Dayanand
-
Game On Movie Review Telugu: సైకలాజికల్ థ్రిల్లర్ ‘గేమ్ ఆన్’ మూవీ ఎలా ఉందంటే..
టైటిల్: గేమ్ ఆన్ నటీనటులు: గీతానంద్, నేహా సోలంకి, ఆదిత్య మీనన్, మధుబాల, వాసంతి, కిరీటీ, శుభలేఖ సుధాకర్ తదితరులు నిర్మాత: రవి కస్తూరి దర్శకత్వం: దయానంద్ సంగీతం: అభిషేక్ ఏఆర్(బీజీఎం), నవాబ్ గ్యాంగ్, అశ్విన్ అరుణ్(పాటలు) సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్ ఎడిటర్: వంశీ అట్లూరి విడుదల తేది: ఫిబ్రవరి 2, 2024 కథేంటంటే.. గౌతమ్ సిద్ధార్థ్ అలియాస్ సిద్ధు(గీతానంద్) ఓ గేమింగ్ కంపెనీలో పని చేస్తుంటాడు. అదే సంస్థలో పని చేసే మోక్ష(వాసంతి)తో ప్రేమలో ఉంటాడు. టార్గెట్ సరిగా పూర్తి చేయకపోవడంతో అతన్ని ఉద్యోగం పోతుంది. అదే సమయంలో మోక్ష కూడా సిద్ధుకి బ్రేకప్ చెప్పి.. అతని ఫ్రెండ్ రాహుల్(కిరీటీ)తో వెళ్లిపోతుంది. ఉద్యోగం కోల్పోవడం.. స్నేహితుడు మోసం చేయడంతో సిద్దు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అదే సమయంలో ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి సిద్ధుకి ఫోన్ వస్తుంది. ‘నీ ముందు తిరుగుతున్న ఈగను చంపేస్తే లక్ష రూపాలయను అకౌంట్లో వేస్తాం’అని చెబుతాడు. సిద్ధు ఈగను చంపగానే..అకౌంట్లోకి రూ.లక్ష క్రెడిట్ అవుతుంది. దీంతో సిద్ధు ఆత్మహత్య ఆలోచనను విరమించి ఇంటికెళ్తాడు. ఆ తర్వాతి మళ్లీ కాల్ చేసి..‘ఇదొక సైకలాజికల్ గేమ్ షో అని, చిన్న పిల్లను ఏడిపిస్తే..రూ.మూడు లక్షలు పంపిస్తామని చెబుతారు. అలా వరుసగా చిన్న చిన్న టాస్క్‌లు ఇస్తూ డబ్బులు పంపించడంతో సిద్ధు జీవితమే మారిపోతుంది. అతని జీవితంలోకి తార(నేహా సోలంకి) వస్తుంది. ఇలా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్న సమయంలో గేమ్‌లో భాగంగా ఓ వ్యక్తిని చంపాలని ఫోన్ కాల్ వస్తుంది. సిద్ధు ఆ టాస్క్‌ని పూర్తి చేయలేనని చెబుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు సిద్ధుకి టాస్క్‌లు ఇస్తున్నదెవరు? ఎందుకు ఇస్తున్నారు? సైకాలజిస్ట్ మదన్ మోహన్(ఆదిత్య మీనన్)కు ఈ గేమ్‌తో ఉన్న సంబంధం ఏంటి? సిద్ధు గతమేంటి? తాత సూర్య నారాయణ(సుభలేఖ సుధాకర్) ఎలా చనిపోయాడు? అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన అర్చన(మధుబాల)కి సిద్ధుకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? సిద్ధు జీవితంలోకి తార ఎలా వచ్చింది? అసలు ఆమె నేపథ్యం ఏంటి? రియల్ టైమ్ గేమ్‌లోకి వెళ్లిన తర్వాత సిద్ధు జీవితంలో ఎలాంటి మలుపులు వచ్చాయి? ఫైనల్‌గా ఏం జరిగింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే... ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఏమి సాధించలేక ఆత్మహత్య చేసుకోవనుకున్న ఓ యువకుడు.. అనుకోకుండా రియల్ టైమ్ గేమ్‌లోకి ప్రవేశిస్తాడు. ఆ ఆట అతని జీవితంలో ఎలాంటి మలుపులు తిప్పింది? అసలు ఆ గేమ్ ఎంచుకోబడడానికి కారణం ఏమిటి, ఈ గేమ్ ఎవరు ఆడుతున్నారు? ఫైనల్‌గా ఏం జరిగింది? అనేది ఈ సినిమా ఇత్తివృత్తం. హీరో లూజర్ నుంచి విన్నర్ గా ఎలా మారాడు అనేది కాస్త ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు దయానంద్. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్న సస్పెన్స్‌ని చివరి వరకు బయటపడకుండా జాగ్రత్త పడుతూ కథనాన్ని ముందుకు నడిపే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ప్రయత్నంలో దర్శకుడు కొంత వరకు మాత్రమే సఫలం అయ్యాడు. కాన్సెప్ట్ కాస్త డిఫరెంట్‌గా ఉన్నా.. కథనంలో మాత్రం ఆ కొత్తదనం కనిపించలేదు. సినిమా మొత్తంలో తొమ్మిది టాస్క్‌లు ఉంటాయి. వాటిని మరింత బలంగా చూపిస్తే బాగుంటుంది. ఎంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా..తెరపై చూస్తే కొంచెం అయినా రియాలిటీకి దగ్గరగా ఉండాలి. గేమ్ ఆన్‌లో అది మిస్ అయింది. అయితే కొన్ని చోట్ల మాత్ర ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయింది. అలాగే యూత్‌ని ఆకట్టుకునే రొమాంటిక్ సన్నివేశాలు కూడా బాగానే ఉన్నాయి. ఓ క్రైమ్ సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథ పదేళ్లు ముందుకు జరుగుతుంది.