందారు. దీనికి తోడు అసలైన రైతుకు సీఆర్డీఏ సర్వేలో తక్కువ విస్తీర్ణం చూపించి.. టీడీపీ నేతలకు మాత్రం అసలు భూమి కన్నా ఎక్కువ విస్తీర్ణం, భూమి లేకపోయినా ఉన్నట్టు చూపించారు. రైతుల ఫిర్యాదుతో.. ► తమ భూమిని టీడీపీ నేతలు కాజేశారంటూ నెక్కళ్లు గ్రామానికి చెందిన అసలు రైతులు గతంలో తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ► దీనిని తహసీల్దార్ తుళ్లూరు సీఐకి సిఫారసు చేయగా.. సిట్ విచారణ చేపట్టింది. ► విచారణాధికారులు నెక్కళ్లు గ్రామానికి చెందిన టీడీపీ నేత రావెల గోపాలకృష్ణను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ► మరికొందరు నిందితులను అదుపులోకి తీసుకోనున్నట్టు అధికార వర్గాల సమాచారం. ► ఇక్కడి భూ కుంభకోణాలపై సిట్ విచారణ కొనసాగుతుండటంతో అప్పట్లో అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేతల్లో వణుకు మొదలైంది. -
గోల్డ్‌స్టోన్‌కు గట్టిదెబ్బ
సాక్షి, హైదరాబాద్: పెను సంచలనం సృష్టించిన వేల కోట్ల విలువైన హైదర్‌నగర్ గ్రామంలోని 196 ఎకరాల భూముల స్కాం కేసులో గోల్డ్‌స్టోన్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో పాటు ఇతరులకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భూములపై తమకు హక్కులు ఉన్నాయంటూ గోల్డ్ స్టోన్ ఎక్స్‌పోర్ట్స్, మరో 16 మంది దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్లు, అనుబంధ పిటిషన్లు అన్నింటినీ కొట్టేస్తూ ఇటీవల కీలకతీర్పు వెలువరించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్‌ల ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీంతో 60 ఏళ్లుగా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న అత్యంత విలువైన ఈ భూముల వివాదానికి తెరపడింది. హైదర్‌నగర్‌లోని సర్వే నంబర్ 172 సహా అప్పీల్ పిటిషన్లల్లో పేర్కొన్న భూములు జాగీర్ భూములేనని స్పష్టం చేసింది. నిజాం కాలంలో 1948కి పూర్వమే వాటిని ఈనాం ఇచ్చారని పేర్కొంది. సర్వే నంబర్ 172తో సహా ఈ భూములపై పిటిష నర్లు ఖుర్షీద్ జా పైగా.. మాతృక ఆస్తి నుంచి ప్రాథమిక డిక్రీ ద్వారా భూములపై హక్కులు పొందినట్లుగా గోల్డ్‌స్టోన్ కంపెనీ ఇతరులు రుజువు చేసుకోలేకపోయారని తేల్చింది. ఖుర్షీద్ జా పైగాకు చెందిన భూముల్లో కొన్నింటిని రుకియా బేగం, వారిస్ అలీ, ఘనీ షరీఫ్, బొడ్డు వీరస్వామి ఇతరులు 1948కి ముందే నిజాం కాలంలోనే సాగు చేసుకున్నారని, భూముల్ని సాగు చేసినట్లుగా పట్టాలు ఉన్నాయంది. వారి నుంచి కొనుగోలు చేసిన వారికే భూములపై హక్కులు ఉంటాయని.. ఖాసిం నవాజ్, సైరస్ ఇన్వెస్ట్మెంట్ల నుంచి కొనుగోలు చేసిన వారికి ఏ హక్కులు ఉండవని తెలిపింది. నిజాం స్టేట్ భారత్‌లో విలీనం కాకముందే రైతులకు భూములపై హక్కులు సంక్రమించా యని, హైదరాబాద్ జాగీర్ అబాలిషన్ రెగ్యులేషన్, 1358 ఫసలీ (1947) రాక ముందే వారికి సాగు నిమిత్తం పట్టాలు ఉన్నందున ఇవి ప్రభుత్వ భూములు కావని పేర్కొంది. ఆ డిక్రీ చెల్లదు..: ఈ భూముల విషయంలో కోర్టును తప్పు దారి పట్టించి 1963, జూన్ 28న కింది కోర్టు నుంచి పొందిన డిక్రీ చెల్లదని తేల్చింది. 