srikrishna devaraylu
-
ఇస్రో సేవలు అద్భుతం
సాక్షి, న్యూఢిల్లీ: శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇస్రో అద్భుతమైన సేవలందిస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మార్గాని భరత్‌రామ్ కొనియాడారు. అంతరిక్ష రంగంలో మహిళల ప్రమేయం పెరిగేలా ప్రోత్సహించాల ని కేంద్రాన్ని కోరారు. లోక్‌సభలో గురువారం చంద్రయాన్–3 విజయంపై జరిగిన చర్చలో ఎంపీలు ఇరువురూ మాట్లాడారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. ఇంతటి గొప్ప పరిశోధనలు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి జరగటం తెలుగువారికి గర్వకారణమన్నారు. చంద్రయాన్ ప్రయోగంలో భాగస్వాములైన మెజారిటీ శాస్త్రవేత్తలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలల నుంచి రావ డం గొప్ప విషయమని చెప్పారు. యూనివర్సిటీలకు రాష్ట్రీయ య ఉచ్చతర్ శిక్షా అభియాన్(రూసా)కింద గత నాలుగైదు సంవత్సరాలుగా ఏటా రూ.8,120 కోట్ల నిధులు కేటాయిస్తున్నా వినియోగం 60 శాతం కూడా ఉండటంలేదని వివరించారు. వర్సిటీలు ఈ నిధులు వాడుకునేలా వెసులుబాటు కల్పించాల్సి ఉందన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని మెరుగుపరచాల్సిఉందని సూచించారు. ఎంపీ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ.. అంతరిక్ష రంగంలో మన శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడా రు. దేశమంతా చంద్రయాన్–3 విజయాన్ని కొనియాడుతుంటే టీడీపీ మాత్రం మాజీ సీఎం చంద్రబాబు గురించి మాట్లాడుతోందని ఎద్దే వా చేశారు. రూ.3,300 కోట్ల కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్టయ్యారన్నారు. చంద్రబాబు చేసిన ఇతర కుంభకోణాలు సైతం త్వరలో బయటపడతాయన్నారు. చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ల్యాండయినప్పుడు తన ఆరేళ్ల కుమార్తె ‘నాన్నా చంద్రుడి మీద అడుగుపెట్టాం’ అంటూ ఎంతో సంబరపడిందని, ‘మనం ఎప్పుడు చంద్రుడి మీద కు వెళ్తాం అమ్మా?’ అని తన తల్లిని అడగడం తనని ఎంతో సంతోషానికి గురిచేసిందన్నారు. చంద్రయాన్–3 విజయంపై ఇస్రో బృందం, ప్రధాని నరేంద్రమోదీకి భరత్ కృతజ్ఞతలు తెలిపారు. -
‘కేసును సీబీఐ విచారణకు అప్పజెప్పాలి’
సాక్షి, న్యూఢిల్లీ: అవినీతి నిరోధక చట్టం ప్రకారం సెక్షన్ 19(3) ప్రకారం హైకోర్టుకు స్టే ఇచ్చే అధికారం లేదని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్ర పోలీసులపై కోర్టుకు నమ్మకం లేకపోతే సీబీఐకి అప్పగించవచ్చని సూచించారు. అమరావతి భూ కుంభకోణం విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే చేయవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, చంద్రబాబు చేసిన అవినీతి పై దర్యాప్తు చేసి ఆ నిధిని ప్రభుత్వ ఖజానాకు జమ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలు కాపాడట కోసం తమ ప్రభుత్వం ఇలా చేస్తుందన్నారు. (ప్రగల్భాలు పలికి ‘స్టే’ తెచ్చుకుంటారా?) చదవండి: హైకోర్టు ఉత్తర్వులు: కేంద్రం జోక్యం చేసుకోవాలి రాజధాని భూముల స్కాంపై కోర్టు స్టే ఇవ్వడం దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. కేసును సీబీఐ విచారణకు ఇవ్వాలని కోరారు. సైబర్ నెట్ స్కాంపై సీబీఐ విచారణ జరపాలన్నారు. అదే విధంగా చిన్న చిన్న కేసులను సీబీఐ విచారణకు ఇస్తున్నారని, మంత్రివర్గ ఉపసంఘం విచారించి సిట్‌ను ఏర్పాటు చేస్తే దానిపై స్టే ఇచ్చారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అన్నారు. మీడియాపై ఆంక్షలు విధిస్తూ ఆర్డర్ ఇచ్చారని, అమరావతి భూముల స్కాంను సీబీఐ విచారణకు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. (కోర్టులు ఎవరి ప్రయోజనాల కోసం?) -
పల్నాడు సమగ్రాభివృద్ధికి కృషి