ఓ లూజర్‌గా హీరోని పరిచయం చేయించాడు దర్శకుడు. ఉద్యోగం పోవడం.. స్నేహితుడు మోసం చేయడంతో హీరో క్యారెక్టర్‌పై జాలీ కలిగించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఒక్కసారి ఆన్లైన్ గేమ్ ప్రారంభం అవ్వగానే.. ప్రేక్షకులకు కూడా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఈజీ టాస్కులకు పెద్ద మొత్తంలో డబ్బులు రావడంతో..ఏదో జరగబోతుందనేది ప్రేక్షకుడికి తెలిసినా.. అది ఏంటనే క్యూరియాసిటీ మాత్రం చివరి వరకు ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. ఫన్నీ టాస్క్‌లు.. రొమాంటిక్ సన్నివేశాలతో ఫస్టాఫ్ సాఫీగా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది.హీరో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఎమోషనల్‌కు గురి చేస్తుంది. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. గేమ్‌లోని టాస్క్‌ని మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్ది ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఏది ఏమైనా..గేమ్ ఆన్ మాత్రం కాస్త డిఫరెంట్ మూవీ అనే చెప్పొచ్చు. ఎవరెలా చేశారంటే.. గౌతమ్ సిద్ధార్థ్ పాత్రలో గీతానంద్ ఒదిగిపోయాడు. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాలలోనూ చక్కగా నటించాడు. తారగా నేహా సొలంకి తెరపై కాస్త హాట్‌గా కనిపించింది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది.గీతానంద్, నేహ సొలంకిల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండింది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ మధుబాల డిఫరెంట్ పాత్ర పోషించి మెప్పించింది. ఫస్టాఫ్‌లో ఆమె పాత్రకు ఎలాంటి సన్నివేశాలు ఉండవు. సైకాలజిస్ట్ మదన్ మోహన్‌గా ఆదిత్య మీనన్ అదరగొట్టేశాడు. శుభలేఖ సుధాకర్ పాత్ర నిడివి తక్కువే అయినా.. ఉన్నంతలో చక్కగా నటించాడు. వాసంతి, కిరిటీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతికంగా ఈ సినిమా బాగుంది. అభిషేక్ ఏఆర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. నవాబ్ గ్యాంగ్, అశ్విన్ అరుణ్ పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని తెరపై రిచ్‌గా చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. -
పూరి జగన్నాథ్ స్ఫూర్తితో డైరెక్టర్ అయ్యా: దయానంద్
‘స్కూల్ డేస్ నుంచి సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండేది. హ్యాపీ డేస్ సినిమా చూశాక అది మరింత ఎక్కువైంది. ఏం మాయ చేసావే సినిమా చూశాక మేకింగ్ నాచురల్ గా చేయొచ్చు అనిపించింది. పూరి జగన్నాథ్ గారి స్ఫూర్తితో డైరెక్టర్ రావాలనుకున్నా. అన్నపూర్ణ ఫిలిం స్కూల్లో ఆరు నెలలుకోర్స్ చేశాను. కొంతమంది రైటర్స్ తో ట్రావెల్ చేశాక మంచి కథ రాయాలనిపించింది. అలా రాసిన కథే ‘గేమ్ ఆన్’. ఇదిరెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా.. అన్నీ ఉంటూనే డిఫరెంట్ గా ఉంటుంది’అని అన్నారు యంగ్ డైరెక్టర్ దయానంద్. ఆయన దర్శకత్వంలో గీతానంద్, నేహా సోలంకి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘గేమ్ ఆన్’. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు దయానంద్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► గేమ్ ఆన్ మూవీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మొదటి చిత్రంతోనే నా మార్క్ ఉండేలా ప్రయత్నించాను. చచ్చిపోదాం అనుకునే వ్యక్తి జీవితంలోకి ఒక గేమ్ ప్రవేశిస్తే అతని జీవితం ఎలా మారింది అనేది సినిమాటిక్ గా చూపించాం. ఒక్కొక్క టాస్క్ దాటుకుంటూ ముందుకు వెళ్తాడు. ఇలాంటి టాస్క్ లు తొమ్మిది ఉంటాయి. సెకండాఫ్ లో వచ్చే టాస్క్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక ట్రోమాలోకి వెళ్ళిపోయిన వ్యక్తికి ఈ గేమ్ ఏ విధంగా హెల్ప్ చేసిందనేది మెయిన్ కాన్సెప్ట్. ► ఈ మూవీ యూత్ ను ఎట్రాక్ట్ చేస్తూనే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా చాలా ఉంటాయి. వాటిని టీజర్, ట్రైలర్ లో రివీల్ చేయలేదు. మధుబాల గారి క్యారెక్టర్ చాలా కొత్తగా, ఐకానిక్ గా ఉంటుంది. ఆదిత్యామీనన్ గారిది చాలా స్మార్ట్ క్యారెక్టర్. ఇందులో సైకలాజికల్ డాక్టర్ గా ఆయన నటించారు. ఆయన