నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.5 లక్షల విరాళం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు ఇద్దరు భక్తులు వేర్వేరుగా శనివారం రూ.5 లక్షల విరాళం అందించారు. పాలకొల్లుకు చెందిన అడ్డాల వెంకట సత్యనారాయణ రూ.4 లక్షలు తన కుటుంబసభ్యుల పేరున అందజేశారు. పెనుగొండకు చెందిన పిల్లి సత్తిరాజు, లక్ష్మీ శైలజ దంపతులు వారి పేరున రూ.లక్ష జమచేశారు. దాతలకు ఈవో వేండ్ర త్రినాథరావు విరాళం బాండ్‌లు అందజేసి అభినందించారు.