సాక్షి, గుంటూరు : దశాబ్దాలుగా అన్ని రంగాల్లో వెనుకబడిన పల్నాడు ప్రాంత సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులైన లావు శ్రీకృష్ణ దేవరాయలుకు సోమవారం నగరంపాలెంలోని కేకేఆర్ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సత్కారం చేశారు. ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన సత్కార సభలో శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల సమయంలో గ్రామాలకు వెళ్లినప్పుడు ప్రజలను పట్టిపీడిస్తున్న సమస్యలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసినట్లు చెప్పారు. విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు, వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణం, పారిశ్రామిక ప్రగతి ప్రధాన అంశాలుగా చేసుకుని పార్లమెంటు సభ్యుడిగా పల్నాడు ప్రాంత స్వరూపం మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నట్లు వివరించారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య, ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు ప్రసంగించారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయలును శాలువాతో సత్కరించి జ్ఞాపిక బహూకరించారు. ఈ సందర్భంగా విశ్రాంత డీవైఈవో పి.వి.శేషుబాబు, ఏఎన్‌యూ ప్రొఫెసర్లు ఆచార్య ఇ.శ్రీనివాసరెడ్డి, సరస్వతి రాజు అయ్యర్‌తో పాటు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు. -
ప్రతిపాదనల చిట్టా.. రైలెక్కాలి పట్టా
రాష్ట్రానికి కేంద్రం కొత్త రైల్వే జోన్ ప్రకటించిన నేపథ్యంలో రైల్వే పరంగా ఉన్న పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కృష్ణా, గుంటూరు జిల్లాల ఎంపీలు రైల్వే జీఎం గజానన్ మాల్యాకు విన్నవించారు. తమ నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల వివరాలు, వాటిని పూర్తి చేసేందుకు కేటాయించాల్సిన నిధులు.. ఇతరత్రా సమస్యలు ప్రస్తావిస్తూ ప్రతిపాదనలు సమర్పించారు. పలు ప్రాంతాలకు కావాల్సిన కొత్త రైళ్లు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన.. రైల్వేల పరంగా ప్రజలు ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులను జీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సిందిగా కోరారు. సాక్షి, విజయవాడ: రైల్వే శాఖకు సంబంధించి రాష్ట్రంలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారం సహా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, తదితర అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా విజయవాడలో సమావేశమయ్యారు. స్థానిక సత్యనారాయణపురంలోని ఈటీటీఎస్లో నిర్వహించిన సమావేశంలో రెండు జిల్లాలకు చెందిన ఎంపీలతో పాటు విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే అధికారులు పాల్గొన్నారు. కాగా విజయవాడ నుంచి కొత్త రైళ్లు, కొత్త రైల్వే లైన్ల కోసం అనేక వినతిపత్రాలు ఇచ్చినా అధికారులు స్పందించనందుకు సమావేశం నుంచి ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) బాయ్‌కాట్ చేశారు. అంతకుముందు ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌తో కలిసి పలు సమస్యలపై విజ్ఞాపన పత్రం అందజేశారు. విజయవాడ–మేళ్ల చెరువు రైల్వేలైను, విజయవాడ–భద్రాచలం రైల్వేలైనుకు అవసరమైన ఆర్ఓబీ వెంటనే మంజూరు చేయాలని.. బెంగళూరు, ముంబై, వేలాంగణి ప్రాంతాలకు కొత్త రైళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. మోడల్ స్టేషన్‌గా బందరును తీర్చిదిద్దండి మచిలీపట్నం రైల్వేస్టేషన్‌ను మోడల్‌రైల్వేస్టేషన్‌గా తీర్చిదిద్దాలని బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి జీఎంకు విన్నవించారు. అలాగే వారానికి మూడు రోజులు మాత్రమే