IN DWARAKA
-
భక్తజన సంద్రం.. చిన తిరుపతి క్షేత్రం
ద్వారకా తిరుమల : శ్రీవారి దివ్యక్షేత్రం శనివారం భక్తులతో కిక్కిరిసింది. అలాగే నూతన వధువరులతో కళకళలాడింది. శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున ముహూర్తాల్లో వివాహాలు జరుపుకున్న నూతన వధూవరులు, వారి బంధువులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకోవడంతో సందడి నెలకొంది. దాదాపు 20 వేల మందికి పైబడి భక్తులు స్వామివారిని దర్శించినట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాధరావు తెలిపారు. 5 వేల మందికిపైగా యాత్రికులు స్వామివారి ఉచిత అన్న ప్రసాదాన్ని స్వీకరించినట్టు చెప్పారు. తిరుమల తిరుపతి దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు ప్రాంతాలకు చెందిన భజనమండళ్లు ఆలయ పరిసరాల్లో నిర్వహించిన కోలాట భజనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలోని శ్రీహరి కళాతోరణ వేదికపై కోలాటాలు నిర్వహించారు. -
రేపు చినవెంకన్న తెప్పోత్సవం
ద్వారకా తిరుమల : క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం చినవెంకన్న తెప్పోత్సవం నేత్రపర్వంగా జరగనుంది. ఇందుకు క్షేత్రంలోని పుష్కరణి వద్ద సరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఏటా ఈ ఉత్సవాన్ని శ్రీవారి దేవస్థానం అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఏడు కూడా వేడుకను నేత్రపర్వంగా జరిపేందుకు దేవస్థానం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే శ్రీవారి పుష్కరణిని, గట్లును అలంకరించారు. పుష్కరణి పరిసరాలను విద్యుద్దీప తోరణాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. పుష్కరణి ముందు స్వామివారి భారీ విద్యుత్ కటౌట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. తెప్పను హంసగా ముస్తాబు చేస్తున్నారు. ఈ తెప్పోత్సవ వేడుక శనివారం రాత్రి 8.30 గంటలకు ప్రారంభమౌతుందని ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. -
విజయనగరంలో గిరిజన విశ్వవిశవివిద్యాలయం
ద్వారకా తిరుమల : కేంద్ర ప్రభుత్వ సహకారంతో గిరిజన విశ్వవిద్యాలయాన్ని విజయనగరంలో ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు భూసేకరణ కూడా జరిపినట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. ద్వారకా తిరుమల సాంఘిక సంక్షేమ గురుకుల, బాలికల జూనియర్ కళాశాలలో గురువారం క్యూరియాసిటీ కార్నివాల్2016 (వైజ్ఞానిక ప్రదర్శన)ను ఆయన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్లను సందర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రులు తిలకించారు. ఆ తరువాత జరిగిన సభలో మంత్రి రావెల మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను రెసిడెన్షియల్ పాఠశాలలుగా తీర్చిదిద్ది, పేద, బడుగు బలహీన వర్గాలు, ఎస్టీ, ఎస్సీ విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. మంత్రి సుజాత మాట్లాడుతూ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు విద్యలో జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. అందుకు ఉపాధ్యాయులు మరింతగా కృషిచేయాలన్నారు. అనంతరం మంత్రి రావెలను గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు గజమాలతో సత్కరించారు. రాజ్యసభ సభ్యురాలు తోట సీతా రామలక్ష్మి, ఎంపీపీ ప్రసాద్, జెడ్పీటీసీ లక్ష్మీ రమణి, సర్పంచ్ మల్లిపెద్ది ధనలక్ష్మి వెంకటేశ్వరరావు, వెలుగు పాఠశాల ప్రిన్సిపాల్ వై.సుధారాణి పాల్గొన్నారు. -
నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిత్యాన్నదాన ట్రస్టుకు ఓ భక్తురాలు బుధవారం రూ.1,00,116ను విరాళంగా అందజేశారు. నిడదవోలు మండలం సమిశ్రగూడేనికి చెందిన ఉజ్జిన రాధారూప విరాళం మొత్తాన్ని నిత్యాన్నదాన సదనంలో జమచేశారు. దాతకు ఆలయ చైర్మన్ ఎస్వీ.సుధాకరరావు విరాళం బాండ్‌ను, ప్రసాదాలను అందించి అభినందించారు. -
నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.5 లక్షల విరాళం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు ఇద్దరు భక్తులు వేర్వేరుగా శనివారం రూ.5 లక్షల విరాళం అందించారు. పాలకొల్లుకు చెందిన అడ్డాల వెంకట సత్యనారాయణ రూ.4 లక్షలు తన కుటుంబసభ్యుల పేరున అందజేశారు. పెనుగొండకు చెందిన పిల్లి సత్తిరాజు, లక్ష్మీ శైలజ దంపతులు వారి పేరున రూ.లక్ష జమచేశారు. దాతలకు ఈవో వేండ్ర త్రినాథరావు విరాళం బాండ్లు అందజేసి అభినందించారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు
ద్వారకాతిరుమల : శేషాచలకొండ ఘాట్రోడ్డుపైనుంచి దిగుతున్న ఒక కారు బ్రేకులు విఫలమవడంతో ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. కారులో ఉన్న భార్యాభర్తలు సీటుబెల్టు పెట్టుకోవడంతో సురక్షితంగా బయటపడ్డారు. విజయవాడకు చెందిన దైత మురళీకష్ణ తన భార్యతో కలిసి శ్రీవారి దర్శనార్థం ద్వారకాతిరుమలకు మంగళవారం సాయంత్రం కారులో వచ్చారు. తిరిగి వస్తుండగా, ప్రమాదం జరిగింది. కారు ముందు భాగం ధ్వంసమైంది. విద్యుత్ స్తంభం విరిగింది. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచింది. -
శ్రీవారి పుష్కరిణికి మోక్షం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి పుష్కరిణికి ఆలయ అధికారులు మోక్షం కలిగించారు. చెత్తాచెదారం, మురుగు పేరుకుపోయి భక్తులు స్నానాలు ఆచరించేందుకు వీలులేనంతగా తయారైన పుష్కరిణి దుస్థితిపై ఈనెల 20న ‘సాక్షి’లో ’శ్రీవారి పుష్కరిణికి ఏమిగతి’ అన్న శీర్షికన ప్రచురితమైన కథనానికి దేవస్థానం అధికారులు స్పందించారు. పుష్కరిణిని శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా శనివారం పుష్కరిణి ఒడ్డున పేరుకుపోయిన చెత్తాచెదారం, కోనేరు గట్లపై ఉన్న ముళ్ల చెట్లను తొలగించారు. మెట్లదారిని, పరిసరాలను శుభ్రం చేశారు. పుష్కరిణి పవిత్రతను కాపాడేందుకు, శుభ్రంగా ఉం చేందుకు స్థానికులు సహకరించాలని ఆల య ఈవో వేండ్ర త్రినాథరావు కోరారు. స్నానాలకు వీలుగా బోరు నీటిని పుష్కరిణిలోకి తోడుతున్నామని చెప్పారు. -
సినీఫక్కీలో కారు మాయం
ద్వారకాతిరుమల (పశ్చిమగోదావరి): కారు అద్దెకు తీసుకుని వచ్చిన ప్రయాణికులు డ్రైవర్‌కు మస్కా కొట్టి అతడి వద్ద ఉన్న సొత్తుతో పాటు కారునే దొంగిలించిన సంఘటన ద్వారకాతిరుమలలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, బా ధిత డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం ఉమ్మి గ్రామానికి చెందిన దాసరి వెంకట్రావు తన ఏపీ 30 కే 2703 నెంబర్ గల టాటా ఇండికా కారును కిరాయికి నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో రాజాం నుంచి గుంటూరు వెళ్లాలని తన పేరు క ల్లూరి జగదీశ్ అని చెప్పిన ఓ వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో శుక్రవారం ఇదే కారులో గుంటూరు బయలుదేరారు. మార్గమధ్యలో ద్వారకాతిరుమల వచ్చారు. రాత్రి కావడంతో స్థాని క టీటీడీ సత్రంలో గది అద్దెకు తీసుకుని విశ్రాంతి తీసుకున్నా రు. వెంకట్రావు మాత్రం కారులోనే నిద్రపోయాడు. శనివా రం ఉదయం ప్రయాణికులు కారు వద్దకు వచ్చి