యాక్టింగ్ లో చాలా షేడ్స్ కనిపిస్తాయి. శుభలేఖ సుధాకర్ గారు మరో ఇంపార్టెంట్ రోల్ చేశారు. వీరంతా సినిమాకు చాలా ప్లస్ అయ్యారు. ► నేహా సోలంకి పాత్ర చాలా మాసీగా ఉంటుంది. ఆమె క్యారెక్టర్ లో చాలా సర్ప్రైజ్లు ఉంటాయి. సెకండ్ హీరోలా ఆమె పాత్ర ఉంటుంది. నిర్మాత రవి కస్తూరి గారికి స్క్రిప్ట్ నచ్చి నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. క్రియేటివ్ పరంగా ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు. ► ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక మాలో కాన్ఫిడెంట్ పెరిగింది. దీంతో సెకండ్ షెడ్యూల్ నుంచి బడ్జెట్ పెంచి ఇంకా బాగా తీయాలనుకున్నాం. చాలా రియలిస్టిక్ గా సినిమా సాగుతుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. తక్కువ ధియేటర్లో విడుదలైనా నెమ్మదిగా థియేటర్లు పెరిగే అవకాశం ఉంటుందని నమ్మకం ఉంది. ఇప్పటికే వేసిన కొన్ని ప్రివ్యూ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ బోర్ కొట్టకుండా ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూడొచ్చు. -
సత్తుపల్లి మట్టా దయానంద్‌కి గట్టి దెబ్బ
సాక్షి, ఖమ్మం: సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్న మట్టా దయానంద్‌కి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. ఆయన ఎస్సీ కుల ధ్రువీకరణపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో.. నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ఏకంగా ఆయన పోటీ ఆశలకు గండిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మట్టా దయానంద్ ఎస్సీ కుల ధ్రువీకరణపై కొడారి వినాయక రావు అనే నేత అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తప్పుడు మార్గంలో మట్టాదయానంద్ ఎస్సీ కుల ధృవీకరణపత్రం పొంది, రాజ్యాంగ పదవుల కోసం పోటీపడ్డారు. ఎస్సీలకు దక్కాల్సిన రాజ్యాంగ హక్కును దయానంద్ పొందారని వినాయక రావు ఫిర్యాదు చేశారు. వినాయకరావు ఫిర్యాదుపై, వివిధ దశలలో అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, తహసీల్లార్ స్థాయి అధికారులతో సమగ్ర విచారణ జరిగింది. వినాయకరావు ఫిర్యాదుపై మట్టా దయానంద్ ను విచారణకు పిలిచి, ఆధారాలు సమర్పించిన వలసినది జిల్లా స్థాయి స్కృటినీ కమిటీ (District LeveL Scrutiny committee(DLSC) ఆదేశించింది కూడా. అయితే.. మట్టా దయానంద్ ఎస్పీ(మాల) కమ్యూనిటీ కులానికి చెందిన వ్యక్తిగా నిరూపించుకోవడంలో విఫలమయ్యారని సత్తుపల్లి తహసీల్దార్ నివేదిక రూపొందించారు. దీంతో.. ఎస్సీ కుల దృవీకరణ పొందుటకు, రిజర్వేషన్ హక్కు దక్కించుకొనుటకు అర్హుడుకాదంటూ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు మట్టా దయానంద్ ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తున్నట్టు జిల్లాలోని ఆయా శాఖ అధికారులకు సమాచారం పంపించారు కూడా. ఈ వ్యవహారంపై ముప్పై రోజుల్లోగా వివరణ ఇవ్వాలని దయానంద్‌కు నోటీసులు జారీ అయ్యాయి. ప్లాన్ బీ కూడా? 2014లో ఎస్సీ ధ్రువీకరణతో దయానంద్ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి.. 2,200 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆపై 2018లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) టిక్కెట్ అశించి భంగపాటుకు గురయ్యారు. అయితే మే నెలలో రేవంత్‌రెడ్డి సమక్షంలో భార్య రాగమయితో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం సత్తుపల్లి ఆశావహుల్లో ఆయన కూడా ఒకరు. కుల ధ్రువీకరణ అభ్యంతరాల నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ.. ధ్రువీకరణ పత్రం గనుక రద్దు అయితే.. తన భార్య రాగమయిని బరిలోకి దింపాలనే ఆలోచనతోనూ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సత్తుపల్లి నుంచి మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మానవతా రాయ్ ,కొండూరు సుధాకర్‌లు కూడా టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ తరపున టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న మొదటి వ్యక్తి మానవతారాయ్ కావడం గమనార్హం. -
మిత్రుడి పేరిట స్కూల్.. హ్యాపీ ఫ్రెండ్సిప్ డే..
కరీంనగర్: పట్టణంలోని పద్మనగర్‌కు చెందిన గోసికొండ దయానంద్ 2002లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన యాదిలో చిన్ననాటి మిత్రులు ఏదైనా చేయాలని నిర్ణయించున్నారు. గాజుల శ్రీనివాస్ సాఫ్ట్వేర్ ఇంజినీర్, యూఎస్ఏ సిరిసిల్ల పట్టణ శివారులో 22 గుంటల స్థలం కొనుగోలు చేసి, రూ.30 లక్షలతో 2006లో దయానంద్ మెమోరియల్ స్కూల్ స్థాపించారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉచితంగా ఆంగ్ల మాధ్యమంలో విద్యనందిస్తున్నారు. రాజీవ్‌నగర్ కార్మిక క్షేత్రంలోని పేదవాళ్లు తమ పిల్లలను ఇక్కడికి పంపిస్తున్నారు. ప్రస్తుతం 65 మంది విద్యార్థులు ఉన్నారు. స్కూల్ నిర్వహణకు ఏటా రూ.5 లక్షలు ఖర్చవుతోంది. ఇందులో ఎక్కువ మొత్తాన్ని శ్రీనివాస్ భరిస్తున్నారు. బోడ రవీందర్, సిరిసిల్ల తిరుపతి, కట్కం గోపి, పయ్యావుల శ్రీనివాస్, బి.రాము, బొడ్డు శ్రీధర్, లింగమూర్తి, సిరిసిల్ల తిరుమలేశ్, వూరడి రవి, కోడం సుధాకర్ పాఠశాల నిర్వహణలో భాగస్వాములవుతూ స్నేహానికి నిజమైన నిర్వచనంగా నిలుస్తున్నారు. -
సైకలాజికల్, రొమాంటిక్ డ్రామాగా 'గేమ్ ఆన్'..
Game On Movie Launch By Director Praveen Sattaru: సైకలాజికల్, రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం 'గేమ్ ఆన్'. గీతానంద్, నేహా సోలంకి, వసంతి, కిరిటీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరోహీరోయిన్లు గీతానంద్, నేహా సోలంకిలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మూవీ డైరెక్టర్ దయానంద్ మాట్లాడుతూ '2020 నుంచి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాం. ప్రేక్షకులకు నెక్స్ట్ లెవల్ ఫీల్ అయ్యేలా స్క్రిప్ట్ రెడీ చేశాం. సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు ఎదో ఒక ఎమోషన్ సీన్ లో కచ్చితంగా కనెక్ట్ అవుతాడు. ఇలాంటి మంచి సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు.' అని తెలిపారు. 'ఈ 'గేమ్ ఆన్' చిత్రం సైకాలజికల్ యాక్షన్ డ్రామా. ఈ సినిమాలో చాలా డీప్ ఎమోషనల్ లేయర్స్ ఉంటాయి. ఇందులో ట్విస్ట్‌లు చాలా ఉంటాయి. ఈ సినిమా స్క్రిప్ట్ కోసం దర్శకుడు దయానంద్ చాలా కష్టపడ్డారు. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా 2022లో బెస్ట్ సినిమా అవుతుంది. అని హీరో గీతానంద్ పేర్కొన్నారు. లూజర్‌గా ఉన్న యువకుడు విన్నర్ ఎలా అయ్యాడనే కథాంశంతో రూపొందించామని నిర్మాతలు వెల్లడించారు. చదవండి: ఆ వెబ్ సిరీస్ చూసి గర్ల్‌ఫ్రెండ్‌పై హృతిక్ రోషన్ వ్యాఖ్యలు.. చదవండి: నేరుగా ఓటీటీలోకి కీర్తి సురేష్ సినిమా.. ఎప్పుడు ? ఎక్కడంటే ? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ముగ్గురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త సభ్యుల చేత శాసనమండలి చైర్మన్ బుధవారం ప్రమాణస్వీకారం చేయించారు. దివంగత నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్ పదవీ కాలపరిమితి ముగియడంతో ఈ ఏడాది ఆగస్టు నాటికే శాసనమండలిలో గవర్నర్ కోటా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కర్నె ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న, దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణిదేవి, టి.రవీందర్రావు తదితరుల పేర్లు వినిపించగా.. సీఎం నిర్ణయం మేరకు వీరి పేర్లును ఖరారు చేశారు. (చదవండి: పెద్దల సభకు ఉద్యమ పాట) -
న్యూ ఏజ్ లవ్
శ్రీ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘బాయ్స్’. దయానంద్ దర్శకుడు. నేహా శర్మ నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గీతానంద్, శ్రీహాన్, రోనిత్‌రెడ్డి, సుజిత్, అన్షులా, జెన్నీఫర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 4న రెగ్యులర్ షూటింగ్ ఆరంభం అవుతుంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దామోదర ప్రసాద్ కాప్ ఇచ్చి, దర్శకునికి స్క్రిప్ట్‌ని అందించారు. ‘రథం’ నిర్మాత రాజా కెమెరా స్విచాన్ చేశారు. నటి, నిర్మాత సుప్రియ, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా కూడా అతిథులుగా పాల్గొన్నారు. దయానంద్ మాట్లాడుతూ– ‘‘దర్శకునిగా ‘బాయ్స్’ నా తొలి చిత్రం. న్యూ ఏజ్ లవ్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. కథ నచ్చి. నిర్మాతలు సినిమా చేయటానికి ఒప్పుకున్నారు. మంచి టీమ్ కుదిరింది’’ అన్నారు. నేహా శర్మ మాట్లాడుతూ– ‘‘సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమాను పూర్తి చేస్తాం. టాకీ అంతా హైదరాబాద్‌లో చిత్రీకరించి, పాటలకు గోవా వెళతాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్, కెమెరా: వెంకట్ ప్రసాద్, కో–ప్రొడ్యూసర్: బాలచంద్ర. -
లవ్ ఎంటర్టైనర్గా ‘#బాయ్స్’
శ్రీపిక్చర్స్ బ్యానర్‌పై నేహాశర్మ నిర్మాతగా కొత్త చిత్రం ‘#బాయ్స్’ ఈరోజు ప్రారంభమైంది. ‘రథం’ ఫేమ్ గీతానంద్, శ్రీహాన్, రోనిత్ రెడ్డి, సుజిత్, అన్షులా, జెన్నీఫర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ స్వరూప్, మేల్కొటి, ఉత్తేజ్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. దయానంద్ దర్శకుడు. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి కె.ఎల్.దామోదర్ ప్రసాద్ క్లాప్ కొట్టి, డైరెక్టర్‌కి స్క్రిప్ట్‌ను అందించారు. ‘రథం’ డైరెక్టర్ రాజా కెమెరా స్విచ్ఛాన్ చేశారు. సుప్రియ, నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా పూజా కార్యక్రమాల్లో పాల్గొని యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా... దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ - ‘ఇది దర్శకుడిగా నా తొలిచిత్రం. న్యూ ఏజ్ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్. మంచి టీమ్ కుదిరింది. కథ నచ్చగానే నిర్మాతలు వెంటనే సినిమాను చేయడానికి అంగీకరించారు. వారికి నా థ్యాంక్స్’ అన్నారు. నిర్మాత నేహాశర్మ మాట్లాడుతూ ‘న్యూ ఏజ్ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా మా బాయ్స్ సినిమాను రూపొందిస్తున్నాం. సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేస్తాం. టాకీ పార్ట్ అంతా హైదరాబాద్‌లో ఉంటుంది. గోవాలో పాటలను చిత్రీకరిస్తాం. సెప్టెంబర్ 4 నుండి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం’ అన్నారు. -
అందరిని వదిలిపెట్టి.. ఆత్మహత్య చేసుకొని
సాక్షి, జగిత్యాల : పట్టుమని పాతికేళ్లుకూడా లేవు. కుటుంబ బాధ్యతలను తలపై వేసుకున్నాడు. సంపాదన కోసం పరాయి దేశం వెళ్లాడు. ఏమైందో తెలీదు ఉన్నట్టుండి బలవన్మరాణానికి పాల్పడ్డాడు.. వివరాల్లోకి వెళ్తే.. కథలాపూర్‌కు మండలం గంభీర్పూర్ గ్రామానికి చెందిన సంకు దయానంద్ అనే యువకుడు దుబాయ్‌లో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు దుబాయ్‌లో ఫోటో గ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు నెలల క్రితమే స్వగ్రమానికి వచ్చి తిరిగి దుబాయ్ వెళ్లిపోయాడు. ఏమైందో ఏమో ఆదివారం తన రూమ్‌లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా తండ్రి సైతం ఉపాధి కోసం దుబాయ్లేనే ఉంటున్నాడు. ఈమేరకు దయానంద్ మృతిపై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఒత్తిడి, ఇంటిపై దిగులు కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. -
ఎలక్టరోల్‌కు ఒకే డాటాబేస్
కొత్త అంశాలపై సిబ్బందికి శిక్షణ సంగారెడ్డి జోన్: దేశ వ్యాప్తంగా ఎలక్టరోల్‌కు సంబంధించి ఒకే డేటాబేస్ తయారు చేసేందకు భారత ఎన్నికల సంఘం ఒక కొత్త సర్వర్‌ను అందుబాటులోకి తెచ్చిందని జిల్లా రెవెన్యూ అధికారి దయానంద్ అన్నారు. గురువారం ఆయన కలెక్టరేట్లో జాతీయ ఎలక్టరోల్ ప్యూరిఫికేషన్-2016పై ఒక రోజు జిల్లాస్థాయి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఒకే డేటాబేస్ ఉండటం వలన ఓటర్లకు మరిన్ని వివరాలు అందుబాటులోకి రావడంతో పాటు కుటుంబంలోని ఓటర్లు ఇకపై ఒకే పోలింగ్ స్టేషన్లో ఓటు వేసే అవకాశం కలుగుతుందున్నారు. ఇప్పటికే కొందరు