నడిచే మచిలీపట్నం– బెంగళూరు కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ను రెగ్యూలర్ రైలుగా మార్చాలని కోరారు. మరిన్ని ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి. ► మచిలీపట్నం–విశాఖపట్నం పాసింజర్ రైలును ఎక్స్‌ప్రెస్ రైలుగా మార్చి, ఏసీ బోగీలను ఏర్పాటు చేయాలి. దీనివల్ల విశాఖ–మచిలీపట్నం మధ్య ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది. కాకినాడ– షిర్డీసాయి నగర్ ఎక్స్‌ప్రెస్‌కు గుడివాడలో కొన్ని అదనపు బోగీలు కలపాలి. దీనివల్ల కృష్ణాజిల్లా వాసులకు షిర్డీనగర్ వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ► పినాకినీ ఎక్స్‌ప్రెస్‌ను విజయవాడ నుంచి కాకుండా మచిలీపట్నం నుంచి నడపాలి. ► మచిలీపట్నం–బీదర్, బీదర్–మచిలీపట్నం, ధర్మవరం–మచిలీపట్నం, విజయవాడ–మచిలీపట్నం, మచిలీపట్నం–గుడివాడ రైళ్లకు వడ్లమన్నాడులో హల్ట్ ఇవ్వాలని స్థానికులు కోరుతుండటంతో పరిశీలించాలి. ► విజయవాడ–జగ్గయ్యపేట–సిక్రిందాబాద్ మధ్య గూడ్స్ రైలు మార్గం ఉంది. ఆ మార్గంలో పాసింజర్ రైలు ఏర్పాటు చేయాలి. దీనవల్ల రెండు లక్షల మంది రైల్వే ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉంటుంది. బాపట్లలో వెయిటింగ్ హాల్ అవసరం బాపట్ల స్టేషన్లో ఏవీటీఎంలను రెండు, మూడు ప్లాట్‌ఫారాలపై ఏర్పాటు.. ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్.. ప్రయాణికులకు వెయిటింగ్ హల్ ఏర్పాటు చేయాలని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ విన్నవించారు. అలాగే వాహనాల పార్కింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. మరిన్ని వినతులు ఇవి.. ► వేమూరు నియోజకవర్గం వలివేరు గ్రామంలో హాల్టింగ్ రైల్వేస్టేషన్ ను పునరుద్ధరించాలి. ► వేమూరు రైల్వేస్టేషన్ నందు గలం రైల్వే పార్కు పెండింగ్ పనులు సత్వరం పూర్తి చేయాలి. ► చీరాల సమీపంలోని పందిళ్లపల్లి రైల్వేస్టేషన్ గ్రీనరీగా మార్చాలి. ► సంతనూతలపాడు నియోజకవర్గం అమ్మనబ్రోలు గ్రామం రైల్వేస్టేషన్ నందు రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్‌ను పునరుద్ధరించాలి. ► చీరాల నియోజకవర్గం పైర్ ఆఫీసు వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మించాలి. ► వేటపాలెం రైల్వేస్టేషన్ నందు బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేయాలి. డెమో రైలు వద్దు మాచర్ల–భీమవరం మధ్యలో నడుస్తున్న మరుగుదొడ్లు లేని డెమో రైలుతో గుంటూరు, విజయవాడ తర్వాత వెళ్లే ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. డెమో స్థానంలో పాతపద్ధతిలో రైలు ప్రవేశపెట్టాలని నర్సారావు పేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ► అలాగే లెవెల్ క్రాసింగ్స్ 92, 93, 95, 98 వద్ద ఏర్పాటు చేసిన రోడ్డు అండర్ బ్రిడ్జీల వద్ద వర్షపు నీరు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని.. అక్కడ మరమ్మతులు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన విన్నవించిన విషయాలు ఇవి.. ► సత్తెనపల్లి, వినుకొండ, నడికుడి, పిడుగురాళ్లలో ఎలక్ట్రానిక్ కోచ్ ఇండికేటర్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం. ► సికింద్రాబాద్–వినుకొండ మధ్య నేరుగా రైలు ఏర్పాటు చేయాలి. ► నల్లపాడు–నంద్యాల సెక్షన్లో ఎలక్ట్రిఫికేషన్ పూర్తయినందున వినియోగంలోకి తీసుకురావాలి. ► మాచర్ల–గద్వాలా–రాయ్‌చూర్ రైల్వే లైను ఐదు దశాబ్దల క్రితం మంజూరు కాగా ఇప్పటి వరకు గద్వాల–రాయచూర్ మధ్య మాత్రమే పనులు పూర్తయ్యాయి.. గద్వాల– మాచర్ల మధ్య పనులు పూర్తి చేయాలి. ► మాచర్ల–భీమవరం మధ్యలో నడుస్తున్న మరుగుదొడ్లు లేని డెమో రైలుతో గుంటూరు, విజయవాడ తర్వాత వెళ్లే ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. డెమో స్థానంలో పాతపద్ధతిలో రైలు ప్రవేశపెట్టాలని నర్సారావు పేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ► అలాగే లెవెల్ క్రాసింగ్స్ 92, 93, 95, 98 వద్ద ఏర్పాటు చేసిన రోడ్డు అండర్ బ్రిడ్జీల వద్ద వర్షపు నీరు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని.. అక్కడ మరమ్మతులు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన విన్నవించిన విషయాలు ఇవి.. ► సత్తెనపల్లి, వినుకొండ, నడికుడి, పిడుగురాళ్లలో ఎలక్ట్రానిక్ కోచ్ ఇండికేటర్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం. ► సికింద్రాబాద్–వినుకొండ మధ్య నేరుగా రైలు ఏర్పాటు చేయాలి. ► నల్లపాడు–నంద్యాల సెక్షన్లో ఎలక్ట్రిఫికేషన్ పూర్తయినందున వినియోగంలోకి తీసుకురావాలి. ► మాచర్ల–గద్వాలా–రాయ్‌చూర్ రైల్వే లైను ఐదు దశాబ్దల క్రితం మంజూరు కాగా ఇప్పటి వరకు గద్వాల–రాయచూర్ మధ్య మాత్రమే పనులు పూర్తయ్యాయి.. గద్వాల– మాచర్ల మధ్య పనులు పూర్తి చేయాలి. -
తెలుగు మళ్లీ వెలగాలి
‘దేశభాషలందు తెలుగు లెస్స’ అని ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయల ప్రశంసలందుకున్న భాష మన తెలుగు భాష. ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని వెనీషియన్ యాత్రికుడు నికోలో డి కాంటీ ప్రస్తుతించిన భాష మన తెలుగు భాష. స్వాతంత్య్రం వచ్చి పదేళ్లు పూర్తయ్యే లోగానే భాషా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగింది. అప్పటికి హిందీ తర్వాత తెలుగు భాష దేశంలో ద్వితీయస్థానంలో ఉండేది. మరాఠీ మూడో స్థానంలో ఉండేది. ఆంధ్రప్రదేశ్ అవతరణతో అద్వితీయ భాషగా వెలుగొందగలదని తెలుగు ప్రజలందరూ ఆశలు పెంచుకున్నారు. ఆ ఆశలు ఎన్నాళ్లో నిలవలేదు. ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిన తర్వాత పట్టుమని పదిహేనేళ్లలోగానే తెలుగు మూడో స్థానానికి పడిపోయింది. బెంగాలీ రెండో స్థానానికి ఎగబాకింది. ఆ తర్వాతి నాలుగు దశాబ్దాల కాలంలో తెలుగు పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారింది. తెలుగు వాళ్లకు రెండు రాష్ట్రాలు ఏర్పడినా, దేశ భాషల్లో తెలుగు తన స్థానాన్ని మెరుగుపరచుకోవడం కాదు సరికదా, కనీసం పదిలపరచుకోవడంలోనూ విఫలమై, నాలుగో స్థానానికి పడిపోయింది. హిందీ అప్పటికీ ఇప్పటికీ మొదటి స్థానంలోనే కొనసాగుతోంది. గడచిన నాలుగు దశాబ్దాలుగా బెంగాలీ రెండో స్థానాన్ని పదిలపరచుకుంటూ వస్తుండగా, మరాఠీ మూడో స్థానానికి ఎగబాకింది. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా విడుదల చేసిన లెక్కల ప్రకారం దేశంలో అతి నెమ్మదిగా వృద్ధి చెందుతున్న భాషల్లో తెలుగు నాలుగో స్థానంలో ఉంది. ఈ లెక్కల కోసం పరిగణనలోకి తీసుకున్న దశాబ్ద కాలంలో– అంటే, 2001–11 కాలంలో తెలుగు భాష మాట్లాడేవారి సంఖ్యలో 9.63 శాతం పెరుగుదల మాత్రమే నమోదైంది. అతి నెమ్మదిగా వృద్ధి చెందుతున్న భాషల్లో నేపాలీ (1.98 శాతం) మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత మలయాళం (5.36 శాతం), సింధీ (9.34 శాతం) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలుస్తున్నాయి. తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కించుకున్న ఆనందం లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించిన లెక్కలతో ఆవిరైనట్లేనంటూ తెలుగు భాషాభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే, తెలుగు విద్యావేత్తలు ఈ లెక్కలను తోసిపుచ్చుతున్నారు. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించిన లెక్కలు పూర్తిగా తప్పుతోవ పట్టించేవిగా ఉన్నాయని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ చెబుతున్నారు. ఖరగ్‌పూర్, భిలాయి, ఒడిశా తదితర ప్రాంతాల్లోని తెలుగు ప్రజలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లయితే, దేశ భాషల్లో తెలుగు రెండో స్థానంలో లేదా మూడో స్థానంలో ఉంటుందని, అంతేకాని నాలుగో స్థానంలో కాదని ఆయన మీడియాతో అన్నారు. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదికను అంతిమంగా స్వీకరించలేమని, దీనిని సమీక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికపై తెలుగు భాషావేత్తలు, విద్యావేత్తలు, రాష్ట్రేతర ప్రాంతాల్లోని తెలుగు భాషాభిమానులు తమ తమ స్థాయిలో స్పందిస్తున్నా, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. హిందీ హవా అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం గడచిన దశాబ్ద కాలాన్నే తీసుకుంటే, 2001 –11 మధ్య కాలంలో హిందీ మాతృభాషగా గల వారి జనాభాలో ఏకంగా 10 కోట్ల పెరుగుదల నమోదైంది. ఈ పెరుగుదల రెండో స్థానంలో ఉన్న బెంగాలీ మాతృభాషగా గల వారి జనాభా కంటే ఎక్కువే. మన దేశంలో మాట్లాడే చాలా భాషలతో పోల్చుకుంటే హిందీ ఆధునిక భాష. మిగిలిన భాషల కంటే దీనికి గల చరిత్ర చాలా తక్కువ. సంస్కృత భాష నుంచి క్రీస్తుశకం ఏడో శతాబ్దిలో పుట్టిన అపభ్రంశ రూపమైన సౌరసేని భాష హిందీకి మూలమని చెబుతారు. ప్రామాణిక రూపంలోని హిందీ రచనలు పదహారో శతాబ్దిలో మొదలయ్యాయి. మొఘల్ సామ్రాజ్యం చివరి దశలో ఉండగా, అంటే పద్దెనిమిదో శతాబ్దిలో మాత్రమే హిందీ ఆస్థాన గౌరవాన్ని అందుకోగలిగింది. బ్రజ్‌భాష, అవధి, మైథిలి వంటి స్థానిక భాషలను, మాండలికాలను కలుపుకొని ఉత్తరాదిలోని చాలా ప్రాంతాల్లో విస్తరించింది. తెలుగుతో పాటు ప్రాచీన హోదా అందుకున్న ఆరు భాషల్లో ఏ భాష కూడా ఈ స్థాయిలో విస్తరించలేదు సరికదా, జనాభాలో తమ శాతాన్ని కూడా పెంచుకోలేకపోతున్నాయి. హిందీ మాట్లాడేవారి సంఖ్య 1971 నుంచి 2011 మధ్య కాలంలో ఏకంగా 161 శాతం మేరకు పెరిగింది. ఇదేకాలంలో తెలుగు సహా దక్షిణాదికి చెందిన ద్రావిడ భాషలు మాట్లాడేవారి జనాభాలో 81 శాతం పెరుగుదల మాత్రమే నమోదైంది. మరోవైపు 2001 నుంచి 2011 మధ్య కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ మాట్లాడేవారి జనాభా దాదాపు రెట్టింపయింది. హిందీ మాట్లాడేవారు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడుతున్నా, వారు తమ మాతృభాషను కాపాడుకోగలుగుతున్నారు. దేశవ్యాప్తంగా హిందీని మాతృభాషగా చదువుకోగల వెసులుబాటు ఉండటమే దీనికి కారణం. తెలుగు పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాల్లో తెలుగు ప్రజల సంఖ్య గణనీయంగా ఉంటున్నా, ఆ రాష్ట్రాల్లో ఒకటి రెండు తరాలు గడిచే సరికి తెలుగును మాతృభాషగా నిలబెట్టుకోగలుగుతున్న వారి సంఖ్య నానాటికీ పడిపోతూ వస్తోంది. తెలుగులో విద్యావకాశాలు దాదాపు లేకపోవడం వల్ల ఆయా రాష్ట్రాల్లోని తెలుగువారు తప్పనిసరిగా అక్కడి స్థానిక భాషలనే మాతృభాషగా స్వీకరిస్తున్నారు. సంఖ్య పెరిగినా తగ్గిన జనాభా శాతం అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 1951 నాటితో పోల్చుకుంటే 2011 నాటికి తెలుగు మాట్లాడే వారి జనాభా సంఖ్యపరంగా రెట్టింపు కంటే ఎక్కువగానే పెరిగింది. దేశజనాభాను మొత్తంగా పరిగణనలోకి తీసుకుంటే మాత్రం తెలుగు మాట్లాడే వారి శాతం ఎప్పటికప్పుడు తగ్గుతూ వస్తోంది. దేశ జనాభాలో తెలుగు మాట్లాడేవారు 1951 నాటికి 9.24 శాతం ఉంటే, 2011 నాటికి 6.93 శాతానికి పడిపోయింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా హిందీ ప్రచారం జరిగినట్లుగా మరే భాషకూ ప్రచారం జరగలేదు. దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దే ప్రయత్నాలు జరిగినప్పుడు తమిళనాడు నుంచి మాత్రమే గట్టి ప్రతిఘటన ఎదురైంది. బెంగాలీ, తమిళం, మరాఠీ వంటి భాషలు