గుంటూరు వెళ్లాలని, త్వరగా సిద్ధం కావాలని డ్రైవర్ వెంకట్రావుకు సూ చించారు. దీంతో ప్రయాణికులు తీసుకున్న గదిలో దుస్తులు విడిచి వెంకట్రావు స్నానానికి వెళ్లాడు. ఇదే అదనుగా వెంకట్రావు దుస్తుల్లోని రెండు సెల్ఫోన్లు, నగదు ఉన్న పర్సు, కారు తాళాలు తీసుకుని ప్రయాణికులు కారుతో ఉడాయిం చారు. స్నానం ముగించుకుని వచ్చిన వెంకట్రావు కారు కనిపించకపోవడంతో ఖంగుతిన్నాడు. చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులు ఆశ్రయించాడు. ద్వారకాతిరుమల ఎస్సై పి.నాగవెంకటరాజు సత్రం వద్ద ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను, పరిసరాలను పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -

నేత్రపర్వం.. శ్రీవారి ఎదుర్కోలు ఉత్సవం
-
నేత్రపర్వం.. శ్రీవారి ఎదుర్కోలు ఉత్సవం
ద్వారకా తిరుమల : ద్వారకా తిరువుల దివ్యక్షేత్రంలో శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారి నిత్య కల్యాణ వుండపంలో నిర్వహించిన చినవెంకన్న ఎదుర్కోలు ఉత్సవం ఆద్యంతం కనుల పండువగా సాగింది. శ్రీవారి కల్యాణానికి వుుందురోజున ఈ ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించడం సంప్రదాÄýæుబద్ధంగా వస్తోంది. ఈ వేడుకకు బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యం ఉంది. ఎదుర్కోలు వేడుక ఇలా.. శ్రీవారి ఆలయ ఆవరణలో తొళక్కం వాహనంపై ఉభయ దేవేరులతో స్వామివారిని ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణలు చేశారు. అనంతరం అర్చకుల వేద వుంత్రోచ్ఛరణలు, బాజాభజంత్రీలు నడువు వాహనాన్ని ప్రధాన రాజగోపురం మీదుగా నిత్య కల్యాణ వుండపం వద్దకు తీసుకువచ్చారు. కల్యాణ వుండపంలో విశేషంగా అలంకరించిన వెండి శేషవాహనంపై ఉత్సవమూర్తులను ఉంచి, హారతులు సమర్పించి అర్చకులు ఎదుర్కోలు ఉత్సవాన్ని ప్రారంభించారు. కల్యాణవుండపంలో అధికారులు, అర్చకులు, పండితులు, భక్తులు రెండు జట్లుగా విడిపోయి ఒక జట్టు స్వామివారి గుణగణాలను, ఆÄýæున విశిష్టతను కొనియాడారు. రెండో జట్టు అవ్మువార్ల గుణగణాలను, వారి కీర్తిని తెలిÄýæుజేశారు. వివాహం జరిగే వుుందురోజు వధూవరుల తరపు బంధువ#లు శుభలేఖను పఠించేందుకు జరిపే కార్యక్రవుమే ఈ ఎదుర్కోలు ఉత్సవంగా పండితులు చెబుతున్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ వేడుక అనంతరం స్వామి, అమ్మవార్లను వెండి శేషవాహనంపై ఉంచి నిర్వహించిన తిరువీధి సేవ భక్తులను పరవశింపజేసింది. శ్రీహరి కళాతోరణ వేదికపై జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. బ్రహ్మోత్సవాల్లో నేడు ఉదయం 7 గంటల నుంచి సింహవాహనంపై శ్రీవారి గ్రామోత్సవం ఉదయం 8 గంటల నుంచి భజన సంకీర్తనలు ఉదయం 9.30 గంటల నుంచి కూచిపూడి నృత్యం సాయంత్రం 5 గంటలకు ఉపన్యాసం సాయంత్రం 6 గంటలకు భరతనాట్యం రాత్రి 7 గంటలకు కూచిపూడి నృత్యం రాత్రి 9 గంటల నుంచి శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం. అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు
ద్వారకా తిరుమల : ద్వారకా తిరుమల చినవెంకన్న క్షేత్రంలో ఈనెల 11 నుంచి 18 వరకు జరగనున్న శ్రీవారి ఆశ్వీయుజమాస బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయాన్ని, పరిసరాలను దేవస్థానం శోభాయమానంగా తీర్చిదిద్దుతోంది. ఆలయ గోపురాలకు విద్యుద్దీప అలంకరణలు, ప్రాకారాలకు రంగులు వేయడం వంటి పనులను సిబ్బంది శరవేగంగా నిర్వర్తిస్తున్నారు. ఆలయ ప్రధాన కూడలిలో 60 అడుగుల ద్వారకాధీశుని భారీ విద్యుత్ కటౌట్‌ను నిర్మిస్తున్నారు. శేషాచలకొండపై దేవతామూర్తుల భారీ విద్యుత్ కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు. క్షేత్రంలోని పలు ప్రధాన కూడళ్లలోను, భీమడోలు, గుండుగొలనులోను బ్రహ్మోత్సవాలను తెలిపే ఆర్చిగేట్లును నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఈనెల 11న స్వామి, అమ్మవార్లను పెండ్లికుమారునిగాను, పెండ్లికుమార్తెలుగాను ముస్తాబు చేయడంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతామని ఆలయ ఈవో వేండ్ర త్రినా«థరావు తెలిపారు. 15న రాత్రి 9 గంటలకు స్వామి, అమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తామని, మరుసటి రోజు రాత్రి శ్రీవారి రధోత్సవాన్ని క్షేత్ర పురవీధుల్లో జరుపుతామని వివరించారు. -
50 దేవాలయాల్లో ఆన్లైన్ సేవలు
ద్వారకా తిరుమల : రాష్ట్రంలో 50 దేవాలయాల్లో ఆన్లైన్ ద్వారా భక్తులకు సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనురాధ తెలిపారు. ద్వారకా తిరుమల మాధవకల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన అసిస్టెంట్ కుక్ పోస్టుల భర్తీ నిమిత్తం విచ్చేసిన ఆమె వారికి నైపుణ్య పరీక్షలను నిర్వహించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ విజయవాడలోని గొల్లపూడిలో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో భక్తులకు మౌలిక వసతులు కల్పించి, పచ్చని పరిశుభ్ర వాతావరణం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. యువతను భక్తివైపు నడిపించేలా ఆలయాలను తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు. -
హిందూ ధర్మాన్ని కాపాడాలి : మంత్రి
ద్వారకా తిరుమల : ప్రతి మనిషిలో దైవత్వాన్ని చూసిన నాడే సమ సమాజ స్థాపన సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని కాపాడాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ద్వారకా తిరుమల మాధవ కల్యాణ æమండపంలో నిర్వహిస్తున్న సమరసత సేవా ఫౌండేషన్ శిక్షణ తరగతుల్లో మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మం వంటి పలు అంశాలపై శిక్షణనిచ్చారు. వాసుదేవానంద స్వామిజీ, ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు, సమరసత సేవా ఫౌండేషన్ జనరల్ కార్యదర్శి పి.త్రినాథ్ పాల్గొన్నారు. -
11 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ద్వారకాతిరుమల : శ్రీవారి ఆశ్వయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 11 నుంచి 18 వరకు జరగనున్నట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. ప్రారంభం రోజైన విజయదశమి నాడు స్వామివారిని పెండ్లికుమారునిగాను, అమ్మవార్లను పెండ్లికుమార్తెలుగా అలంకరించడంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఉత్సవాల్లో భాగంగా వచ్చేనెల 12న ధ్వజారోహణను ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. స్వామివారి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు సర్వాది దేవతలను ఆహ్వానించే క్రమంలో ఈ ధ్వజారోహణను జరపడం పరిపాటి. 14న ఎదుర్కోలు ఉత్సవం, 15న చిన వెంకన్న దివ్య కల్యాణ మహోత్సవం జరపనున్నట్టు ఈవో చెప్పారు. 16న సాయంత్రం శ్రీవారి రథోత్సవం, 17న శ్రీచక్రవార్యూత్సవం, చూర్ణోత్సవం, వసంతోత్సవాలు, ధ్వజ అవరోహణ జరుపుతారు. 18న రాత్రి జరుగనున్న శ్రీపుష్పయాగోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని ఈవో చెప్పారు. ఉత్సవాల రోజుల్లో ఉదయం, సాయంత్రం స్వామివారు వివిధ వాహనాలపై క్షేత్ర పురవీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆయా రోజుల్లో శ్రీవారి నిత్యార్జిత కల్యాణం, ఆర్జిత సేవలు రద్దుకానున్నాయని ఈవో తెలిపారు. -
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ. 1.01 లక్షల విరాళం
ద్వారకా తిరుమల : ద్వారకా తిరుమల చిన వెంకన్న నిత్యాన్నదాన ట్రస్టుకు శుక్రవారం రూ.1,01,116 విరాళాన్ని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన మాటూరి రంగనాథ్ అమ్మ కన్స్ట్రక్షన్స్ పేరిట అందించారు. చెక్కును ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావుకు అందజేశారు. దాతకు బాండ్ పత్రాన్ని చైర్మన్ అందించి అభినందించారు. -
ఆసక్తికరంగా పాల పోటీలు
ద్వారకా తిరుమల : రాష్ట్రస్థాయి గోవుల పాలపోటీల్లో భాగంగా శుక్రవారం పాల సేకరణను నిర్వహించారు. స్థానిక మార్కెట్ యార్డులో వివిధ జాతుల గోవులు, గేదెల నుంచి ఉదయం, సాయంత్రం రెండు పూటల పాల ఉత్పత్తులను సేకరించారు. ఉదయం 8 గంటలకు, సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ సేకరణ దాదాపు గంటసేపు సాగింది. సేకరణ అనంతరం పాల ఉత్పత్తులను అధికారుల సమక్షంలో రైతులు తూకం వేయించి, నమోదు చేయించారు. అలాగే శనివారం ఉదయం సైతం ఇదే తరహాలో పాలను సేకరించి మూడుపూటల లభించిన ఉత్పత్తుల ఆధారంగా విజేతలను నిర్ణయించనున్నారు. ఉదయం మార్కెట్‌యార్డులో ఉన్న గో జాతులను ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నేత మేకా శేషుబాబు సందర్శించారు. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధకశాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో గెలుపొందే ముర్రా గేదెలు, ఒంగోలు ఆవులకు ప్ర«థమ బహుమతిగా రూ. 50 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 30 వేలు, తతీయ బహుమతిగా రూ. 20 వేలు అందచేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే గిర్, పుంగనూరు జాతి ఆవులకు ప్రథమ బహుమతిగా రూ. 25 వేలు, ద్వితీయ బహుమతిగా రూ. 15 వేలు, తతీయ బహుమతిగా రూ. 10 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. ఇందులో పాల్గొనే ప్రతి ఆవుకు ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నామన్నారు. శనివారం మద్యాహ్నం నుంచి జరిగే అందాల పోటీల్లో గెలుపొందే వాటికి తగు బహుమతులు అందించనున్నట్టు చెప్పారు. విజేతలకు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, జిల్లా ఇన్చార్జి మంత్రి అయ్యన్న పాత్రుడు చేతులు మీదుగా బహుమతి ప్రదానం ఉంటుందని నిర్వాహకులు చెప్పారు. -
హిందూ ధర్మం ఆధారంగా మోక్షం
ద్వారకా తిరుమల : హిందూ ధర్మం ఆధారంగానే ప్రపంచంలో వివిధ మతాల మధ్య సామరస్యం, శాంతి, అలాగే మోక్షం లభించగలవని, ఎవరూ మరొక మతంలోకి మారనవసరం లేదని హిందూ దేవాలయాల ప్రతిష్ఠాన పీఠాధిపతి (హైదరాబాద్) కమలానంద భారతీ స్వామీజీ అన్నారు. ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామిజీ మాట్లాడుతూ హిందూ ధర్మం, సంస్కృతి, జీవన విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు. -
నేత్రపర్వంగా లక్ష్మీగణపతి హోమం
ద్వారకాతిరుమల : క్షేత్రపాలకుడైన శివదేవుని ఆలయ ప్రాంగణంలో సిద్ధసంకల్పంలో భాగంగా ఆదివారం నిర్వహించిన లక్ష్మీగణపతి హోమం నేత్రపర్వంగా జరిగింది. నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం తలపెట్టిన మహాసంకల్పం సిద్ధించుటకు నిర్వహిస్తున్న సిద్ధసంకల్పంలో భాగంగా ఈ హోమాన్ని పండితులు వేద మంత్రోచ్ఛరణల నడుమ ఘనంగా జరిపారు. ఇందులో దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావుతో పాటు విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానం ఆస్థాన జోతిష్యులు పూజ్యం విశ్వనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో కొలువైన గణపతి దేవునికి విశేష అలంకారాలు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీగణపతి హోమం కన్నులపండువగా జరిగింది. ఈనెల 13న జరిగే మహాపూర్ణాహుతితో ఈ సిద్ధసంకల్పం పూర్తి కానున్నట్టు ఈవో వివరించారు. -
