
Game On Movie Launch By Director Praveen Sattaru: సైకలాజికల్, రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం 'గేమ్ ఆన్'. గీతానంద్, నేహా సోలంకి, వసంతి, కిరిటీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరోహీరోయిన్లు గీతానంద్, నేహా సోలంకిలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
మూవీ డైరెక్టర్ దయానంద్ మాట్లాడుతూ '2020 నుంచి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాం. ప్రేక్షకులకు నెక్స్ట్ లెవల్ ఫీల్ అయ్యేలా స్క్రిప్ట్ రెడీ చేశాం. సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు ఎదో ఒక ఎమోషన్ సీన్ లో కచ్చితంగా కనెక్ట్ అవుతాడు. ఇలాంటి మంచి సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు.' అని తెలిపారు. 'ఈ 'గేమ్ ఆన్' చిత్రం సైకాలజికల్ యాక్షన్ డ్రామా. ఈ సినిమాలో చాలా డీప్ ఎమోషనల్ లేయర్స్ ఉంటాయి. ఇందులో ట్విస్ట్‌లు చాలా ఉంటాయి. ఈ సినిమా స్క్రిప్ట్ కోసం దర్శకుడు దయానంద్ చాలా కష్టపడ్డారు. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా 2022లో బెస్ట్ సినిమా అవుతుంది. అని హీరో గీతానంద్ పేర్కొన్నారు. లూజర్‌గా ఉన్న యువకుడు విన్నర్ ఎలా అయ్యాడనే కథాంశంతో రూపొందించామని నిర్మాతలు వెల్లడించారు.
చదవండి: ఆ వెబ్ సిరీస్ చూసి గర్ల్‌ఫ్రెండ్‌పై హృతిక్ రోషన్ వ్యాఖ్యలు..
చదవండి: నేరుగా ఓటీటీలోకి కీర్తి సురేష్ సినిమా.. ఎప్పుడు ? ఎక్కడంటే ?
Comments
Please login to add a commentAdd a comment