తమ తమ రాష్ట్రాల్లో తమ ఉనికి బలంగా కాపాడుకోగలిగాయి. ఉనికిని కాపాడుకోవడంతో పాటు ప్రాబల్యాన్ని పెంచుకునే చర్యలు చేపట్టడంలో తెలుగు, కన్నడ వంటి భాషలు ఇంకా వెనుకబాటులోనే ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన నాటికి రెండో స్థానంలో ఉన్న తెలుగు, 1971 నాటికి మూడో స్థానానికి పడిపోయినప్పుడైనా, తాజాగా మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయినప్పుడైనా తెలుగు భాషోద్ధరణ కోసం, కనీసం భాషా పరిరక్షణ కోసం ప్రభుత్వ వర్గాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. తెలుగు భాషోద్ధరణ పేరిట 1975 నుంచి 2017 మధ్య కాలంలో ఐదుసార్లు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించినా, వాటి వల్ల తెలుగు ప్రజలకు ఒరిగినదేమీ లేదు. పైగా, తెలుగు రాష్ట్రాల వెలుపల ఉంటున్న తెలుగు విద్యార్థులకు మాతృభాషలో విద్యావకాశాలు దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. ఇతర రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఉంటున్నా, వారిలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య, తెలుగు చదివే వారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇదివరకటి కాలంలో అ‘ద్వితీయం’గా వెలుగొందిన తెలుగు భాష ప్రాభవం ఇప్పుడు క్రమంగా మసకబారుతుండటానికి వెనుకనున్న కారణాలను విశ్లేషించి, పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపైనే ఉంది. తెలుగు చరిత్రలో మైలురాళ్లు తెలుగు భాష క్రీస్తుపూర్వం రెండో శతాబ్ది నాటికే ఉనికిలో ఉండేదనేందుకు ఆధారాలు ఉన్నాయి. క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దికి చెందిన శాతవాహనుల కాలం నాటి ప్రాకృత పద్యసంకలనం ‘గాథాసప్తశతి’లో అక్కడక్కడా కొన్ని తెలుగు పదాలు, ఆంధ్రుల ప్రస్తావన కనిపిస్తుంది. తెలుగులోని స్పష్టమైన తెలుగు శిలాశాసనం క్రీస్తుశకం ఏడో శతాబ్ది నాటిది. శిలా శాసనాల్లో కనిపించిన తొలి తెలుగు పదం ‘నాగబు’. శతాబ్దాల తరబడి వాడుక తర్వాత క్రీస్తుశకం పదకొండో శతాబ్దిలో తెలుగులో గ్రంథరచన మొదలైంది. మహాభారత ఆంధ్రీకరణకు నన్నయ శ్రీకారం చుట్టాడు. నన్నయ మహాభారత రచన ప్రారంభించడానికి ముందే తెలుగులో కొన్ని జానపద గీతాలు, పద్యాలు ప్రచారంలో ఉండేవి. నన్నయ ప్రారంభించిన మహాభారత ఆంధ్రీకరణను పదమూడో శతాబ్దికి చెందిన తిక్కన, పద్నాలుగో శతాబ్దికి చెందిన ఎర్రన పూర్తి చేశారు. తెలుగులో గ్రంథరచన మొదలైన దాదాపు మూడు శతాబ్దాల కాలంలో చాలామంది కవులు ఎక్కువగా పురాణాల ఆధారంగానే కావ్యాలు రాశారు. పదిహేనో శతాబ్ది నుంచి పదహారో శతాబ్ది వరకు గల కాలం తెలుగు సాహిత్య చరిత్రలో ‘శ్రీనాథయుగం’గా ప్రసిద్ధి పొందింది. శ్రీనాథుడు, పోతన, గౌరన, జక్కన, తాళ్లపాక తిమ్మక్క వంటి కవులు తెలుగు ఛందస్సును పరిపుష్టం చేశారు. శ్రీనాథ యుగంలో కూడా సంస్కృత కావ్య, నాటకాల అనువాదం ప్రధానంగా కొనసాగింది. ప్రబంధ ప్రక్రియ ఈ కాలంలోనే రూపుదిద్దుకుంది. పదహారో శతాబ్ది మన సాహిత్య చరిత్రలో‘రాయలయుగం’గా ప్రసిద్ధి పొందింది. రాయల కాలంలో అత్యధికంగా ప్రబంధ కావ్యాలు వెలుగులోకి రావడంతో ఈ కాలాన్ని ప్రబంధ యుగం అని కూడా అంటారు. స్వయంగా కవి అయిన శ్రీకృష్ణదేవరాయలు ‘ఆముక్తమాల్యద’ ప్రబంధ కావ్యాన్ని రచించాడు. ఆయన ఆస్థాన కవులైన పెద్దన, తిమ్మన, తెనాలి రామకృష్ణుడు తదితరులు కూడా ప్రబంధ కావ్యాలు రచించారు. తర్వాతి కాలంలో కర్ణాటక సంగీత సంప్రదాయం పుంజుకుంది. సుప్రసిద్ధ కర్ణాటక సంగీత వాగ్గేయకారుల్లో చాలామంది తెలుగులో కృతులు, కీర్తనలు రచించారు. ఆధునిక యుగంలో తెలుగు తెలుగులో మొట్టమొదటి అచ్చు పుస్తకం 1796లో విడుదలైంది. అయితే, తెలుగు సాహిత్యంలో ఆధునికత మాత్రం పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లలో మాత్రమే ప్రారంభమైంది. అప్పటికి దేశంలో బ్రిటిష్ పాలన కొనసాగుతుండటంతో ఇంగ్లిష్ కవిత్వం ప్రభావంతో నాటి యువకవులు భావకవిత్వం పేరిట కొత్తరీతిలో ప్రణయకవిత్వాన్ని విరివిగా రాశారు. బ్రిటిష్ అధికారి అయిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు భాషపై మక్కువ పెంచుకుని, మరుగున పడిపోయిన వేమన పద్యాలను వెలుగులోకి తేవడమే కాకుండా, వేమన పద్యాలను ఇంగ్లిష్‌లోకి అనువదించాడు. తొలి ఇంగ్లిష్–తెలుగు నిఘంటువును స్వయంగా పరిష్కరించి, ప్రచురించాడు. తెలుగునాట ఏ విశ్వవిద్యాలయాలూ, సాహితీ సంస్థలూ చేయలేనంతగా తెలుగు భాషోద్ధరణకు సీపీ బ్రౌన్ కృషి చేశాడు. కందుకూరి వీరేశలింగం ‘రాజశేఖర చరిత్రము’ ద్వారా తెలుగులో నవలా ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆధునిక యుగంలోని తొలినాటి రచనలు ఎక్కువగా గ్రాంథికభాషలోనే ఉండేవి. సాహిత్యాన్ని పామరులకు చేరువ చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన కొందరు రచయితలు వ్యావహారిక భాషోద్యమానికి తెరతీశారు. గిడుగు రామమూర్తి వ్యావహారిక భాషోద్యమాన్ని ఉధృతంగా సాగించడంతో చాలామంది కవులు, రచయితలు వాడుక భాషలో రచనలు చేయడం ప్రారంభించారు. గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ నాటకాన్ని పూర్తిగా వాడుక భాషలోనే రాశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు కట్టమంచి రామలింగారెడ్డి, రాయప్రోలు సుబ్బారావు, నండూరి సుబ్బారావు, సురవరం ప్రతాపరెడ్డి, గుడిపాటి వెంకటచలం, శ్రీశ్రీ, ఆరుద్ర వంటి వారు తమ రచనల ద్వారా వ్యావహారిక భాషావ్యాప్తికి కృషి చేశారు. గిడుగు రామమూర్తి శిష్యుడైన తాపీ ధర్మారావు తన సంపాదకత్వంలో వెలువడిన ‘జనవాణి’ పత్రిక ద్వారా పత్రికల్లో వ్యావహారిక భాషను ప్రవేశపెట్టారు. ‘జనవాణి’కి ముందునాటి పత్రికల్లో మామూలు వార్తలను కూడా సరళగ్రాంథిక భాషలో రాసేవారు. పత్రికల్లో తాపీ ధర్మారావు తెచ్చిన ఒరవడిని అనతికాలంలోనే మిగిలిన పత్రికలూ అందిపుచ్చుకున్నాయి. ప్రాచీన హోదాకు వైఎస్ కృషి, బ్రిటిష్ హయాంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రావిన్స్‌లో అంతర్భాగంగా ఉండేవి. తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంగా నిజాం పాలనలో ఉండేది. తెలుగు వాళ్లకు ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం చేసిన దరిమిలా, 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత మూడేళ్లకు తెలంగాణ ప్రాంతాన్ని కూడా కలుపుకొని 1956 నవంబర్ 1న విశాలాంధ్రగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమం ఫలితంగా 2014లో అమల్లోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయి వేర్వేరు రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న కాలంలో తెలుగు అకాడమీ, అధికార భాషా సంఘం వంటి సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసినా, తెలుగు తన ‘ద్వితీయ’ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తెలుగుకు ప్రాచీన హోదా కల్పించాలంటూ 2006 ఫిబ్రవరి 21న మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానించింది. తెలుగు భాషకు సంబంధించిన మరిన్ని ప్రాచీన ఆధారాలను కూడా సమర్పించడంతో 2008లో తెలుగుకు ప్రాచీన హోదా దక్కింది. తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కడం తెలుగు ప్రజలకు సంతోషకరమే. అయితే, బోధనలోను, పరిపాలనలోను తెలుగు భాషా వ్యాప్తి, విస్తరణకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మరింతగా కృషి చేస్తేనే తెలుగు తిరిగి అ‘ద్వితీయ’ స్థానంలో వెలుగొందగలుగుతుంది. – పన్యాల జగన్నాథదాసు -
శ్రీకృష్ణదేవరాయ కళామందిరానికి చేయూత!
