అంతర్వేది ఆధ్యాత్మిక సవ్వడి | ANTARVEDI TEMPLE FESTIVALS | Sakshi
Sakshi News home page

అంతర్వేది ఆధ్యాత్మిక సవ్వడి

Published Thu, Feb 2 2017 11:33 PM | Last Updated on Tue, Sep 5 2017 2:44 AM

అంతర్వేది ఆధ్యాత్మిక సవ్వడి

అంతర్వేది ఆధ్యాత్మిక సవ్వడి

  • ∙నేటి నుంచి లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు  
  • ∙తొమ్మిది రోజుల పర్వానికి శ్రీకారం 
  • ∙కల్యాణం తిలకం దిద్దుకోనున్న ఆది దేవుళ్లు
  • నవ నారసింహక్షేత్రాల్లో అగ్రగామి అంతర్వేది పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువై ఉన్న లక్షీ్మనృసింహస్వామివారి కల్యాణ మహోత్సవాలు రథసప్తమి రోజైన శుక్రవారం ప్రారంభంకానున్నాయి. సాయంత్రం నాలుగు గంటలకు సూర్యవాహనంపై ఊరేగిస్తారు. అనంతరం 6.30 గంటలకు ఆదిదేవుళ్లయిన నృసింహస్వామి, లక్షీ్మదేవిలను వధూవరులుగా అర్చకులు ముస్తాబు చేస్తారు. అనంతరం ఈ ఏడాది నుంచి అదనంగా భక్తులతో నిర్మించిన చంద్రప్రభ వాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు. శుక్రవారం నుంచి తొమ్మిదిరోజుల పాటు స్వామివారి వార్షిక దివ్య తిరు కల్యాణ మహోత్సవాలు జరుగుతాయి.
    – సఖినేటిపల్లి
     
    ఉత్సవాల్లో కార్యక్రమాలు..
    ఉత్సవాల్లో భాగంగా 6వ తేదీ దశమి నాటి రాత్రి 12.21 గంటలకు మృగశిర నక్షత్రయుక్త తులా లగ్నపుష్కరాంశంలో శ్రీస్వామివారి తిరు కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. 7న భీష్మ ఏకాదశి పర్వదినాన మధ్యాహ్నం 2.42గంటలకు శ్రీస్వామివారి రథోత్సవం, 10న సముద్ర స్నానం, 11న హంసవాహనంపై స్థానిక చెరువులో తెప్పోత్సవం జరుగుతాయి. అల్లవరం మండలం బెండమూర్లంకకు చెందిన కొపనాతి ఆదినారాయణ ఆలయ నిర్మాణానికి పూనుకున్నారని, దానిని ఆయన కుమారుడైన కృష్ణమ్మ 1823లో పూర్తిచేశారని ఆలయంలోని శిలాశాసనంలో ఉంది.
     
    గ్రామోత్సవాల్లో వాహనాలు ఇవే..
    స్వామివారిని ఈ ఏడాది నుంచి 14 వాహనాలపై గ్రామోత్సవం నిర్వహించనున్నారు. 3న సూర్యవాహనం, చంద్రప్రభ వాహనం, 4న హంస వాహనం, శేష వాహనం, 5న రాజాధిరాజ వాహనం, సింహవాహనం, 6న పంచముఖ ఆంజనేయస్వామి వాహనం, కంచుగరుడ వాహనం, 8న గజవాహనం, పొన్నవాహనం, 9న హనుమద్వాహనం, అశ్వవాహనం, 10న గరుడపుష్పక వాహనం, 11న పుష్పక వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. 7వ తేదీన నూతన వధూవరులుగా మూర్తీభవించిన శ్రీస్వామివారు, అమ్మవార్లను రథంపై అధిరోహింపచేసి, భక్తులు ఊరేగిస్తారు. 
     