రాష్ట్రస్థాయిలో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చామని, వారిచే జిల్లాస్థాయిలో అధికారులకు తిరిగి శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఇక నుంచి ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్ లోకేషన్ గురించి వాకబు చేయాల్సిన అవసరం ఉండదని, ఈ పోర్టల్ అందుబాటులోకి వస్తే ఓటరు తమ పోలింగ్‌స్టేషన్ లోకేషన్‌ను గుర్తించడంతోపాటు పోలింగ్ కేంద్రానికి వెళ్లాల్సిన రూట్ మ్యాప్కూడా తెలుస్తుందన్నారు. పోలింగ్ స్టేషన్లో మొత్తం ఓటర్ల సంఖ్య, అందుబాటులో ఉన్న వసతులను కూడా తెలుసుకోవచ్చన్నారు. జిల్లా ఎన్ఐసీ అధికారి శాంతకుమార్ శిక్షణ కార్యక్రమంలో జిల్లాకు సంబంధించిన ఎలక్టరోల్ డేటాను సీఇవో సర్వర్‌కు ఎలా అప్లోడ్ చేయాలో అధికారులకు వివరించారు. గతంలో ఎలక్టరోల్ రోల్డేటాలో తప్పొప్పులు, మార్పులు చేర్పులు అంతా జిల్లాస్థాయిలోనే చేసేవారమని, ఇప్పడు ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిన ఈఆర్‌ఎంఎస్ పోర్టల్‌లోకి వెళ్లి మార్పులు చేర్పులు చేయవలసి ఉంటుందన్నారు. దేశ వ్యాప్తంగా ఒకే డేటాబేస్ ఉండటం వల్ల డేటాను మానిటర్ చేయడం సులభతరమవుతుందన్నారు. ఈ విధానం అందుబాటులోకి వస్తే డూప్లికేటు ఓటర్లను తొలగించవచ్చన్నారు. ఓటర్లు తమతమ ఎపిక్ ఐడీని కంప్యూటర్లో నమోదు చేసిన వెంటనే అన్ని వివరాలు తెలుస్తాయన్నారు. జనవరి1,2017నాటికి ఓటు వేసేందుకు అర్హత గల వారి పేర్లతో కూడిన డ్రాప్ట్ ఓటర్ లిస్టులను సెప్టెంబర్ 15న అందుబాటులో ఉంచుతామన్నారు. శిక్షణా కార్యక్రమంలో సర్వశిక్షాఅభియాన్ పీవో యాస్మిన్ బాషా, జిల్లాలోని ఈఆర్వోలు, డిప్యూటీ ఈఆర్ఓలు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్లు, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు. -
మందకృష్ణమాదిగ అగ్రకులాలకు తొత్తు:దయానంద్
హిమాయత్‌నగర్: వ్యక్తిగత ప్రయోజనాల కోసమే మందకృష్ణమాదిగ ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులను అయోమయానికి గురిచేస్తున్నారని మాలమహాసభ రాష్ట్ర అధ్యక్షుడు దయానంద్ అన్నారు. అగ్రకులాలకు తొత్తుగా మారిన సాంఘిక ద్రోహిగా అభివర్ణించారు. బుధవారం హిమాయత్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ తన స్వీయ ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకే వర్గీకరణ పేరుతో దళితులను బజారు కీడుస్తున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణపై ఢిల్లీలో పోరు జరుగతుంన్నా మాల ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోడం దారుణమన్నారు. ఈ నెల 10,11 తేదీల్లో ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద వర్గీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన మాలల ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సురేష్, శివకుమార్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
31న ట్రాన్స్పోర్ట్, కానిస్టేబుల్ పరీక్షలు
జిల్లా రెవెన్యూ అధికారి దయానంద్ సంగారెడ్డి జోన్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జిల్లాలో ఈనెల 31వ తేదిన నిర్వహించనున్న ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ నియామకాల రాత పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి దయానంద్ తెలిపారు. కలెక్టరెట్లో శుక్రవారం రాత పరీక్ష నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 31న ఉదయం 10 నుంచి 12.30 వరకు పరీక్ష జరుగుతుందన్నారు. సంగారెడ్డి, పటాన్చెరువు, రాంచంద్రపురంలో మొత్తం 34 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటుచేశామన్నారు. మొత్తం 14,609 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని, ఆ రోజు ఆర్టీసీ అదనపు బస్సులు నడుపుతుందని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా, మంచినీరు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. అభ్యర్థులు హాల్‌టిక్కెట్‌తో పాటు ఏదైన గుర్తింపుకార్డును విధిగా తెచ్చుకోవాలన్నారు. ఎలక్ర్టానిక్ పరికరాలు వెంట తీసుకురావొద్దని సూచించారు. అదేవిధంగా పరీక్షలకు హాజరయ్యేవారు షూష్, జువెల్లరీ, ష్రగ్స్ ధరించకూడదన్నారు. పోలీసు బందోబస్తుతో పాటు ఇప్పటికే ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. సమావేశంలో సంగారెడ్డి ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టరెట్ పరిపాలనా అధికారి మహిపాల్‌రెడ్డి తదితరులున్నారు. -
