మిత్ర, సుప్రియ, దామోదర ప్రసాద్, దయానంద్
శ్రీ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘బాయ్స్’. దయానంద్ దర్శకుడు. నేహా శర్మ నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గీతానంద్, శ్రీహాన్, రోనిత్‌రెడ్డి, సుజిత్, అన్షులా, జెన్నీఫర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 4న రెగ్యులర్ షూటింగ్ ఆరంభం అవుతుంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దామోదర ప్రసాద్ కాప్ ఇచ్చి, దర్శకునికి స్క్రిప్ట్‌ని అందించారు. ‘రథం’ నిర్మాత రాజా కెమెరా స్విచాన్ చేశారు. నటి, నిర్మాత సుప్రియ, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా కూడా అతిథులుగా పాల్గొన్నారు.
దయానంద్ మాట్లాడుతూ– ‘‘దర్శకునిగా ‘బాయ్స్’ నా తొలి చిత్రం. న్యూ ఏజ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. కథ నచ్చి. నిర్మాతలు సినిమా చేయటానికి ఒప్పుకున్నారు. మంచి టీమ్ కుదిరింది’’ అన్నారు. నేహా శర్మ మాట్లాడుతూ– ‘‘సింగిల్ షెడ్యూల్‌లో ఈ సినిమాను పూర్తి చేస్తాం. టాకీ అంతా హైదరాబాద్‌లో చిత్రీకరించి, పాటలకు గోవా వెళతాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్, కెమెరా: వెంకట్ ప్రసాద్, కో–ప్రొడ్యూసర్: బాలచంద్ర.
Comments
Please login to add a commentAdd a comment