చినవెంకన్న ఆలయానికి 101 ఎల్ఈడీ బల్బుల బహూకరణ
ద్వారకాతిరుమల : చినవెంకన్న ఆలయానికి ఒక దాత 101 చైనా ఎల్ఈడీ బల్బులను దేవస్థానానికి అందజేశారు. గుడివాడకు చెందిన ఎన్.మీనాకుమారి, బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చ అధ్యక్షురాలు శరణాల మాలతీరాణితో కలసి వచ్చి ఈ ల్యాంప్స్‌ను దేవస్థానం ఛైర్మన్ సుధాకరరావుకు అందించారు. ఈ సందర్భంగా సుధాకరరావు మాట్లాడుతూ చైనాలో వ్యాపారం చేస్తున్న మీనాకుమారి అందించిన ఈ ల్యాంప్‌ల విలువ రూ. 2,12,100 అని చెప్పారు. మాలతీరాణి మాట్లాడుతూ చినవెంకన్న ఆలయానికి అశ్వాలు (గుర్రాలు) కూడా ఉంటే బాగుంటుందని, తాను బహుమతిగా ఒక అశ్వాన్ని అందజేస్తానని అన్నారు. నివతరావు, ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు, ఈఈ డీవీ భాస్కర్, రిటైర్డ్ ఈవో వీవీఎస్ఎన్.మూర్తి, ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు వెంపరాల నారాయణమూర్తి, ఉంగుటూరు మండలం బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలు శోభారాణి పాల్గొన్నారు. -
15 నుంచి గో పాల, అందాల పోటీలు
ద్వారకాతిరుమల : గోపాల, అందాల పోటీల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్థక శాఖ (ఏపీఎల్డీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీడీ కొండలరావు చెప్పారు. జిల్లా పశుగణాభివద్ధి సంస్థ ఆధ్వర్యంలో ద్వారకాతిరుమల మార్కెట్ యార్డులో ఈనెల 15 నుంచి 17 వరకు జాతి ఆవులకు పాల, అందాల పోటీలను నిర్వహించనున్నామని చెప్పారు. దీనిలో భాగంగా ఏర్పాట్లను పరిశీలించేందుకు తాను ఇక్కడకు వచ్చానని చెప్పారు. ఒంగోలు, ముర్రా, గిర్, పుంగనూరు జాతి ఆవులకు పాల పోటీలు నిర్వహిస్తామన్నారు. గెలుపొందిన ముర్రా గేదెలు, ఒంగోలు ఆవులకు ప్రథమ బహుమతిగా రూ.50 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.30 వేలు, తతీయ బహుమతిగా రూ.20 వేలు అందజేస్తామన్నారు. గిర్, పుంగనూరు జాతి ఆవులకు ప్రథమ బహుమతిగా రూ.25 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.15 వేలు, తృతీయ బహుమతిగా రూ.10 వేలు అందిస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే ప్రతి ఆవుకు ప్రోత్సాహక బహుమతి ఉంటుందన్నారు. జాతి లక్షణాలు ఆధారంగా ఆవులను, గిత్తలను ఎంపిక చేసి అందాల పోటీలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంత వాసులైనా పోటీల్లో పాల్గొనవచ్చని చెప్పారు. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ పి.గాంధీ, డివిజినల్ సహాయ సంచాలకుడు డాక్టర్ సత్యగోవింద్, జేడీ జ్ఞానేశ్వరరావు, ద్వారకాతిరుమల, పెంటపాడు, నిడదవోలు, భీమవరం మండలాల పశువైద్యులు కిరణ్, మురళీకష్ణ, నాయక్, కుమార్‌రాజా ఉన్నారు. -
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు మంగళవారం ఓ భక్తుడు రూ. లక్ష విరాళంగా అందజేశారు. ఏలూరుకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు జమ్మా రామకృష్ణ తన తల్లిదండ్రులు గంగరాజు, గంగామహాలక్ష్మి పేరున విరాళం అందజేశారు. ఆలయ అధికారులు దాతను అభినందించి విరాళం బాండ్ అందజేశారు. -
