నేత్రపర్వం.. శ్రీవారి ఎదుర్కోలు ఉత్సవం
ద్వారకా తిరుమల : ద్వారకా తిరువుల దివ్యక్షేత్రంలో శ్రీవారి ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారి నిత్య కల్యాణ వుండపంలో నిర్వహించిన చినవెంకన్న ఎదుర్కోలు ఉత్సవం ఆద్యంతం కనుల పండువగా సాగింది. శ్రీవారి కల్యాణానికి వుుందురోజున ఈ ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించడం సంప్రదాÄýæుబద్ధంగా వస్తోంది. ఈ వేడుకకు బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యం ఉంది.
ఎదుర్కోలు వేడుక ఇలా..
శ్రీవారి ఆలయ ఆవరణలో తొళక్కం వాహనంపై ఉభయ దేవేరులతో స్వామివారిని ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణలు చేశారు. అనంతరం అర్చకుల వేద వుంత్రోచ్ఛరణలు, బాజాభజంత్రీలు నడువు వాహనాన్ని ప్రధాన రాజగోపురం మీదుగా నిత్య కల్యాణ వుండపం వద్దకు తీసుకువచ్చారు. కల్యాణ వుండపంలో విశేషంగా అలంకరించిన వెండి శేషవాహనంపై ఉత్సవమూర్తులను ఉంచి, హారతులు సమర్పించి అర్చకులు ఎదుర్కోలు ఉత్సవాన్ని ప్రారంభించారు. కల్యాణవుండపంలో అధికారులు, అర్చకులు, పండితులు, భక్తులు రెండు జట్లుగా విడిపోయి ఒక జట్టు స్వామివారి గుణగణాలను, ఆÄýæున విశిష్టతను కొనియాడారు. రెండో జట్టు అవ్మువార్ల గుణగణాలను, వారి కీర్తిని తెలిÄýæుజేశారు. వివాహం జరిగే వుుందురోజు వధూవరుల తరపు బంధువ#లు శుభలేఖను పఠించేందుకు జరిపే కార్యక్రవుమే ఈ ఎదుర్కోలు ఉత్సవంగా పండితులు చెబుతున్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ వేడుక అనంతరం స్వామి, అమ్మవార్లను వెండి శేషవాహనంపై ఉంచి నిర్వహించిన తిరువీధి సేవ భక్తులను పరవశింపజేసింది. శ్రీహరి కళాతోరణ వేదికపై జరిగిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు
ఉదయం 7 గంటల నుంచి సింహవాహనంపై శ్రీవారి గ్రామోత్సవం
ఉదయం 8 గంటల నుంచి భజన సంకీర్తనలు
ఉదయం 9.30 గంటల నుంచి కూచిపూడి నృత్యం
సాయంత్రం 5 గంటలకు ఉపన్యాసం
సాయంత్రం 6 గంటలకు భరతనాట్యం
రాత్రి 7 గంటలకు కూచిపూడి నృత్యం
రాత్రి 9 గంటల నుంచి శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం. అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం.