శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు విరాళం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు సోమవారం ఒక భక్తుడు రూ.1.08 లక్షలను విరాళంగా అందజేశారు. ఏలూరుకు చెందిన నరం అర్జునరావు, దమయంతి పేరున నరం సీతారామాంజనేయులు ఈ మొత్తాన్ని నిత్యాన్నదాన ట్రస్టుకు జమచేశారు. ముందుగా వీరు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఈవో వేండ్ర త్రినాథరావు దాతను అభినందించి విరాళం బాండ్ అందజేశారు.