బెంగళూరు తెలుగు ప్రజల భాషా సాంస్కృతుల వికాసానికి దాదాపు 65 సంవత్సరాల చరిత్ర ఉంది. దివంగతులు డా. తెన్నేటి విశ్వనాధం, డా. సూరి భగవంతం, డా. అన్నారావు ఈ నగరంలో స్థాపించిన తెలుగు విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయ కళామందిరాన్ని నిర్మిస్తు న్నారు. దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ కళా మందిరానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రూ. 65 లక్షలు ఇచ్చింది. ఇక తమ ఎంపీ నిధుల నుంచి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రూ. 25 లక్షలు ఇవ్వగా, ఒక ప్రముఖ సినీ నటి, శాసన మండలి సభ్యురాలు మరో రూ.25 లక్షలను ఇచ్చారు. కాగా, తెలుగు విజ్ఞాన సమితి దాతల నుంచి 50 లక్షల విరాళాలు సేకరించి నిర్మాణ పనులు చేపట్టారు. తెలుగు విజ్ఞాన సమితి గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, తుఫాను బాధితులకు తన శ క్తిమేరకు ఆర్థిక సహాయం అందించింది. 1977లో దివిసీమ బాధితులకోసం రూ.20 లక్షలు, 1996లో ఏపీ తుఫాను బాధితుల సహాయార్థం 6 కోట్ల రూపాయలను అందించింది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి మేము సైతం అంటూ రూ.25 లక్షలను తెలుగు విజ్ఞాన సమితి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అందించింది. తెలుగు విజ్ఞాన సమితి గత ఏడాది నిర్వహించిన ఉగాది ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏపీ ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమితి తలపెట్టిన కళామందిర నిర్మాణానికి చేయూతను ఇస్తామని వాగ్దానం చేశారు. సమితి విజ్ఞప్తి మేరకు ఈ కళామందిర నిర్మాణానికి రూ.50 లక్షలను ఇవ్వాలని ఏపీ సాంస్కృతిక శాఖ సిఫార్సు చేసింది. శ్రీకృష్ణదేవరాయ కళామందిరంగా నామకరణం చేసి డా॥రామారావు దివ్యస్మృతికి అంకితం చేస్తున్నాము. ఎన్టీఆర్‌కు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న విశిష్ట అభిమానులను దృష్టిలో ఉంచు కుని ఈ చారిత్రాత్మకమైన కళామందిరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పక తగు సహాయం చేయవలసిందిగా విజ్ఞప్తి. ఈ సందర్భంగా డా. టి . సుబ్బరామిరెడ్డి దాతృత్వ ఔదా ర్యాన్ని తప్పక గుర్తించుకోవాలి. నిరుడు జరిగిన తెలుగు విజ్ఞాన సమితి బెంగళూరు ఉగాది ఉత్సవాలలో పాల్గొన్న ఆయన కళామందిరానికి విరాళం ఇస్తానని వాగ్దానం చేశారు. ప్రముఖ చలనచిత్ర దర్శకులు పద్మశ్రీ డా. కె. విశ్వనాథ్, ప్రముఖ నటి డా. జయసుధలకు శ్రీ కృష్ణ దేవరాయ పురస్కారం ప్రదానం చేసిన సభలో ఇచ్చిన వాగ్దానం మేరకు టి. సుబ్బరామిరెడ్డి.. శ్రీకృష్ణ దేవరాయ కళామందిరం కోసం 50 లక్షల రూపాయల చెక్కును తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షులకు అందించారు. ఈ ఔదార్యానికి, అందించిన భూరి విరాళానికి గాను తెలుగు విజ్ఞాన సమితి సంస్థ తరపున, కర్ణాటక రాష్ట్ర తెలుగు ప్రజల తరపున డా.టి. సుబ్బరామిరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. - డా॥ఎ.రాధాకృష్ణరాజు తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షులు, బెంగళూరు భళా బాహుబలి రాజమౌళి మానసపుత్రిక ‘బాహుబలి’ జాతీయ ఉత్తమ చిత్రంగా నిలబడటం తెలుగు సినీ అభిమానులకు గర్వకారణం. ఎనభై ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో మరుపురాని మధుర ఘట్టం ఈ విజయంతో ఆవిష్కృతమైంది. ఆరు దశాబ్దాలకుపైగా తెలుగు చిత్ర సీమకు అందని ద్రాక్షలా ఉన్న జాతీయ అవార్డునును బాహుబలి సాధించి, తెలుగు సినీ రంగ స్వప్నాన్ని సాకారం చేసింది. హిందీ తర్వాత అత్యధిక చిత్రాలను నిర్మిస్తున్న పరిశ్రమగా పేరున్నప్పటికీ మన సినిమాలు జాతీయస్థాయి ప్రమాణాలతో కూడా ఉండటం లేదన్న విమర్శకులకు బాహుబలి సరైన సమాధానం. రాజమౌళి దర్శక ప్రతిభ, నటీనటుల అద్భుత నటన, అద్భుతమైన గ్రాఫిక్స్ ఈ సినిమా విజయానికి మూల కారణాలు. సగటు ప్రేక్షకుడిని ఊహాలోకంలో విహరింపజేయగల బలమైన మాధ్యమం సినిమా. ఆచంద్రతారార్కం గుర్తుంచుకునే కళాఖండాలు అరుదుగానే రూపుదిద్దుకుంటాయి. బాహు బలి అలాంటి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సాంకేతిక విలు వలతో చిత్రాలు నిర్మిస్తే.. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయగలిగితే కనకవర్షంతోపాటు అవార్డులను కూడా సునాయాసంగా సాధించ వచ్చని బాహుబలి నిరూపించింది. ఇక మనుషుల మధ్య అడ్డుగోడగా ఉన్న కులమతాల కంచెల కూల్చివేతను ఆకాంక్షించిన కంచె తెలుగులో ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక కావటం శుభపరిణామం. - బట్టా రామకృష్ణ దేవాంగ, సౌత్‌మోపూరు