    సర్వం సిద్ధం
    తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాలు నిర్వహణకు సర్వం సిద్ధమైంది. జేసీ సత్యనారాయణ, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, ఉత్సవాల ఇ¯ŒSచార్జ్, అమలాపురం ఆర్డీఓ గణేష్‌కుమార్‌ సారధ్యంలో డివిజ¯ŒSస్థాయి అధికారులు తీర్థం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తుల సేవల కోసం దేవస్థానం సిబ్బంది 70 మందిని విధుల్లోకి తీసుకున్నట్టు చీఫ్‌ ఫెస్టివల్‌ ఆఫీసర్‌ రమేష్‌బాబు చెప్పారు. అసిస్టెంట్‌ కమిషనర్‌ చిక్కాల వెంకట్రావు ఆధ్వర్యంలో ట్రస్టీలు, ఉత్సవ సేవాకమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 
    మద్యం దుకాణాల బంద్‌
    6, 7, 10 తేదీల్లో పుణ్యక్షేత్ర పరిధిలో మద్యం దుకాణాలు పూర్తిగా వేస్తున్నట్టు ఎక్సైజ్‌ శాఖ వెల్లడించింది. అయితే తీర్థమహోత్సవాల అన్ని రోజులూ వీటిని పూర్తిగా నిషేధించాలని ప్రముఖులు కోరారు. సముద్ర స్నానాల రేవు వద్ద 60 మంది గజ ఈతగాళ్లను, మూడు రెస్క్యూ బోట్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఫిషరీస్‌ డీడీ అంజలి తెలిపారు. 
    అంతర్వేదికి రాక ఇలా... 
    రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి అంతర్వేదికి చేరుకోవాలనుకునే భక్తులు రావులపాలెం, రాజోలు మీదుగా రావాలి. పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వచ్చే భక్తులు దిండి–చించినాడ వంతెన మీదుగా శివకోడు, మలికిపురం మీదుగా చేరుకోవాలి. కల్యాణ మహోత్సవాలు సందర్భంగా అమలాపురం, రాజోలు, భీమవరం, పాలకొల్లు డిపోల నుంచి సుమారు 200 బస్సులు నడపనున్నారు. 
    అంతర్వేదికి ఎంతదూరం...
    అంతర్వేదిS రాజోలు నుంచి 31 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి 104, అమలాపురం నుంచి 63, కాకినాడ నుంచి 118, పాలకొల్లు నుంచి 41, భీమవరం నుంచి 64 కిలోమీటర్ల దూరం ఉంది. 
    ఎప్పటిలానే వ¯ŒS వే..
    ఎప్పటిలాగానే తీర్థంలో వాహనాల రాకపోకలకు పోలీసులు వ¯ŒS వేను అమలు చేస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల నుంచి అంతర్వేదికి వచ్చే వాహనాలు టేకిశెట్టిపాలెం వద్ద ప్రధాన రహదారిలో కేశవదాసుపాలెం మీదుగా అంతర్వేదికి రావచ్చు. తిరుగుప్రయాణంలో ఆలయం వెనుకవైపు ఏటిగట్టు మీదుగా గొంది, గుడిమూల, సఖినేటిపల్లి సెంటర్‌ మీదుగా మలికిపుం, రాజోలు ప్రాంతాలకు వెళ్లవచ్చు. వీటితో పాటు భక్తుల వాహనాలకు గుర్రాలక్క గుడికి సమీపంలో పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటుకు పంచాయతీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్‌ స్థలాల నుంచి వాహనాలను గుర్రాలక్క గుడిమీదుగా ఉన్న దండుపుంత బీటీ రోడ్డులో అంతర్వేదికర వద్ద మలుపు తిరిగి గంగయ్యవారధి, గొంది పాములవారి సెంటర్‌ మీదుగా సఖినేటిపల్లి మూడు తూములు సెంటర్‌ మీదుగా ప్రధాన రహదారిపైకి చేరుకోవాలి. 
     
    పటిష్ట భద్రత
     
    భక్తుల భద్రతకు వివిధ స్థాయిల్లో సుమారు 1500 పోలీసు సిబ్బందిని నియమిస్తున్నట్టు డీఎస్పీ అంకయ్య చెప్పారు. తీర్థంలో కూడా గట్టి నిఘా ఉంటుందని అన్నారు. స్నానాల రేవు వద్ద ఐటు వాచ్‌టవర్స్‌ ఏర్పాటు చేస్తున్నట్టు, అన్నాచెల్లెలుగట్టు, లాంచీలరేవు వద్ద నిషేధాన్ని అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. తీర్థంలో ఐదు కిలోమీటర్ల్ల పరిధిలో మద్యం, మాంసం అమ్మకాలు లేకుండా అధికారులు నిఘా పెడుతున్నారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement