నరసన్న పెళ్లికొడుకాయెనే..
-
∙అంతర్వేదిలో కల్యాణోత్సవాలకు శ్రీకారం
-
∙బుగ్గన చుక్క, నొసట తిలకంతో దర్శనమిచ్చిన స్వామి
-
మాడవీధుల్లో సూర్య, చంద్రప్రభ వాహనాలపై ఉత్సవం
అంతర్వేదిలో లక్షీ్మనృసింహస్వామివారి వార్షిక దివ్య తిరు కల్యాణ మహోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. సూర్యభగవానుడి జన్మదినం రోజైన రథసప్తమి నాడు స్వామిని నవవరుడిని చేశారు. బుగ్గన చుక్క, నొసటన తిలకం, పట్టువస్రా్తలు ధరించి పెళ్లికొడుకుగా సిగ్గులొలుకుతూ దర్శనమిచ్చిన శ్రీవారిని చూసి భక్తులు తన్మయత్వం చెందారు.
సఖినేటిపల్లి / మలికిపురం
ఏటా మాదిరి ముద్రికాలంకరణ(శ్రీవారిని పెళ్లికుమారుని, అమ్మవారిని పెళ్లి కుమార్తె చేసే కార్యక్రమం)ను కేశవదాసుపాలేనికి చెందిన బెల్లంకొండ, ఉండపల్లి కుటుంబాల వారు ఆలయ అర్చకుల సమక్షంలో ఘనంగా జరిపించారు. సాయంత్రం 6.30 గంటలకు ధూపసేవ అనంతరం ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, వేదపండితుడు చింతా వేంకటశాస్త్రి, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, అర్చకస్వాములు శ్రీవారికి, అమ్మవారికి వైఖానసాగమానుసారం, శ్రీవైష్ణవ సంప్రదాయ ప్రకారం విశేష పూజలు చేశారు. మామిడాకులు భస్మం చేయగా వచ్చిన బూడిదతో బుగ్గన చుక్కపెట్టి, ఉంగరం తొడిగి పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తెను చేసే తంతును పూర్తిచేశారు. ఆనవాయితీగా రథసప్తమి పర్వదినాన కేశవదాసుపాలేనికి చెందిన బెల్లంకొండ, ఉండపల్లి కుటుంబాల వారు సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. స్వామికి బెల్లంకొండ, అమ్మవారికి ఉండపల్లి కుటుంబీకులు నూతన వస్రా్తలను సమర్పించుకున్నారు. వారు ఏర్పాటు చేసిన అన్నదానంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామి ప్రసాదాన్ని తీసుకున్నారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ చిక్కాల వెంకట్రావు పాల్గొన్నారు.
ఆలయ నిర్మాత కృష్ణమ్మకు నివాళులు
అంతర్వేదిలో కల్యాణోత్సవాలు ప్రారంభం సందర్భంగా ఆలయ నిర్మాత కొపనాతి కృష్ణమ్మ విగ్రహానికి పలువురు ప్రముఖులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ట్రస్టీలు, ఉత్సవ సేవాకమిటీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఏటా ఉత్సవాలు ప్రారంభానికి ముందు పుణ్యక్షేత్రంలో ఉన్న ఆయన నిలువెత్తు విగ్రహం వద్ద నివాళులు అర్పించడం ఆనవాయితీ.
తూర్పు వీధి(మెరకవీధి)కి చేరిన రథం..
స్వామి కల్యాణ మహోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది రథోత్సవం. ఈ వేడుక ఈనెల ఏడోతేదీ భీష్మ ఏకాదశి పర్వదినాన మెరక వీధి నుంచి మొదలవుతుంది. ఏడాది పొడవునా ఆలయం వద్ద ఉండే రథానికి ఉత్సవాల సందర్భంగా అవసరమైన మరమ్మతులు చేసి, రంగు రంగులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మధ్యాహ్నం రాజకీయ ప్రముఖులు, అధికారులు, ట్రస్టీలు, సేవా కమిటీ సభ్యులు, అర్చకులు రథం వద్ద పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం గోవింద నామస్మరణల మధ్య రథాన్ని మెరకవీధికి తోడ్కొని వెళ్లారు. ఉత్సవాల తొలిరోజు సాయంత్రం సూర్యవాహనంపైన, రాత్రి చంద్రప్రభ వాహనంపైన కొలువుదీరిన శ్రీస్వామి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని... దర్శించుకున్నారు.
అంతర్వేదిలో నేడు..
శ్రీలక్షీ్మనృసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు హంసవాహనంపైన, రాత్రి ఏడు గంటలకు శేషవాహనంపైన గ్రామోత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం ధూపసేవ అనంతరం ధ్వజారోహణ నిర్వహించనున్నారు.
పూర్ణాహుతితో ముగిసిన క్రతువులు
అయినవిల్లి : అయినవిల్లి విఘ్నేశ్వరుని ఆలయంలో మూడురోజుల పాటు నిర్వహిస్తున్న క్రతువులకు శుక్రవారం పూర్ణాహుతి కార్యక్రమంతో ముగింపు పలికారు. ఆలయ ప్రధానార్చకులు మాచరి సూరిబాబు ఆధ్వర్యంలో స్వామిని పంచామృతాలతో అభిషేకించారు. లక్షగరిక పూజలు చేశారు. వేదపండితులు పూర్ణాహుతి కార్యక్రమంతో స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలకు ముగింపు పలికారు. విద్యార్థుల కోసం చదువుల పండుగ నిర్వహించారు. కార్యక్రమంలో పండితులు విద్యార్థుల నాలుకపై బీజాక్షరాలను లిఖించారు. ఆలయ చైర్మ¯ŒS రావిపాటి సుబ్బరాజు, ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆదివారం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి చేతులు మీదుగా స్వామివారి ప్రసాదంగా విద్యార్థులకు పెన్నులను పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేశామని ఈఓ తెలిపారు.