హైదరాబాద్ : మాజీమంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు సోదరుడు దయానంద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. భూకబ్జా కేసులో ఆయనను ముషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామ్నగర్లోని జెమినీకాలనీలో దయానంద్ భూకబ్జాకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా గ్రీన్‌ఫీల్డ్ భూకబ్జా వ్యవహరానికి సంబంధించి శంకర్రావుతో పాటు దయానంద్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఆల్వాల్ మండలంలోని కానాజీగూడాలో గ్రీన్‌ఫీల్డ్ హౌసింగ్ సొసైటీలో మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్‌రావు, ఆయన సోదరుడు నకిలీ డాక్యుమెంట్‌లు సృష్టించి దాదాపు 75 ఎకరాల భూమిని కబ్జాచేసేందుకు
యత్నించారంటూ ఆరోపణలు వచ్చాయి.
దీనిపై హై కోర్టులో దాఖలైన కేసును విచారించిన అనంతరం శంకర్రావు, ఆయన సోదరుడు దయానంద్‌తో పాటు మరికొంతమందిపై కేసులు నమోదు చేయా ల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఆమేరకు గత ఏడాది లో సైబరాబాద్ పరిధిలోని నేరేడ్‌మెట్ పోలీసులు శంకర్‌రావు, ఆయన సోదరుడు,మరికొంతమందిపై సెక్షన్ 120బి,420,367,468,506 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దీనిని సవాల్ చేస్తూ శంకర్‌రావు సోదరుడు కోర్టుకు వెళ్లడంతో కేసు విచారణపై స్టే విధించింది.
మాజీమంత్రి శంకర్రావు సోదరుడు అరెస్ట్
Published Mon, Aug 19 2013 2:19 PM | Last Updated on Wed, Oct 3 2018 7:31 PM
Advertisement