సినీఫక్కీలో కారు మాయం
Published Sun, Oct 23 2016 12:07 AM | Last Updated on Mon, Sep 4 2017 6:00 PM
ద్వారకాతిరుమల (పశ్చిమగోదావరి): కారు అద్దెకు తీసుకుని వచ్చిన ప్రయాణికులు డ్రైవర్‌కు మస్కా కొట్టి అతడి వద్ద ఉన్న సొత్తుతో పాటు కారునే దొంగిలించిన సంఘటన ద్వారకాతిరుమలలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, బా ధిత డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం ఉమ్మి గ్రామానికి చెందిన దాసరి వెంకట్రావు తన ఏపీ 30 కే 2703 నెంబర్ గల టాటా ఇండికా కారును కిరాయికి నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో రాజాం నుంచి గుంటూరు వెళ్లాలని తన పేరు క ల్లూరి జగదీశ్ అని చెప్పిన ఓ వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో శుక్రవారం ఇదే కారులో గుంటూరు బయలుదేరారు. మార్గమధ్యలో ద్వారకాతిరుమల వచ్చారు. రాత్రి కావడంతో స్థాని క టీటీడీ సత్రంలో గది అద్దెకు తీసుకుని విశ్రాంతి తీసుకున్నా రు. వెంకట్రావు మాత్రం కారులోనే నిద్రపోయాడు. శనివా రం ఉదయం ప్రయాణికులు కారు వద్దకు వచ్చి గుంటూరు వెళ్లాలని, త్వరగా సిద్ధం కావాలని డ్రైవర్ వెంకట్రావుకు సూ చించారు. దీంతో ప్రయాణికులు తీసుకున్న గదిలో దుస్తులు విడిచి వెంకట్రావు స్నానానికి వెళ్లాడు. ఇదే అదనుగా వెంకట్రావు దుస్తుల్లోని రెండు సెల్‌ఫోన్లు, నగదు ఉన్న పర్సు, కారు తాళాలు తీసుకుని ప్రయాణికులు కారుతో ఉడాయిం చారు. స్నానం ముగించుకుని వచ్చిన వెంకట్రావు కారు కనిపించకపోవడంతో ఖంగుతిన్నాడు. చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులు ఆశ్రయించాడు. ద్వారకాతిరుమల ఎస్సై పి.నాగవెంకటరాజు సత్రం వద్ద ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను, పరిసరాలను పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Advertisement
Advertisement