నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిత్యాన్నదాన ట్రస్టుకు ఓ భక్తురాలు బుధవారం రూ.1,00,116ను విరాళంగా అందజేశారు. నిడదవోలు మండలం సమిశ్రగూడేనికి చెందిన ఉజ్జిన రాధారూప విరాళం మొత్తాన్ని నిత్యాన్నదాన సదనంలో జమచేశారు. దాతకు ఆలయ చైర్మన్ ఎస్వీ.సుధాకరరావు విరాళం బాండ్‌ను, ప్రసాదాలను అందించి అభినందించారు.