సాక్షి, న్యూఢిల్లీ: శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇస్రో అద్భుతమైన సేవలందిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మార్గాని భరత్‌రామ్ కొనియాడారు. అంతరిక్ష రంగంలో మహిళల ప్రమేయం పెరిగేలా ప్రోత్సహించాల ని కేంద్రాన్ని కోరారు. లోక్‌సభలో గురువారం చంద్రయాన్–3 విజయంపై జరిగిన చర్చలో ఎంపీలు ఇరువురూ మాట్లాడారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. ఇంతటి గొప్ప పరిశోధనలు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి జరగటం తెలుగువారికి గర్వకారణమన్నారు.
చంద్రయాన్ ప్రయోగంలో భాగస్వాములైన మెజారిటీ శాస్త్రవేత్తలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలల నుంచి రావ డం గొప్ప విషయమని చెప్పారు. యూనివర్సిటీలకు రాష్ట్రీయ య ఉచ్చతర్ శిక్షా అభియాన్(రూసా)కింద గత నాలుగైదు సంవత్సరాలుగా ఏటా రూ.8,120 కోట్ల నిధులు కేటాయిస్తున్నా వినియోగం 60 శాతం కూడా ఉండటంలేదని వివరించారు. వర్సిటీలు ఈ నిధులు వాడుకునేలా వెసులుబాటు కల్పించాల్సి ఉందన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని మెరుగుపరచాల్సిఉందని సూచించారు.
ఎంపీ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ.. అంతరిక్ష రంగంలో మన శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడా రు. దేశమంతా చంద్రయాన్–3 విజయాన్ని కొనియాడుతుంటే టీడీపీ మాత్రం మాజీ సీఎం చంద్రబాబు గురించి మాట్లాడుతోందని ఎద్దే వా చేశారు. రూ.3,300 కోట్ల కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్టయ్యారన్నారు. చంద్రబాబు చేసిన ఇతర కుంభకోణాలు సైతం త్వరలో బయటపడతాయన్నారు.
చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ల్యాండయినప్పుడు తన ఆరేళ్ల కుమార్తె ‘నాన్నా చంద్రుడి మీద అడుగుపెట్టాం’ అంటూ ఎంతో సంబరపడిందని, ‘మనం ఎప్పుడు చంద్రుడి మీద కు వెళ్తాం అమ్మా?’ అని తన తల్లిని అడగడం తనని ఎంతో సంతోషానికి గురిచేసిందన్నారు. చంద్రయాన్–3 విజయంపై ఇస్రో బృందం, ప్రధాని నరేంద్రమోదీకి భరత్ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment