
సాక్షి, జగిత్యాల : పట్టుమని పాతికేళ్లుకూడా లేవు. కుటుంబ బాధ్యతలను తలపై వేసుకున్నాడు. సంపాదన కోసం పరాయి దేశం వెళ్లాడు. ఏమైందో తెలీదు ఉన్నట్టుండి బలవన్మరాణానికి పాల్పడ్డాడు.. వివరాల్లోకి వెళ్తే.. కథలాపూర్‌కు మండలం గంభీర్‌పూర్ గ్రామానికి చెందిన సంకు దయానంద్ అనే యువకుడు దుబాయ్‌లో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు దుబాయ్‌లో ఫోటో గ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.
నాలుగు నెలల క్రితమే స్వగ్రమానికి వచ్చి తిరిగి దుబాయ్ వెళ్లిపోయాడు. ఏమైందో ఏమో ఆదివారం తన రూమ్‌లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా తండ్రి సైతం ఉపాధి కోసం దుబాయ్‌లేనే ఉంటున్నాడు. ఈమేరకు దయానంద్ మృతిపై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఒత్తిడి, ఇంటిపై దిగులు కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment