సాక్షి, న్యూఢిల్లీ: అవినీతి నిరోధక చట్టం ప్రకారం సెక్షన్ 19(3) ప్రకారం హైకోర్టుకు స్టే ఇచ్చే అధికారం లేదని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్ర పోలీసులపై కోర్టుకు నమ్మకం లేకపోతే సీబీఐకి అప్పగించవచ్చని సూచించారు. అమరావతి భూ కుంభకోణం విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే చేయవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, చంద్రబాబు చేసిన అవినీతి పై దర్యాప్తు చేసి ఆ నిధిని ప్రభుత్వ ఖజానాకు జమ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలు కాపాడట కోసం తమ ప్రభుత్వం ఇలా చేస్తుందన్నారు. (ప్రగల్భాలు పలికి ‘స్టే’ తెచ్చుకుంటారా?)
చదవండి: హైకోర్టు ఉత్తర్వులు: కేంద్రం జోక్యం చేసుకోవాలి
రాజధాని భూముల స్కాంపై కోర్టు స్టే ఇవ్వడం దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. కేసును సీబీఐ విచారణకు ఇవ్వాలని కోరారు. సైబర్ నెట్ స్కాంపై సీబీఐ విచారణ జరపాలన్నారు. అదే విధంగా చిన్న చిన్న కేసులను సీబీఐ విచారణకు ఇస్తున్నారని, మంత్రివర్గ ఉపసంఘం విచారించి సిట్‌ను ఏర్పాటు చేస్తే దానిపై స్టే ఇచ్చారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అన్నారు. మీడియాపై ఆంక్షలు విధిస్తూ ఆర్డర్ ఇచ్చారని, అమరావతి భూముల స్కాంను సీబీఐ విచారణకు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. (కోర్టులు ఎవరి ప్రయోజనాల కోసం?)
Comments
Please login to add a commentAdd a comment