1996 బెయిలీఫ్ నివేదిక ఆధారంగా సర్వే నంబర్ 172లోని భూమిని ప్రతివాదుల నుంచి స్వాధీనం చేసుకోవడం చెల్లదని, ఆ భూమిని తక్షణమే ప్రతివాదులకు అప్పగించాలని ఆదేశించింది. హైదర్‌నగర్‌లోని సర్వే నంబర్ 172లో 98 ఎకరాల 10 కుంటల భూమి విషయంలో 1998లో తుది డీక్రీ ఉత్తర్వులను ధర్మాసనం కొట్టేసింది. ఇదే వివాదంపై రంగారెడ్డి జిల్లా కోర్టు 1996లో జారీ చేసిన ఉత్తర్వులు, ఎగ్జిక్యూటివ్ వారెంట్లు, బెయిలీఫ్ చట్ట వ్యతిరేకమని హైకోర్టు తీర్పు చెప్పింది. 2004లో హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ నర్సింహారెడ్డి ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్ధించింది. -
తల్లితోపాటు ఈడీ ఎదుట వాద్రా
జైపూర్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా, అతని తల్లి మౌరీన్ వాద్రా మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరయ్యారు. రాజస్తాన్‌లోని బికనీర్ జిల్లాలో భూ కుంభకోణానికి పాల్పడ్డారని వాద్రాపై పలు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో నాలుగు రోజుల పర్యటనలో ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా తన భర్త, అత్తతోపాటు వచ్చి జైపూర్‌లోని ఈడీ కార్యాలయం వద్ద వారిని వదిలివెళ్లారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అధికారులు ముందుగా రాబర్ట్ వాద్రాను, కొద్దిసేపటి తర్వాత మౌరీన్‌ను విచారణ నిమిత్తం లోపలికి పిలిచారు. సుమారు 9 గంటలపాటు రాబర్ట్ వాద్రాను ప్రశ్నించిన ఈడీ అధికారులు.. బుధవారం కూడా హాజరుకావాల్సి ఉం టుందని ఆయనకు తెలిపారు. బికనీర్‌లో 2015లో జరిగిన భూ లావాదేవీల్లో వాద్రా ఫోర్జరీకి పాల్పడ్డారంటూ అప్పటి తహశీల్దార్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ కేసులు నమోదు చేశారు. ఈ మేరకు ఈడీ కూడా కేసు నమోదు చేసింది. దీంతోపాటు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూ కొనుగోళ్లు చేపట్టిన స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో గల సంబంధాలపైనా వాద్రాను ఈడీ ప్రశ్నించిందని సమాచారం. ఈ కేసులో ఈడీ మూడుసార్లు సమన్లు ఇచ్చినప్పటికీ రాబర్ట్ వాద్రా స్పందించలేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిటిషన్‌పై స్పందించిన రాజస్తాన్ హైకోర్టు.. విచారణకు సహకరించాలంటూ వాద్రాతోపాటు ఆయన తల్లి మౌరీన్‌ను ఆదేశించింది. అయితే, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ ఈడీకి స్పష్టం చేసింది. -
వాద్రా, హుడాపై ఎఫ్ఐఆర్
చండీగఢ్: గుర్గావ్లో అక్రమ భూ ఒప్పందాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ బావ రాబర్ట్ వాద్రా, హరియాణా మాజీ సీఎం భూపిందర్‌సింగ్ హుడాలపై శనివారం పోలీసులు కేసు నమోదుచేశారు. సురేందర్ శర్మ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు వాద్రా, హుడాతో పాటు డీఎల్ఎఫ్, ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ కంపెనీలపై ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్లు మనేసర్ డీసీపీ రాజేశ్ చెప్పారు. గుర్గావ్లోని 4 గ్రామాల్లో హౌసింగ్ కాలనీలు, వాణిజ్య సముదాయాల నిర్మాణానికి హుడా సీఎంగా ఉన్న సమయంలో ఇచ్చిన అనుమతుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలున్నాయి. వీటిపై విచారణకు ఖట్టర్ ప్రభుత్వం 2015లో జస్టిస్ ధింగ్రా కమిటీ వేసింది. వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ 2008లో ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుంచి 3.5 ఎకరాల భూమిని రూ.7.50 కోట్లకు కొనుగోలుచేసి, హుడా పలుకుబడితో వాణిజ్య అనుమతులు పొంది ఆ భూమిని డీఎల్ఎఫ్కు రూ.58 కోట్లకు విక్రయించిందని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. -
మాజీ సీఎంపై సీబీఐ ఛార్జిషీట్
సాక్షి, న్యూఢిల్లీ: మానేసర్ భూ కుంభకోణం కేసులో హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాపై శుక్రవారం సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ మాజీ సీఎంతో పాటు దీంతో సంబంధం ఉందన్న ఆరోపణలతో మరో 34 మంది అధికారుల పేర్లను ఛార్జిషీట్లో చేర్చారు. భూపిందర్ సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చేసిన మురారి లాల్ తయాల్, యూపీఎస్సీ మాజీ సభ్యుడు చాటర్ సింగ్ సహా తదితర అధికారులపై వేల పేజీలతో కూడిన ఛార్జిషీట్‌ను సీబీఐ అధికారులు పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించారు. ఈ 24లోగా పూర్తి ఆధారాలు సమర్పించేందుకు సీబీఐని కోర్టు ఆదేశించినట్లు సమాచారం. అసలు ఏం జరిగిందంటే.. భూపిందర్ సీఎంగా ఉన్న 2005-15 కాలంలో మానేసర్‌లో ఇండస్ట్రియల్ మోడల్ టౌన్‌షిప్‌ల ఏర్పాటుకుగానూ 900 ఏకరాలకు పైగా భూమి సేకరించాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో తక్కువ ధరలకే బిల్డర్స్ రైతులు, స్థానికులను బెదిరించి భూములు కొనుగోలు చేశారు. అయితే హుడా ప్రభుత్వమే బలవంతంగా మార్కెట్ ధర కంటే తక్కువ ధరలకే భూములు సొంతం చేసుకోవాలని ప్లాన్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఉద్దేశపూర్వకంగానే భూములు కొనుగోలు చేసిన తర్వాత హుడా ప్రభుత్వం అక్కడ ఎలాంటి టౌన్షిప్ నిర్మించకపోవడం గమనార్హం. తాజాగా సీబీఐ దీనిపై ఛార్జిషీటు దాఖలు చేసి కేసు విచారణను వేగవంతం చేయాలని చూస్తోంది. -
మాజీమంత్రి శంకర్రావు సోదరుడు అరెస్ట్
హైదరాబాద్ : మాజీమంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు సోదరుడు దయానంద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. భూకబ్జా కేసులో ఆయనను ముషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామ్‌నగర్‌లోని జెమినీకాలనీలో దయానంద్ భూకబ్జాకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా గ్రీన్‌ఫీల్డ్ భూకబ్జా వ్యవహరానికి సంబంధించి శంకర్రావుతో పాటు దయానంద్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఆల్వాల్ మండలంలోని కానాజీగూడాలో గ్రీన్‌ఫీల్డ్ హౌసింగ్ సొసైటీలో మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు, ఆయన సోదరుడు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి దాదాపు 75 ఎకరాల భూమిని కబ్జాచేసేందుకు యత్నించారంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై హై కోర్టులో దాఖలైన కేసును విచారించిన అనంతరం శంకర్రావు, ఆయన సోదరుడు దయానంద్‌తో పాటు మరికొంతమందిపై కేసులు నమోదు చేయా ల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఆమేరకు గత ఏడాది లో సైబరాబాద్ పరిధిలోని నేరేడ్మెట్ పోలీసులు శంకర్రావు, ఆయన సోదరుడు,మరికొంతమందిపై సెక్షన్ 120బి,420,367,468,506 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దీనిని సవాల్ చేస్తూ శంకర్రావు సోదరుడు కోర్టుకు వెళ్లడంతో కేసు విచారణపై స్టే విధించింది.