ఎన్నికల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్: ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తూ ఫిర్యాదుల స్వీకరణ కేంద్రాలకు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. సాధారణ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులు, పోలీసు అధికారులతో మంగళవారం ఆమె కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సమావేశానికి ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, జేసీ శరత్, ఏజేసీ మూర్తి, డీఆర్వో దయానంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేసే విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాలో 2407 పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను ఈనెల 16లోగా పూర్తి చేసి నివేదికను ఎలక్షన్ వెబ్సైట్లో నిక్షిప్తం చేయాలన్నారు. ఈ సారి ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌లో ‘పైన పేర్కొన్న వారు ఎవరూ కాదు’ అనే ఆప్షన్‌ను పొందుపర్చిందని, ఈ ఆప్షన్‌ను ప్రతి రిటర్నింగ్ అధికారి కార్యాలయాల వద్ద బ్యానర్ల ద్వారా ప్రదర్శించి ప్రచారం చేయాలన్నారు. పోలింగ్ కేంద్రానికి రెండు కిలోమీటర్లు దూరం ఉంటే అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఈనెల 16లోగా ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. ఎన్నికల విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఏ విధమైన కారణం లేకుండా ఎన్నికల విధులకు గైర్హాజరైన ఉద్యోగులపై ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి చర్యలు చేపట్టాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి, వ్యయ పరిశీలకులు 40 మంది ఎన్నికల సంఘం నుంచి జిల్లాకు వచ్చే అవకాశం ఉందని, జిల్లాలోని విశ్రాంతి గృహాలన్నింటినీ సంబంధిత రిటర్నింగ్ అధికారులు స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి అంశంపై ఎన్నికల సంఘం లిఖిత పూర్వక నిబంధనలు జారీ చేసిందని, ఏ అధికారి కూడా తమ సొంత విధానాలతో ఎన్నికల ప్రక్రియ చేపట్టవద్దని సూచించారు. శాసన సభా నియోజకవర్గాల వారీగా జోన్ రూట్‌మ్యాప్‌లను, పోలింగ్ కేంద్రాల టెలిఫోన్ నంబర్‌ఏర్పాటు, సంబంధిత అధికారి వివరాలను, రిటర్నింగ్ అధికారి కార్యాలయం, అధికారి చాంబర్ వివరాలు, రిసెప్షన్ సెంటర్, పంపిణీ కేంద్రం, టెంపరరీ స్ట్రాంగ్ రూమ్‌ల వివరాలను ఈనెల 20లోగా తయారు చేసి సమర్పించాలన్నారు. ప్రతిపోలింగ్ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్‌పై ట్రయల్ రన్, వెబ్‌కాస్టింగ్ మైక్రో అబ్జర్వర్ వీడియో గ్రఫీని ఈనెల 20లోగా తయారు చేసి సమర్పించాలని సూచించారు. ప్రతి శాసన సభా నియోజకవర్గం వారీగా ఈనెల 13లోగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలోని సమస్యాత్మక, సున్నిత, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పోలింగ్ కేంద్రాలను గుర్తించి నివేదిక సమర్పించాలని జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్ సూచించారు. పోలీసులు, అధికారులు సమన్వయంతో సమస్యాత్మక, సున్నిత పోలింగ్ కేంద్రాలను గుర్తించాలన్నారు. జిల్లాలో ఆయుధాల లెసైన్సులు, కొత్త ఆయుధాలకు లెసైన్సులు రెన్యువల్ చేయవద్దని సూచించారు. -
మాజీ మంత్రి శంకర్రావు మౌనదీక్ష
హైదరాబాద్: మాజీ మంత్రి శంకర్రావు మౌనదీక్ష చేపట్టారు. తన తమ్ముడు దయానంద్ అరెస్టును నిరసిస్తూ శంకర్రావు మౌనదీక్షకు దిగారు. భూకబ్జా, నకిలీ డాక్యుమెంట్ సృష్టించటం,చీటింగ్ కేసుల్లో మాజీమంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు తమ్ముడు దయానంద్‌ను ముషీరాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి నాంపల్లికోర్టులో హాజరపర్చారు. దీనిని నిరసిస్తూ శంకర్రావు మంగళవారం మౌనదీక్షకు పూనుకున్నారు. సీమాంధ్రలో ఇందిర, రాజీ వ్ విగ్రహాల ధ్వంసం చేస్తున్న ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని శంకర్రావు తెలిపారు. ఆ ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు ఎవర్నీ అరెస్ట్ చేయకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నన్ను, నా కుటుంబసభ్యులను సీఎం, డీజీ పీ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తమ్ముడు, చెల్లెల్ని అక్రమంగా అరెస్టు చేశారని ఆయన పేర్కొన్నారు. గతంలో తన ఇంటిపై దాడి విషయంలో సభాహక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. డీజీ పీ ఆస్తులు, సీఎం ఎర్రచందనం కేసులో సీబీఐ విచారణ చేయించాలన్నారు. తనపై సీబీఐ విచారణ కూడా సిద్ధంగా ఉన్నట్లు శంకర్రావు తెలిపారు. -
శంకర్రావు తమ్ముడు అరెస్టు
ముషీరాబాద్,న్యూస్‌లైన్: భూకబ్జా, నకిలీ డాక్యుమెంట్ సృష్టించటం,చీటింగ్ కేసుల్లో మాజీమంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు తమ్ముడు దయానంద్‌ను ముషీరాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి నాంపల్లికోర్టులో హాజరపర్చారు. కోర్టు ఈనెల 29 వరకు రిమాండ్ విధించింది. సీఐ శ్యాంసుందర్, బాధితుల వివరాల ప్రకారం..రాంనగర్ జెమినీకాలనీలోని పోచమ్మ ఆలయం సమీపంలో రాధ అనే మహిళ 166 గజాల స్థలాన్ని శంకర్రావు తమ్ముడు దయానంద్‌కు గోదాం కోసం నెలకు రూ.800 చొప్పున పదేళ్లక్రితం అద్దెకిచ్చింది. తన కూతురు పెళ్లి నిమిత్తం ఈ స్థలాన్ని అమ్ముతున్నామని, వెంటనే ఖాళీ చేయాలని దయానంద్‌ను కోరగా ఆరునెలల సమయం అడిగాడు. ఆ తర్వాత ఖాళీ చేశారు. అనంతరం రాధ, అరుణ అనే మరో మహిళకు విక్రయించింది. ఈ సమయంలో రాత్రికిరాత్రి దయానంద్ తాళాలు పగులగొట్టి స్థల యజమానురాలును అట్రాసిటీ కేసు పెడ్తానని బెదిరించి స్థలాన్ని ఆక్రమించాడు. అంతేకాకుండా తనకు రూ.5 లక్షలివ్వాలని బెదిరించి కోర్టులో సివిల్ కేసును రాధ,ఆమె అన్న జనార్దన్‌రెడ్డిల మీద దాఖలు చేశారు. ఇంతటితో ఆగకుండా నకిలీ డాక్యుమెంట్‌ను సృష్టించారు. మొత్తం ఈ వ్యవహారంపై రాధ,ఆమె అన్న జనార్దన్‌రెడ్డిలు సివిల్ కేసుతో పాటు క్రిమినల్ కేసును నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు దయానంద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. -
మాజీమంత్రి శంకర్రావు సోదరుడు అరెస్ట్
హైదరాబాద్ : మాజీమంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు సోదరుడు దయానంద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. భూకబ్జా కేసులో ఆయనను ముషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామ్‌నగర్‌లోని జెమినీకాలనీలో దయానంద్ భూకబ్జాకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా గ్రీన్‌ఫీల్డ్ భూకబ్జా వ్యవహరానికి సంబంధించి శంకర్రావుతో పాటు దయానంద్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఆల్వాల్ మండలంలోని కానాజీగూడాలో గ్రీన్‌ఫీల్డ్ హౌసింగ్ సొసైటీలో మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు, ఆయన సోదరుడు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి దాదాపు 75 ఎకరాల భూమిని కబ్జాచేసేందుకు యత్నించారంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై హై కోర్టులో దాఖలైన కేసును విచారించిన అనంతరం శంకర్రావు, ఆయన సోదరుడు దయానంద్‌తో పాటు మరికొంతమందిపై కేసులు నమోదు చేయా ల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఆమేరకు గత ఏడాది లో సైబరాబాద్ పరిధిలోని నేరేడ్మెట్ పోలీసులు శంకర్రావు, ఆయన సోదరుడు,మరికొంతమందిపై సెక్షన్ 120బి,420,367,468,506 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దీనిని సవాల్ చేస్తూ శంకర్రావు సోదరుడు కోర్టుకు వెళ్లడంతో కేసు విచారణపై స్టే విధించింది.