చినవెంకన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ ఆకుల వెంకట శేషసాయి ఆదివారం సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖమండపంలో అర్చకులు ఆయనకు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలికారు. ఆ తరువాత ఆలయ ఏఈవో కర్రా శ్రీనివాసరావు న్యాయమూర్తికి చినవెంకన్న చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఆయన వెంట భీమడోలు కోర్టు న్యాయమూర్తి ఎస్.వెంకటేశ్వరరెడ్డి, ఏలూరు కోర్టు ఎక్సైజ్ మెజిస్ట్రేట్ తిరుమలరావు, భీమడోలు సీఐ ఎం.వెంకటేశ్వరరావు తదితరులున్నారు. -
శ్రీవారి సేవలో మంత్రి కొల్లు
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ ప్రదక్షిణలు నిర్వహించిన అనంతరం శ్రీవారిని, అమ్మవార్లను దర్శించి, ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆ తరువాత ఆలయ ముఖమండపంలో అర్చకులు ఆయనకు స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలికారు. అనంతరం ఆలయ ఏఈవో కర్రా శ్రీనివాసరావు ఆయనకు శ్రీవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, టీడీపీ నాయకులు సుంకవల్లి బ్రహ్మయ్య, సోంబాబు, కూరాకుల బుజ్జి పాల్గొన్నారు. -

శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు విరాళం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు సోమవారం ఒక భక్తుడు రూ.1.08 లక్షలను విరాళంగా అందజేశారు. ఏలూరుకు చెందిన నరం అర్జునరావు, దమయంతి పేరున నరం సీతారామాంజనేయులు ఈ మొత్తాన్ని నిత్యాన్నదాన ట్రస్టుకు జమచేశారు. ముందుగా వీరు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఈవో వేండ్ర త్రినాథరావు దాతను అభినందించి విరాళం బాండ్ అందజేశారు. -
మహాలక్ష్మీ నమోస్తుతే..
ద్వారకా తిరుమల : ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయ ప్రాంగణంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నేత్రపర్వంగా సాగాయి. శ్రావణమాసంలో ఆఖరి శుక్రవారం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సుమారు 15 వందల మంది మహిళలు వ్రతాలు ఆచరించారు. ఆలయ తూర్పు రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై వరలక్ష్మీ దేవి అమ్మవారి విగ్రహాన్ని ఉంచి ప్రత్యేకంగా అలంకరించారు. వేదిక ముందు వందల సంఖ్యలో మహిళలు దేవస్థానం అందచేసిన పూజా సామగ్రితో కూర్చున్నారు. ఆలయ అర్చకులు, పండితులు, పురోహితులు మహిళలతో పూజా కార్యక్రమాన్ని వేద మంత్రోచ్ఛరణల నడుమ జరిపించారు. ఆలయ ఈవో వేండ్ర త్రినా«థరావు దంపతులు కూడా పాల్గొని పూజలు నిర్వహించారు. క్షేత్రపాలకుని ఆలయంలో వరుణజపాలు వర్షాలు సమద్ధిగా కురవాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చిన వెంకన్న క్షేత్రంలో వరుణ జపాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. క్షేత్రపాలకుడు భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో పండితులు ఈ జపాలను జరిపారు. తొలుత ఆలయ ముఖ మండపంలో విఘ్నేశ్వరపూజ, పుణ్యహవాచన, కలశస్థాపనను నిర్వహించారు. 28న శివదేవునికి సహస్ర ఘటాభిషేకాన్ని జరుపనున్నట్టు ఈవో తెలిపారు. ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి చినవెంకన్న క్షేత్రంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. ఉదయం శేషాచలకొండపై ఉన్న గోసంరక్షణ శాలలోని ఒంగోలు, కపిల ఆవులకు పండితులు, పురోహితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ భక్తులు విశేష పూజలు చేశారు. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని సప్తగోకులంలో శ్రీకృష్ణునికి పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం సాయంత్రం శ్రీవారి క్షేత్రంలో ఉట్లు పండుగ నిర్వహించనున్నట్టు ఈవో చెప్పారు. దీనిలో భాగంగా ఉభయదేవేరులతో శ్రీవారు క్షేత్ర పురవీధుల్లో ఊరేగుతారని తెలిపారు. -

నేటినుంచి వరుణ జపాలు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్ర ఉపాలయం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి 28వ తేదీ వరకు వరుణ జపాలు నిర్వహించనున్నట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. దీనిలో భాగంగా జరుగనున్న సహస్ర ఘటాభిషేకం నిమిత్తం ఘటాలు గురువారం ఆలయానికి చేరుకున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురిసి, రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుతూ మూడు రోజులపాటువరుణ సూక్త పారాయణలు, వారుణానువాక జపాలు, రుద్రహోమం, సహస్ర ఘటాభిషేకాలు నిర్వహించనున్నారు. 28న సహస్ర ఘటాభిషేకం నిర్వహించనున్నారు. -
డైటింగ్‌లో గజలక్ష్మి
ద్వారకాతిరుమల : సుమారు నాలుగున్నర టన్నుల బరువున్న శ్రీవారి దేవస్థానం ఏనుగు(గజలక్ష్మి) డాక్టర్ల సలహాపై డైటింగ్ ప్రారంభించింది. నాలుగేళ్ల క్రితం గజలక్ష్మికి అన్నంతో పాటు అరటిపండ్లును ఆహారంగా అందించేవారు. అయితే అప్పట్లో అది తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో చికిత్సనందించిన వైద్యులు బరువు తగ్గాలని సూచించారు. ఆహారం అందించే విషయంలో కూడా మార్పులు చేయాలని అధికారులకు వివరించారు. దీంతో గజలక్ష్మికి కొబ్బరి మట్టలు, మర్రి, రావి, జువ్వి ఆకులతో పాటు పచ్చగడ్డి, ఎండుగడ్డిని అందిస్తున్నారు. ఉదయం, సాయంత్రం రెండేసి గంటలు చొప్పున శేషాచలకొండపైన, ఘాట్ రోడ్డులోను వాకింగ్ చేయిస్తున్నారు. ఈ డైటింగ్, వాకింగ్‌లతో గజలక్ష్మి ఇప్పుడు కాస్త స్లిమ్ అవ్వడంతో పాటు, పూర్తి ఆరోగ్యంగా ఉంటోందని ఆలయ అధికారులు చెబుతున్నారు. వాకింగ్ అనంతరం గజలక్ష్మి ఫ్రెష్‌గా స్నానం చేసి భక్తులకు తన సేవలందిస్తోంది. -

పెళ్లికారుకు ప్రమాదం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల క్షేత్రం నుంచి విజయవాడ వెళుతున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి పక్కనే ఉన్న డ్రెయినేజీలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అద్దాలు పగులగొట్టుకుని బయటకు వచ్చారు. ఆదివారం వేకువజామున ద్వారకాతిరుమల కుంకుళ్లమ్మ ఆలయ సమీపంలో ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. విజయవాడకు చెందిన ముగ్గురు క్షేత్రంలో ఓ పెళ్లి ఏర్పాట్లు నిమిత్తం శనివారం రాత్రి శేషాచలకొండపైకి చేరుకున్నారు. ఏర్పాట్ల అనంతరం విజయవాడకు తమ కారులో తిరుగు ప్రయాణమయ్యారు. అయితే సంఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి మలుపులో ఉన్న రోడ్డుమధ్యలోని డివైడర్‌ను కారు ఢీకొట్టింది. దీంతో కారు డ్రెయినేజీలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. -
గో సంరక్షణ పథకానికి రూ.లక్ష విరాళం
ద్వారకాతిరుమల: గో సంరక్షణపై దాతలు చూపుతున్న శ్రద్ధ అభినందనీయమని ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకరరావు అన్నారు. శ్రీవారి గోసంరక్షణ పథకానికి ఆదివారం తూర్పుగోదావరి జిల్లా మల్కిపురానికి చెందిన సత్యవాడ వెంకట రామకృష్ణ రూ.1.05 లక్షలు విరాళం అందజేశారు. దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకరరావు దాత కుటుంబానికి విరాళం బాండ్ అందజేసి అభినందించారు.