గో సంరక్షణ పథకానికి రూ.లక్ష విరాళం
ద్వారకాతిరుమల: గో సంరక్షణపై దాతలు చూపుతున్న శ్రద్ధ అభినందనీయమని ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకరరావు అన్నారు. శ్రీవారి గోసంరక్షణ పథకానికి ఆదివారం తూర్పుగోదావరి జిల్లా మల్కిపురానికి చెందిన సత్యవాడ వెంకట రామకృష్ణ రూ.1.05 లక్షలు విరాళం అందజేశారు. దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకరరావు దాత కుటుంబానికి విరాళం బాండ్ అందజేసి అభినందించారు.