హిందూ ధర్మం ఆధారంగా మోక్షం
ద్వారకా తిరుమల : హిందూ ధర్మం ఆధారంగానే ప్రపంచంలో వివిధ మతాల మధ్య సామరస్యం, శాంతి, అలాగే మోక్షం లభించగలవని, ఎవరూ మరొక మతంలోకి మారనవసరం లేదని హిందూ దేవాలయాల ప్రతిష్ఠాన పీఠాధిపతి (హైదరాబాద్) కమలానంద భారతీ స్వామీజీ అన్నారు. ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామిజీ మాట్లాడుతూ హిందూ ధర్మం, సంస్కృతి, జీవన విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు.